Tungaturthi MLA Mandula Samuel : ప్రజా దీవెన, తుంగతుర్తి: పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసే కా ర్యకర్తలకు, నాయకులకు తగిన గుర్తింపు ఉంటుందని, వారి కే పార్టీ పదవులు, నామినేటెడ్ పదవులు దక్కుతాయని టీ పీసీసీ రాష్ట్ర ఉ పాధ్యక్షుడు, అబ్జర్వర్ కొండేటి మల్లయ్య, ఎమ్మెల్యే మందుల సా మే లు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కా ర్యాలయంలో జిల్లా కాంగ్రె స్ పార్టీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య అధ్యక్షతన జరిగిన నియోజకవ ర్గంలోని వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, ప ట్టణ అధ్యక్షులు, డి విజన్ అధ్యక్షుల ఎన్నిక సన్నాహక స మావేశంలో పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా కొండేటి మల్లయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో మూడు సంవత్సరాలు పాటు పని చేసిన వారికి పార్టీ పదవులు ఇవ్వ డం జరుగుతుందని అధిష్టానం ని ర్ణ యించిందన్నారు. దీనిని కూడా సవరించి టీపీసీసీ అధిష్టా నం దృష్టి కి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్ట ప డి పనిచేసిన కార్యకర్తలను ప్రభుత్వం గు ర్తింపు ఇస్తుందన్నారు.ప్ర భుత్వం ఏర్పడిన రెండేళ్లలో ప్రభు త్వం చేపట్టిన అనేక సంక్షేమ, అభి వృద్ధి కార్యక్రమాలను ప్ర జల్లోకి తీ సుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్కరికి కూడా సంక్షే మ పథకాలు అందలేదన్నారు.
అనంతరం ఎమ్మెల్యే మందుల సా మేలు మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చే స్తానని, నియోజకవర్గ ఏ ర్పడినప్పటి నుంచి కూడా అభివృ ద్ధికి నోచుకోలేవడం లేదని, రాష్ట్రం లోని 119 నియోజకవ ర్గాల్లో అత్యంత వెనకబడిన నియోజకవర్గ తుంగతుర్తి అ న్నారు. ఈ తుంగతుర్తి ప్రాంతంలో ఏదో ఒకటి చేయాల నే దృఢసంకల్పంతో ఉన్నానని, తా ను ఖచ్చితంగా చేసి తీరు తానన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి నిరంతరం పేద ప్రజల సంక్షేమ కోసం పని చేస్తున్నారని, ఏర్పడిన రెండేళ్లలోనే నిరుపేదలకు ఇందిర మ్మ ఇల్లు, రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఉచిత విద్యుత్, మహిళలకు బస్సులో ఉ చిత ప్రయాణం, హాస్టల్లో మెస్ ఛా ర్జీలను పెంచడం జరిగిందన్నారు. ఎందరో అమరవీరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ కేసీఆర్ కుటుంబ పాలన తో అన్ని వర్గాల ప్ర జలు విసుగు చెందారన్నారు. ఇ ప్పుడు అదే కుటుంబంలో ఆస్తుల పంపకాల పంచాయతీ జరుగు తుందన్నారు. ఒక్కొక్క నాయ కు డు ఇప్పుడే పార్టీకి దూర మవు తు న్నట్లు సోషల్ మీడియాలో రోజు చూస్తున్నామని అన్నారు.
రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నా యకత్వంలో ప్రజారంజక పాలన సాగుతుందన్నారు. ప్రతి కార్యకర్త కు తాను ఎల్ల ప్పు డూ అందుబాటులో ఉంటానని, ఏ కష్టం వచ్చిన తనకు తె లియజేస్తే పరిష్కారం చే స్తానన్నారు. పార్టీ పటిష్టత కోసం ప నిచేయాలని దిశానిర్దేశం చే శా రు. పార్టీ కోసం పనిచేసే వా రిని గుర్తించి వారికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా పార్టీ బలో పేతం అవుతుందన్నారు.
రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్ని కల్లో ప్రతి కార్యకర్త గె లు పే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్ర మంలో రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు చెవిటి వెంకన్న యాదవ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు తిరు మలప్రగడ అనురాధ కిషన్ రావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సూర్యాపే ట జిల్లా పార్టీ ఉపాధ్యక్షు లు దరూరి యోగానంద చార్యు లు, మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి, వైస్ చైర్మన్ చింతకుం ట్ల వెంకన్న, వివిధ మండలాల అధ్యక్షులు, యు వజన కాంగ్రెస్ నా యకులు, వివిధ గ్రామాల సర్పంచులు, మహిళా కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
