OpinionPoliticsజాతీయంతెలంగాణనల్గొండసూర్యాపేట జిల్లాహైదరాబాద్

Trs kalvakuntlakavitha roundtable meeting : బిగ్ బ్రేకింగ్, గర్జించిన నల్లగొండ’రౌండ్ టేబుల్’, అన్నదాతల ‘అరిగోస’పై కవిత పొలిటికల్ శంఖారావం

-- డిస్కం పేరుతో ఉచిత విద్యుత్ ఎత్తివేసే కుట్ర --వచ్చిననాటి నుంచి వ్యవసాయశాఖ పై సీఎం రివ్యూ లేదు --తల్లిని అలుసుగా చూస్తూ వ్యవసాయాన్ని కర్మకు వదిలే స్తున్నారు --ఉక్కు సంకల్పం ఉంటే వ్యవసాయ రంగంలో అద్భుతాలు చేయవచ్చు --ఒక పరిశ్రమగా గుర్తించి పారిశ్రామిక వేత్తలకు ఇస్తున్న సౌకర్యాలు రైతులకు ఇవ్వాలి --రాజు చేసేందుకు తెలంగాణ రక్షణ సేన ప్రత్యేక కార్యాచరణ చేపడుతుంది -- నల్లగొండ లో రైతు సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశంలో  కల్వకుంట్ల కవిత కస్సుబస్సు 

Trs kalvakuntlakavitha roundtable meeting : ప్రజా దీవెన, నల్లగొండ: అది మే ధావుల అడ్డా.. విప్లవాల పురిటి గడ్డ తెలంగాణ రాజకీయ ముఖ చి త్రాన్ని మార్చే సరికొత్త పోరాటానికి మళ్లీ అదే నల్గొండ వేదికైంది. తెలంగాణ రక్షణ సేన (TRS) చీఫ్ క ల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో న ల్గొండ లో నిర్వహించిన ‘రౌండ్ టేబుల్ సమావేశం’ ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో సెగలు రేపుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యా లపై, ముఖ్యంగా రైతాంగ సమస్యలపై కవిత అస్త్రశస్త్రాలను సంధించారు. ‘పాంచజన్యం’ (ఉచితవిద్య, వైద్యం, రైతుకు గౌరవం, యువతకు ఉపాధి, సామాజిక న్యాయం) అనే ఐ దు సూత్రాల ఎజెండాతో సరికొత్త భవిష్యత్తు వైపు అడు గు లు వేస్తున్నట్లు ఆమె ప్రకటించారు.

రైతు భరోసా’ ఎగ్గొట్టారు.. పుస్తెలు తాకట్టు పెట్టించారు

రాష్ట్రంలో వ్యవసాయరంగం సంక్షోభంలో కూరుకుపోయిం దని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమం త్రి అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా వ్యవ సాయ శాఖపై సమీక్ష చేయకపోవడం ఘోరమన్నారు. సీఎం పర్యవేక్షణ లేకపోతే అధికారులకు భయమెక్కడుంటుందని ప్ర శ్నించారు. ఇప్పటికే మూడుసార్లు ‘రైతుభరోసా’ ఎగ్గొట్టా రని, రుణ మాఫీ సగం మందికి కూడా కాలేదని మండిపడ్డా రు. మృగశిర కార్తె వచ్చినా పెట్టుబడి సాయం అందక రై తు లు మళ్లీ పుస్తెలు తాకట్టు పెట్టుకునే దయనీయ స్థితికి వ చ్చారని, బహుశా వచ్చే జడ్పీటీసీ ఎన్నికల కోసం దీన్ని ఆ పుతున్నారేమోనని ఎద్దేవా చేశారు.

