Opinionక్రైంతెలంగాణనల్గొండ

Triple Murder Matrimony Killer : బిగ్ బ్రేకింగ్, సిలిండర్ పేలుడు కా నేకాదు పక్కా స్కెచ్‌తో త్రిపుల్ మ ర్డర్ మ్యాట్రిమోనీ కిల్లర్ గుట్టు రట్టు

Triple Murder Matrimony Killer : ప్రజా దీవెన, మిర్యా లగూడ:అది జూన్ 4వ తేదీ రాత్రి నల్లగొండ జిల్లా మిర్యాల గూడ పట్టణంలోని క లాల్ వాడ ప్రాంతమంతా గాఢ ని ద్ర లో ఉంది. అకస్మాత్తుగా ఒక ఇం ట్లోంచి మంటలు ఎగసిపడ్డా యి. క్ష ణాల్లో ఇల్లంతా వ్యాపించాయి. ఆ ప్రమాదంలో వనం చంద్రకళ, ఆమె మనవడు లక్ష్మణ్, మనుమరాలు ప్రణతి స జీవ దహనమయ్యారు. గ్యాస్ సిలిండర్ పేలడం వల్లే ఈ ఘోరం జరిగిందని అంతా భావిం చారు. కానీ, కట్ చేస్తే… సీ న్ రివ ర్స్ అయింది. అది ప్రమాదం కా దు… ముగ్గురిని ని లువునా కాల్చే సిన నరహంతకుడి పక్కా స్కెచ్ అని తేల్చా రు పోలీసులు.

ఈ ఘాతుకానికి సంబంధించిన వివరాలు నల్లగొండ జిల్లా ఎస్ శరత్ చంద్ర పవార్ ఆదివారం ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో వె ల్లడించారు. ఈ ఘాతుకానికి ఒ డి గట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కు చెందిన కాళహస్తి శిరీ ష్ కుమార్ (38). ఇతగాడి ప్రొఫైల్ చూస్తే మైండ్ బ్లాంక్ అ వ్వాల్సిందే. ‘తెలుగు మ్యాట్రిమోనీ’ వంటి వెబ్‌సైట్ల లో అ మాయక మహిళలను టా ర్గెట్ చేయడం, పెళ్లి పేరుతో న మ్మించి ముంచడం ఇతని అలవాటు. ఇలాగే బాధితురాలు ధనలక్ష్మిని కూడా ట్రాప్ చేసి రెండో పెళ్లి చేసు కున్నాడు. అ యితే, శిరీష్ బుద్ధి తెలిసి ధనలక్ష్మి అతడిని దూరం పె ట్టిం ది.

గతంలో హాజీపూర్‌లో ఒక మహిళ ను మోసం చేసిన కేసు లో శిరీష్ జై లుకు వెళ్ళాడు. ఆ సమయంలో భార్య ధనల క్ష్మి తనకు ఎలాంటి స హాయం చేయకపోవడం, బెయిల్ కో సం ప్రయత్నించకపోవడంతో ఆ మెపై పీక్స్ లో కసి పెంచుకు న్నాడు. ఎలాగైనా ఆమెను, ఆమె కు టుంబాన్ని ఖతం చే యాలని జైలు లోనే రివెంజ్ ప్లాన్ సిద్ధం చేసుకున్నాడు.

దొంగ స్కూటీ, ప్లాస్టిక్ క్యాన్, అర్థ రాత్రి ఘోరం

కథ కంచికి చేర్చడానికి పక్కాగా గ్రౌండ్ వర్క్ చేశాడు శిరీష్. రెక్కీ క్రైమ్ చేయడానికి కొన్ని రోజుల ముందే మిర్యాలగూడ వచ్చి అంతా గమనించాడు. ఘటన జరిగిన రోజు ఉదయం ఒక యాక్టివా స్కూ టీని దొంగిలించి మిర్యాలగూడ వైపు బ యలుదేరాడు. మార్గమధ్యంలో ఒక ప్లాస్టిక్ క్యాన్ కొని, బం కులో పెట్రోల్ నింపించుకున్నాడు. ఎవరికీ అనుమానం రా కుండా రోజంతా బైక్ పైనే తిరిగాడు.

