Tsrtc busbavan apuurvarao ips : టిఎస్ఆర్టిసి జాయింట్ డైరెక్టర్ గా అపూర్వరావు
--బాధ్యతలు స్వీకరించిన నల్లగొండ మాజీ ఎస్పీ
టీఎస్ఆర్టీసీ జాయింట్ డైరెక్టర్ గా అపూర్వరావు
—బాధ్యతలు స్వీకరించిన నల్లగొండ మాజీ ఎస్పీ
ప్రజా దీవెన/ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నూతన జాయింట్ డైరక్టర్ గా కె.అపూర్వ రావు ఐపీఎస్ బాధ్యతలు ( Telangana State Road Transport Corporation K. Apoorva Rao IPS responsibilities as the new joint director) స్వీకరించారు. హైదరాబాద్ బస్ భవన్ లోని తన ఛాంబర్ లో ఆమె మంగళవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. సీఐడీ, ఎస్పీగా విధులు నిర్వర్తిస్తోన్న శ్రీమతి అపూర్వరావును టీఎస్ఆర్టీసీ జాయింట్ డైరెక్టర్ గా ప్రభుత్వం సోమవారం నియమించింది.
హైదరాబాద్ చెందిన ఆమె 2014 ఐపీఎస్ బ్యాచ్ అధికారిణి కాగా వనపర్తి, గద్వాల, నల్లగొండ జిల్లాలకు ఎస్పీగా గతంలో ( 2014 IPS batch officer and previously SP of Vanaparthi, Gadwala and Nalgonda districts) పనిచేశారు. టీఎస్ఆర్టీసీకి జాయింట్ డైరెక్టర్ గా ఒక మహిళా ఐపీఎస్ అధికారి ణి నియమితులవడం ఇదే తొలిసారి. టీఎస్ఆర్టీసీ జాయింట్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన కె.అపూర్వరావుకు సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ శుభాకాంక్షలు తెలియజేశారు.
సంస్థ అభివృద్ధికి నిబద్ధతతో పనిచేయాలని ( To work with commitment for the development of the organization) ఆమెకు సూచించారు. ప్రజా రవాణా వ్యవస్థను ప్రాముఖ్యతను గుర్తించి టీఎస్ఆర్టీసీ చరిత్ర లో తొలిసారిగా మహిళా ఐపీఎస్ అధికారిని జాయింట్ డైరెక్టర్ గా నియమించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సజ్జనర్ కృతజ్ఞతలు (Sajjanar thanked Telangana State Government for appointing a woman IPS officer as Joint Director) తెలియజేశారు.
ఇదిలా ఉండగా తనను జాయింట్ డైరెక్టర్ గా నియమించిందుకు ఈ సందర్బంగా ప్రభుత్వానికి శ్రీమతి కె.అపూర్వరావు కృతజ్ఞతలు తెలి యజేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహా లక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు సౌకర్య పథకం విజయవంతంగా (Maha Lakshmi- free bus facility scheme for women successful) అ మలవుతోందని, ఆ పథకం మరింత సమర్థవంతంగా అమలు చేసేం దుకు తన వంతుగా కృషి చేస్తానని ఆమె అన్నారు.
దేశ ప్రజారవాణా వ్యవస్థలో తనదైన ముద్ర వేస్తోన్న టీఎస్ఆర్టీసీ వృద్ధికి పాటుపడతానని ( He said that he would support the growth of TSRTC, which is making its own mark in the country’s public transport system) చెప్పారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన అపూర్వ రావు కు ఆర్టీసీ ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలియ జేశారు.