 

కన్నీరు పెట్టిస్తున్న ధాన్యం కొనుగోళ్లు

75 లక్షల మెట్రిక్ టన్నులు కొంటా మని గొప్పలు చెప్పి, రవా ణా భారం రైతుపైనే వేశారని విమర్శించారు. క్వింటాకు 6 కి లోల తరుగు పేరిట దోపిడీ జరుగుతోందని, సంస్థాన్ నారా యణ్ పూర్ వద్ద కొనుగోలు చేయకపోవడంతో ధాన్యం మొ లకెత్తి రైతులు కన్నీరు పెడుతున్నా రని ఆవేదన వ్యక్తం చేశా రు. ఇందుకే తాము గతంలో సెక్రటేరియేట్ ముందు ధాన్యం పోసి నిరసన తె లిపామని, అయినా ప్రభుత్వానికి ‘ఆసో యి’ (స్పృహ) రాలేదని, ఇక రోడ్డెక్కి పోరాడటమే తరువా యి అని హెచ్చరించారు.

రైతు డిస్కం’ ఉచిత విద్యుత్ ఎత్తివేసే కుట్ర

ఈ రౌండ్ టేబుల్ వేదికగా కవిత ఒక సంచలన విషయాన్ని తెరపైకి తె చ్చారు. ‘రైతు డిస్కం’ పేరుతో రైతులకు ఇచ్చే ఉ చిత కరెంట్‌ను ఎత్తివేసేందుకు, ఒక డిస్కంను ప్రైవేట్ పరం చేసేందుకు ప్రభుత్వం తెర వెనుక కుట్రలు చేస్తోందని ఆరో పించారు. ఎవరితోనూ చర్చించకుండానే ప్రభుత్వం ఈఆ ర్సీ (ERC) కి దరఖాస్తు చేసుకుందని, పబ్లిక్ హియరింగ్‌లో ఈ విషయం బయటపడిందని చెబుతూ.. దీనిపై మే ధావు లు, రైతులు విస్తృతంగా చర్చించాల్సిన అవసరం ఉంద న్నారు.

 

  నల్లగొండ రిజర్వాయర్లపై నిర్లక్ష్యం

సాగునీటి ప్రాజెక్టుల విషయంలో నల్గొండకు తీవ్ర అన్యా యం జరుగుతోందని కవిత దుయ్యబట్టారు. వరంగల్‌లో రిజర్వాయర్లు ఉంటే కా లువలు నల్గొండలో ఉన్నాయని, ఇక్కడ రిజర్వాయర్లు లేకపోవడంతో రైతులకు మినిమం గ్యారంటీ లేకుండా పోయిందన్నారు. మునుగోడు, దేవర కొం డ నియోజకవర్గాలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రా జెక్టు ద్వారా నల్గొండకు కూడా నీరి వ్వాల్సి ఉండగా, సీఎం కేవలం పాలమూరు గు రించే మాట్లాడుతున్నారని విమర్శించారు.దిండి ప్రాజెక్ట్’ సో ర్స్ పాయింట్ కారణంగా మ హబూబ్ నగర్, నల్గొండ జిల్లా ల మధ్య గొడవలు జరిగే ప్రమాదం ఉందని, తక్షణమే ఆ సోర్స్ పాయింట్‌ను మార్చాలని సూచించారు.

     ‘అసైన్డ్’ భూముల దందా 

కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత చేసిన మరో కీలక ఆరోపణ భూ ములదందా. అసైన్డ్ భూములకు పట్టాలిస్తా మని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఇప్పు డు ఇండస్ట్రీస్ పేరుతో ప్రభుత్వం ఆ భూ ములను లాక్కుంటోంది. ఈ జిల్లాకు చెందిన ఒక మంత్రి, హై దరాబాద్ పరిసరాల్లో ఏకంగా 200 ఎకరాల అసైన్డ్ భూము లను కొని పెట్టుకున్నారు. చాలా మంది మంత్రులు ఇదే పని లో ఉన్నారు. ఎందుకంటే, ఎన్నికల చివరి సంవత్సరంలో అ సైన్డ్ భూములకు రైట్స్ (అమ్మకపు అధికారాలు) ఇస్తారట. అందుకే మంత్రులు ముందే కొని పె ట్టుకుంటున్నారు.” అని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.