అర్థరాత్రి అందరూ నిద్రపోయాక… పిల్లిలా ఇంట్లోకి చొరబ డ్డాడు. అక్క డ ఉన్న ప్లాస్టిక్ బకెట్‌లో పెట్రోల్ పోసి, నిద్రిస్తు న్న ముగ్గురిపై చల్లా డు. అగ్గిపుల్ల గీసి మంటలు అం టిం చాడు. ఈ క్రమంలో వాడికి కూ డా గాయాలయ్యాయి, అ యినా అక్కడి నుంచి గుట్టుచప్పుడు కాకుండా పారిపో యాడు.ఆ రోజు అ దృష్టవశాత్తూ ధనలక్ష్మి ఇంట్లో లేక పోవ డంతో ప్రాణాలతో బయట ప డింది. కానీ, ఆమె తల్లి, ఇద్దరు పిల్లలు మంటల్లో కాలిబూడిదయ్యారు.

సిలిండర్ పేలుడుగా చిత్రీకరించాల ని శిరీష్ చూసినా, నల్ల గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ బృందానికి అనుమానం వ చ్చింది. సాంకేతిక పరి జ్ఞానాన్ని నమ్ముకుని రంగంలోకి ది గి న పోలీసులకు కీలక ఆధారాలు దొరికాయి. కాలిపోయిన ఇంటి వెనుక పెట్రోల్ వాసన వస్తున్న బకెట్ దొరికడం, వంద లాది సీసీటీవీ ఫుటేజీలు, నిందితుడి మొబైల్ సిగ్న ల్స్ ట్రాక్ చేశారు,చివరకు నిందితు డిని పట్టుకుని, దొంగిలించిన స్కూ టీ, పెట్రోల్ క్యాన్, పాక్షికంగా కాలి న షర్ట్, హెల్మెట్, ఘటనా స్థలంలో వదిలేసిన చెప్పులను స్వాధీనం చేసుకున్నారు. ఇ దిలా ఉండగా అ త్యంత క్లిష్టమైన ఈ కేసును వేగంగా ఛే దించిన డీసీ ఆర్‌బీ డీఎస్పీ జి. రవి, వన్ టౌన్ ఇ న్స్పెక్టర్ నా గ భూషణరావు బృందాన్ని ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రత్యే కంగా అభినందించి నగదు పురస్కారాలు అందించారు.

 పీఎస్‌ ముందే ఆత్మహత్యాయత్నం

సిలిండర్ పేలి చనిపోయారనుకున్న తన పిల్లలను, తల్లిని శిరీష్‌ కు మార్ కసితీరా పెట్రోల్ పోసి చంపేశాడని తెలిసి ధ నలక్ష్మి గుండె పగిలిపోయింది. ఆదివారం మిర్యాల గూడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎ దుట ఆమె ఒంటిపై పెట్రోల్ పో సుకుని ఆత్మహత్యకు యత్నించడం సంచలనం సృష్టించిం ది. “నా తల్లి ని, పిల్లలను రాక్షసంగా చంపిన ఆ నరహంత కుడిని ఉరితీయాలి, వాడు బెయిల్‌పై వస్తే నన్ను కూడా వ దలడు… నన్నూ చంపేస్తాడు” అంటూ ఆమె రోదించిన తీరు స్థానికు లను కన్నీరు పెట్టించింది. సమయ స్ఫూర్తితో స్పం దించిన పోలీసులు, స్థానికులు ఆమెను అడ్డుకోవడంతో ప్ర మాదం తప్పింది. ప్రస్తుతం నిందితుడు కటకటాలపాల య్యాడు.

Related Articles

Back to top button