Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

TRS Ex minister Harish Rao : ఓటమి శాశ్వతం కాదు

--ఓటమి కేవలం స్పీడ్ బ్రేకర్ మాత్రమే --కాంగ్రెస్ ఎన్నికల్లో పచ్చి అబద్ధాలు చెప్పింది --భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు

ఓటమి శాశ్వతం కాదు

–ఓటమి కేవలం స్పీడ్ బ్రేకర్ మాత్రమే
–కాంగ్రెస్ ఎన్నికల్లో పచ్చి అబద్ధాలు చెప్పింది
–భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు

ప్రజా దీవెన/భువనగిరి: ఎన్నికల్లో ఓటమి శాశ్వతం కాదని, గెలుపు కు నాంది అని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ( harish Rao) పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓటమి అనేది స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని గుర్తు చేశారు. భువనగిరి నియోజక వర్గం బీఆర్ఎస్ ( BRS)  సమావేశానికి  ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిం చారు. భారీ సంఖ్యలో వచ్చిన కార్యకర్తల కు, నాయకులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

ఓడిపోయిన నియోజకవర్గంలో సభ పెడితే పట్టనంతమంది రావడం మన బలానికి చిహ్నమని ఆన్నారు. ఎన్నికల హామీలను నిలబెట్టు కోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ప్రచా రంలో అబద్ధాలు మాట్లాడిన కాంగ్రెస్ ( congress) అధికారంలోకి వచ్చాక అసహనం పెరిగిందని దుయ్యబట్టారు. రైతుబంధు పడడం లేదని జడ్పీ చైర్మన్‌గా బాధ్యతతో సందీప్ రెడ్డి అడిగితే ఆయనను పోలీసు లతో బయటికి పంపించారని, ఇది ఏక్కడి న్యాయమని ప్రశ్నించారు.

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి నల్లగొండ పై ప్రేమ ఉంటే సాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడాలి కాని రైతు బంధు పడడం లేదని ప్రశ్నిస్తే చె ప్పుతో కొట్టాలనడం ఏం సంస్కారమని హితవు పలికారు. శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులకు కేఆర్ఎంబీకి అప్పగించడం వల్ల నల్లగొండ కు తీవ్ర నష్టం జరుగుతుందని, సాగునీళ్లు, తాగునీళ్లు ఉండవని ఆందోళన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ ఎన్నికల్లో మన గురించి పచ్చి అబద్ధాలు చెప్పిందని, బీఆ ర్ఎస్, బీజేపీల మధ్య సంబంధం ఉందని దుష్ప్రచారం చేసిందని ఆరోపించారు. బిజెపి నాయకులు బండి సంజయ్, రఘనందన్ రా వు, ఈటల రాజేందర్‌ల ను ఓడించింది కాంగ్రెస్ కాదు బీఆర్ఎస్ పార్టీ అని గుర్తు చేశారు. ఎన్నికల హామీలను తప్పించుకోవడానికి అసలు అప్పును రెట్టింపు చేసి గ్లెబెల్స్ ప్రచారం చేస్తున్నారని విమ ర్శించారు.

నర్సింగ్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేసింది బి అర్ ఎస్ ప్రభుత్వ మని, కాంగ్రెస్ అపాయింట్‌మెంట్ మాత్రమే ఇచ్చిందని వివరించారు. మరి ఫిబ్రవరి 1న గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎందుకివ్వ లేదో జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చే వెంటనే రూ. 2 లక్షల రైతు రుణమాఫీ ఎందుకు చేయలేదని, వృద్ధులకు, వికలాంగు లకు ఫించన్ రూ. 4 వేలకు పెంచలేదాని, రూ. 2వేల ఫింఛన్‌ను కూడా సమయానికి ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతుబంధు, పింఛన్, రుణమాఫీ, కరెంట్, ఉద్యోగాలు, వడ్లకు బోనస్ అని హామీలను కాంగ్రెస్ అమలు చేయడం లేదు అంటూ తూర్పార పట్టారు. ఈ అంశాలన్నిoటిని ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృతంగా ప్రచా రం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ 420 హామీలపై గ్రామాల్లో, తండాల్లో చర్చకు పెట్టాలని కోరారు. దళిత బంధుకు మంజూరైన నిధులను ఆ కాంగ్రెస్ బ్యాంకుల్లో ఫ్రీజ్ చేసిందని, కార్యకర్తలందరూ కష్టపడండి ఎంపీ సీటు మనదేనంటు జోస్యం చెప్పారు.

స్థానిక ఎన్ని కల్లో కష్టపడి పోరాడి సత్తా చూపిద్దామని ఆన్నారు. తెలంగాణకు శ్రీరామరక్ష బీఆర్ఎస్ పార్టీనేనని, కాంగ్రెస్, బీజేపీలు వాటి స్వార్థం కోసమే పనిచేస్తాయని వివారించారు. బీఆర్ఎస్ తెలం గాణ ప్రయోజనాల కోసమే పోరాడుతుందని, కర్నాటక కాంగ్రెస్‌ను ప్రజలు తిరస్కరిస్తున్నారని చెప్పారు. అక్కడి 25 ఎంపీ సీట్లలో నాలుగైదు మాత్రమే వస్తాయంటున్నారు. ఇక్కడ కూడా హామీలను విస్మరించిన కాంగ్రెస్‌కు అదే గతి పడుతుందని తెలిపారు.

మనం భయపడాల్సిన అవసరం లేదు, భవిష్యత్తు మనదేనని ధీమా వ్యక్తంచేశారు. మనం అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సంక్షేమం కోసం పనిచేశామని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రజల కోసమే కొట్లాడదామని సూచించారు.అధికారపక్షమైనా, ప్రతిపక్షమైనా మనం ప్రజల పక్షంమేనని పునరుద్ఘాటించారు.