పిడికెడు మందితోనే చరిత్ర తిరగ రాస్తాం!’

తమది కొత్త పార్టీయే అయినప్పటి కీ, సంఖ్యాబలం తక్కు వగా ఉందని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేద ని కవిత కార్యకర్తల కు పిలుపునిచ్చారు. చరిత్రలో పిడి కె డు మందితో ప్రారంభమై సామ్రా జ్యాలను మార్చిన ఉదా హరణలు ఉన్నాయన్నారు. రైతాంగ రక్షణ కోసం, నల్గొండ హక్కుల కోసం పెద్ద ఎత్తున రోడ్డెక్కి పోరాటం చేస్తామని, ఈ పోరాటంలో మేధావులు, రై తులు తమ పార్టీకి సలహాలు, సూచనలు అందించి తోడుగా నిలవాలని ఆమె కోరారు. నల్గొండ వేదిక గా కవిత చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అధి కార పక్షంలో ఎలాంటి అలజడి సృష్టిస్తాయో, ‘రైతు డి స్కం’, ‘అసైన్డ్ భూముల’ ఇష్యూస్ రాబోయే రోజుల్లో ఎలాంటి రా జ కీయ మలుపులు తిప్పుతాయో వేచి చూడాల్సి ఉంది.

రేవంత్ ప్రభుత్వం పై కవిత కస్సుబుస్సు 

వ్యవసాయరంగాన్ని, రైతులను రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తి గా నిర్లక్ష్యం చేస్తున్నారని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వ కుంట్ల కవిత విమర్శించారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా ఎగ్గొట్టటంతో పాటు వారి నుంచే తరుగు పేరుతో వెయ్యి కో ట్లకు పైగా కప్పం కట్టించుకున్న సిగ్గులేని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమన మండిపడ్డారు. ప్రభుత్వానికి ఉక్కు సంకల్పం ఉంటే వ్యవసాయ రం గంలో అద్భుతాలు చేయవచ్చని చె ప్పారు. కానీ అధికారం లోకి వచ్చిన నాటి నుంచి వ్యవసా య శాఖపై రేవంత్ రెడ్డి కనీసం రివ్యూ చేయలేదని విమర్శిం చారు. రైతులకు మేలు జరగాలంటే వ్యవసాయాన్ని ఒక పరిశ్రమగా గుర్తించి పారిశ్రా మిక వేత్తలకు ఇచ్చిన సౌకర్యా లు కల్పించాలని కవిత డి మాండ్ చేశారు.

రాజకీయ అవసరాలప్పుడే రైతు భరోసా ? 

రాజకీయ అవసరాలు ఉన్నప్పుడే మాత్రమే రైతు భరోసా వేస్తామంటే రైతులు అన్ని విషయాలు గమిస్తారని…సరైన సమయంలో బుద్ది చెబుతారని ప్రభుత్వాన్ని హెచ్చరించా రు. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో రైతులు సాగు నీరు లేక ఇబ్బంది పడుతున్నారని కవిత అన్నారు. ఇక్కడ రిజర్వా యర్లు కట్టాలని కోరినప్పటికీ పట్టించుకోవటం లేదని ఆవేద న వ్యక్తం చేశారు. వరంగల్ రిజర్వాయర్లు ఉంటే నల్గొండ లో కాలువలు ఉన్నాయన్నారు. పాలమూరు- రంగారెడ్డి ప్రా జెక్ట్ లో భాగంగా పాలమూరు నీళ్లు వచ్చే అంశమే తప్ప నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు నీళ్లిచ్చే అంశాన్ని ముఖ్యమం త్రి మాట్లాడటం లేదని కవిత విమర్శించారు. నల్గొండ, రంగా రెడ్డి జిల్లాలకు నీళ్లిచ్చే ఏర్పాట్లు చేయాలన్నారు. దిండి ప్రా జెక్ట్ సోర్స్ పాయింట్ ను మార్చి నల్గొండ, పాలమూర మధ్య వివాదం లేకుండా చేయాలన్నారు. అసైన్డ్ భూములకు పట్టా లిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్…ఇప్పుడు అసైన్డ్ భూములను పరిశ్రమ పేరుతో లాక్కుంటుందని మం డిపడ్డారు. జిల్లాకు చెందిన మంత్రి ఒకరు వందల ఎకరాల అసైన్డ్ భూములను కొని పెట్టుకుంటున్నారని…ఎన్నికల చివరి ఏడాది అసైన్డ్ భూములకు ప్రభుత్వం రైట్స్ ఇస్తుంద ని ఆయన ఇదంతా చేస్తున్నారని చెప్పారు. అసైన్డ్ భూము లను కాపాడుకోవాల్సిన అవసరముందని… అందుకు ప్రజ లంతా పోరాటానికి సిద్ధం కావాలని కవిత పిలుపుని చ్చా రు.

