OpinionPoliticsజాతీయంతెలంగాణనల్గొండసూర్యాపేట జిల్లాహైదరాబాద్

Tungaturthi Congress internal conflicts : బిగ్ బ్రేకింగ్, సూర్యాపేట డిసిసి అధ్యక్షుడు గుడిపాటి సంచలన వ్యాఖ్య, తుంగతుర్తిలో కొత్త కమి టీల నియామకాలు చెల్లవు

Tungaturthi Congress internal conflicts : ప్రజా దీవె న, తుంగతుర్తి: టీపీసీసీ నుంచి తుది ఆదేశాలు వచ్చే వరకు తుంగ తుర్తి నియోజకవ ర్గంలో ఎటువంటి నూతన మండ ల, గ్రామ కమిటీలను వేయవద్దని సూర్యాపేట జిల్లా డీసీసీ అధ్య క్షు లు గుడిపాటి నరసయ్య ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం తుంగతుర్తి మండల కేంద్రంలో విలేకరుల సమా వేశంలో మాట్లాడారు.

సంఘటన్ సృజన్ అభియాన్ చైర్మన్ వేణుగోపాల్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమా ర్ గౌడ్ ఆదేశాల మేరకు తుంగ తుర్తి ని యోజకవర్గంలో ఇటీవల చే పట్టి న మండల పార్టీ నియామకాల వల్ల సొంత పార్టీలోనే భేదాభిప్రాయాలు తలె త్తాయని, దీంతో సీనియర్ కాంగ్రెస్ నా యకులు కార్యకర్తలు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దలు జగ్గారెడ్డిని కలిసి నియో జకవర్గ సమస్యలను వివరించారని ఆయన తెలిపారు.

ఈ సమస్యలపై నివేదిక తెప్పించుకున్న టీపీసీసీ అధ్యక్షు లు మహేష్ కుమార్ గౌడ్, తుది నిర్ణ యం తీసుకునే వరకు ఎటువంటి నూతన కమిటీలు వేయవద్దని ఆదేశించారని గుడిపాటి నరసయ్య పేర్కొన్నారు.తుంగతుర్తి ని యోజకవ ర్గ నూతన మండల అధ్యక్షులు ఎంపిక ప్రక్రియపై తుది నిర్ణ యం వచ్చే వరకు నియోజక వర్గంలో ఎక్కడా నూతన గ్రా మ కమిటీలు వేయరాదని ఆయన స్పష్టం చేశారు.

నూతన కమిటీ లు వేసి మళ్లీ పార్టీలో గందరగోళం సృష్టిం చవద్దని, పార్టీ నాయ కులు, కార్యకర్తలు సంయమనం పా టించాలని ఆయన హితవు పలికారు.ఈ సమావేశంలో కాం గ్రెస్ పార్టీ జిల్లా నాయకులు దొంగరి గోవర్ధన్, మాజీ మండల పార్టీ అధ్యక్షులు మడ్డి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button