Praja Deveena
Newspaper Banner
Date of Publish : 10 May 2026, 3:55 pm Posted by : praja deveena

ttd donor services : బిగ్ బ్రేకింగ్, భక్తులకు టీటీడీ శుభవార్త, శ్రీవారి సేవలో మీవిరాళంతో భక్తికి ప్రత్యేక గౌరవం

 

ttd donor services : ప్రజా దీవెన, తిరుమల: తిరుమల లో శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆశీ స్సులు పొందేందుకు ప్ర పంచం నలుమూలల నుంచి కోట్లాది భక్తులు చేరుకుంటున్న విషయం తెలిసిం దే. భక్తుల విరాళాలతో తిరుమల తిరుప తి దేవస్థానం (Tirumala Tirupati Devasthanams) అ నేక ఆధ్యాత్మిక, విద్యా, వైద్య, అన్నదాన సేవలను నిర్వహి స్తోంది.

ఈ సేవా కార్యక్రమాలకు భారీ వి రాళాలు అందించే భక్తు లకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రత్యేక దర్శనం, వసతి, ప్రసాదాల రూపంలో ప్రత్యేక గౌరవాన్ని కల్పి స్తోంది. రూ. 1 లక్ష విరాళం ఇస్తే సంవత్సరానికి 1రోజు ప్రత్యేక ద ర్శ నం అవకాశం కల్పిస్తారు. రూ. 1 00 ఆర్జిత సేవ టికెట్ పొం దే అవకాశం కూడా ఉంటుంది. అదే కోవ లో 6లడ్డూలతో పాటు మహాప్రసాదం, 20 సంవత్సరాల డోనర్ కార్డు,80G కింద ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది.

ఇక రూ. 5 లక్షల విరాళం ఇస్తే ముగ్గురికి 3 రోజుల VIP ద ర్శనం, 3 రోజుల వసతి సౌకర్యం,10 ల డ్డూలు + ప్రసా దా లు, ప్రత్యేక డోన ర్ సదుపాయాలు కల్పిస్తారు. ఆత ర్వా త రూ. 10 లక్షల విరాళం ఇస్తే మరింత ప్రాధాన్యతతో VIP ద ర్శనం, 20 లడ్డూలు + మహాప్రసా దం, Gold Dollar & Sil ver Med allion, ప్రత్యేక వసతి మరియు అదనపు ప్ర యో జనాలు ఉంటాయి.

ఇక రూ. 1 కోటి లేదా అంతకంటే ఎక్కువ విరాళం ఇస్తే జీవి తకాల VIP బ్రేక్ దర్శనంతో పాటు 5 మందికి ప్రత్యేక దర్శ నం,3రోజుల VIP సూట్ వసతి, అదే విధంగా సుప్ర భాత దర్శనం అవకాశం, 10 పెద్ద లడ్డూలు + ప్రసాదాలు, 5 గ్రా ముల Gold Dollar, వేద ఆశీర్వచనంతో పాటు ప్రత్యేక స త్కారం లభిస్తుంది. ఇదిలా ఉండగా మీ విరాళం ద్వారా అ నేక సేవా కార్యక్రమాలు కొనసాగుతుండగా, మీకు కూడా ప్ర త్యేక ఆధ్యాత్మిక అనుభూతి లభిస్తుందని టీటీడీ అధికారు లు వెల్లడిస్తున్నారు.