వ్యవసాయాన్ని పరిశ్రమగా గుర్తించాలి

వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తుండటంపై క విత ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో అత్యధిక మంది ఆధా రపడుతున్న ఈ రంగంలో సమూల మార్పులు తేవాల్సి ఉం దన్నారు. వ్యవసాయం యోగ్యంగా లేకపోవటంతో చాలా మంది రైతులు ఈ రంగాన్ని వీడుతున్నారంటూ వస్తున్న ని వేదికలు ఆవేదన కలిగిస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వాల కు ఉక్కు సంకల్పం ఉంటే వ్యవసాయ రంగంలో అద్భుతా లు చేయవచ్చని కవిత అన్నారు. వ్యవసాయాన్ని పరిశ్రమ గా గుర్తించి పారిశ్రామిక వేత్తలకు ఇస్తున్న సౌకర్యాలన్నీ వ్య వసాయ రంగానికి ఇవ్వాలన్నారు. ఒక పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వాలు ఎన్ని సౌకర్యాలు కల్పిస్తారో వ్యవ సాయ రంగానికి కూడా అన్ని సౌకర్యాలు సిద్ధం చేసి ఉంచా లని చెప్పారు. నాలుగు పైసలు బిచ్చం వేసినట్లు చేసి ఏదో దయ చూపుతున్నట్లు చేస్తే మార్పు రాదని అన్నారు.

పసిబి డ్డను కాపాడినట్లు వ్యవసాయ రంగాన్ని కాపాడుకో వాల్సిన అవసరం ఉందని చెప్పారు. అందుకు కావాల్సిన సమగ్ర కార్యాచరణ తెలంగాణ రక్షణ సేన వద్ద ఉందని కవి త అన్నారు. ముఖ్యంగా వ్యవసాయానికి మార్కెట్ కల్పిం చాలని, వ్యవసాయ ఉత్పత్తులకు బ్రాండ్ క్రియేట్ చేయా ల ని చెప్పా రు. ఎంపీగా ఉన్న సమయంలో జగిత్యాల మామి డి పండ్ల కు బ్రాండ్ క్రియేట్ చేసి డిమాండ్ పెరిగేలా తాను చే శానని కవిత చెప్పారు. వరి కాకుండా ఇతర పంటలు వేయా లని చెబుతున్న ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసు కుందో చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చి త్తశుద్ధి లేని కారణంగా మళ్లీ భారీ ఎత్తున వరిధాన్యం పండు తుందని…ఆ ధాన్యాన్ని కొనలేక ప్రభుత్వం మరోసారి చేతు లేత్తేసే పరిస్థితి వస్తుందని కవిత చెప్పారు. అందుకు పంట ల మార్పిడి విషయంలో ప్రభుత్వం శ్రద్ధతో పనిచేయాలని కోరారు. వ్యవసాయ రంగంలో అద్భుతాలు చేసే కార్యాచ రణ తమ వద్ద ఉందని కవిత అన్నారు. రైతు కాలనీలు, పా ర్టీలతో సంబంధం లేకుండా రైతు సంఘాలు ఏర్పాటు చే యాల్సిఉందని చెప్పారు.

    సమావేశంలో పది తీర్మానాలు

రౌండ్ టేబుల్ సమావేశంలో పది తీర్మానాలను ఆమోదించి నట్లు కవిత చెప్పారు. వాటిని చదివి వినిపించారు. 1. రైతు డిస్కం వద్దు, 2 యూరియ యాప్ తీసేయాలి, 3 బకాయి పడ్డ రైతు భరోసా తక్షణమే ఇవ్వాలి. 4 కౌలు రైతులను గు ర్తించి వారికి రైతు భరోసా ఇవ్వాలి. 5 రైతు కూలీలకు రూ. 12 వేలు ఇవ్వాలి. 6. నకిలీ విత్తనాలు, నకిలీ పురుగుల మందు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. 7. మూసీ కాలుష్యాన్ని నివారించాలి. 8 నిమ్మ, బత్తాయి రైతులకు అండగా ఉండాలి.9 పత్తి రైతుల సమస్యలను పట్టించుకో వాలి. 10 రైతు సమస్యలపై ఉమ్మడి కార్యాచరణతో భవి ష్యత్ ఉద్యమాలు చేయాలి. ఈ పది తీర్మానాలను ఆమో దించామని అన్నారు.

   రెండు లక్షల ఉద్యోగాలివ్వాలి

కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామన్న రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చే పని మొదలుపెట్టాలని కవిత కోరారు. 5 వేల కానిస్టేబుల్ ఉ ద్యోగాలు కాకుండా 20 వేల పోస్టులకు పెంచాలన్నారు. రా ష్ట్రంలో ఎప్పుడు 15 లక్షల మంది ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతూనే ఉంటారని అన్నారు. జీపీఓ, గ్రూప్ ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్లు వేయాలన్నారు. ఎస్సై జాబ్ కు 35 ఏళ్ల ఏజ్ రిలాక్సేషన్ ఎలా ఉందో కానిస్టేబుల్ జాబ్ కు కూడా అ దే విధంగా ఇవ్వాలని కోరారు. జీవో 46 ను వెంటనే రద్దు చేసి నిరుద్యోగులకు మేలు చేయాలన్నారు. ఉద్యమకారు లకు ప్రభుత్వం ఇవ్వాల్సిన భూమి కోసం జులై 2 పెద్ద ఎత్తు న భూపోరాటం చేయనున్నట్లు కవిత తెలిపారు. ఆ రోజు ఉప్పల్ భగాయత్ లో ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుం టామని…ఈ పోరాటానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావా లని కోరారు.

  బత్తాయి రైతుల కష్టాలను తీర్చాలి

నల్గొండ జిల్లాలో బత్తాయి రైతుల చాలా కష్టాల్లో ఉన్నారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. రౌండ్ టేబుల్ సమావేశంలో స్థానిక రైతులు చాలా మంది బత్తాయి రైతుల బాధలను వివరించటంతో వారి కష్టాలను తెలుసుకునేందుకు స్వయం గా మాడుగుల మండలంఇందుగుల గ్రామంలో బత్తాయి తో టను పరిశీలించారు. రైతుల కష్టాలను అడిగి తెలుసుకు న్నారు. నల్గొండ లో బత్తాయి, నిమ్మ, పత్తి రైతుల కష్టాలపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టాలని కవిత కోరారు. ము ఖ్యంగా వారికి మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని కోరారు. బత్తాయి రైతుల కష్టాల తీరే వరకు వారి తరఫున పోరాటం చేస్తామని చెప్పారు.

Related Articles

Back to top button