OpinionPoliticsతెలంగాణనల్గొండసూర్యాపేట జిల్లాహైదరాబాద్

Tungaturthi Political Rivalry Reaches Climax : పొలిటికల్ వార్ జోన్ గా గాంధీ భవన్, క్లైమాక్స్‌కు చేరిన తుంగతుర్తి రాజకీయ వర్గపోరు  

 

Tungaturthi Political Rivalry Reaches Climax:ప్రజా దీవెన, హైదరాబాద్: కాంగ్రెస్ హైకమాండ్ హెడ్‌క్వార్ట ర్స్ “గాంధీ భవన్” ప్రస్తుతం హై-వోల్టేజ్ పొలి టికల్ డ్రామాకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. తుంగతుర్తి నియోజకవర్గ ఆధిప త్యం కోసం జరుగుతున్న ఈ పొలిటికల్ క్లాష్, గత రెండు రో జులుగా గాంధీ భవన్‌ను ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాను తల పించేలా మా ర్చేసింది.సీనియర్ నేత జగ్గారెడ్డి తన ప్రత్యేక పొలిటికల్ ల్యాబ్‌లో తుంగతుర్తి కాంగ్రెస్ నాయకులతో వరు సగా నిర్వహిస్తున్న సీక్రెట్ ఢీ- బ్రీఫింగ్ సెష న్స్ ఇప్పుడు పార్టీ లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి.

24 గంటల పొలిటికల్ ఆపరేషన్: ఏం జరిగింది?

మొదటి రోజు జగ్గారెడ్డి నిన్న తుం గతుర్తికి చెందిన ఎంపీ చామల, డీ సీసీ చీఫ్, గ్రౌండ్ లెవెల్ మండల అధ్యక్షుల నుం చి క్షేత్రస్థాయి రిపోర్టు లను సేకరించారు. నియోజకవర్గంలో అసలేం జరుగుతుందనే దానిపై కంప్లీట్ పొలిటికల్ ఎక్స్‌రే తీశారు.అదే క్రమంలో రెండో రోజైన ఇవాళ ఆదివారం ఉద యం తుంగతుర్తి ఎ మ్మెల్యే మందుల సామేలు నేరుగా రం గంలోకి దిగారు. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే సామేలు వన్-ఆన్-వన్ భే టీ అయ్యారు.

గాంధీ భవన్ వేదికగా ‘పోటాపోటీ’ ధర్నాలు

ఒకవైపు లోపల జగ్గారెడ్డి గదిలో హై-లెవెల్ చర్చలు నడు స్తుంటే, బయట గాంధీ భవన్ ఆవరణం మాత్రం కార్యకర్తల నినాదాలతో దద్దరి ల్లిపోయిoది. ఎమ్మెల్యే సామేలుకు మద్ద తుగా ఆయన అనుచరులు, భారీగా తరలివచ్చి గాంధీ భవ న్ ముందు భారీ ధర్నాకు దిగారు. ఎమ్మెల్యే పవర్‌ను ఛాలెం జ్ చేయడం ఎవరితరం కాదంటూ స్లోగన్స్ ఇస్తున్నారు. ఒక వైపు బయట సా మేలు అనుచరులు ధర్నా చేస్తుంటే, లోప ల ఎమ్మెల్యే సామేలు స్వయంగా నియమించుకున్న మండ ల అధ్యక్షులతో జగ్గారెడ్డి విడివిడిగా భేటీ అవుతుండటం తీ వ్ర ఉత్కంఠ రేపుతోంది.

తుంగతుర్తి పీఠం ఎవరికి దక్కనుంది? జగ్గారెడ్డి రిపోర్ట్ ఏ మలుపు తి ప్పబోతోంది? ఈ పొలిటికల్ థ్రిల్ల ర్‌కు ఎండ్ కార్డ్ పడాలంటే మరి కొన్ని గంటలు వేచి చూడాల్సి ఉంది.

తుంగతుర్తి వివాదంపైఅధిష్టానానికి నివేదిక

పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

తుంగతుర్తి నియోజకవర్గ మండల అధ్యక్షులు నియామక పంచాయ తీ రెండోరోజు గాంధీభవంలో కొన సాగుతోంది. తుంగతుర్తి లో జరిగిన రగడ విషయమై ఇరు వర్గాలను వి చారణ చేయాల్సిందిగా రాష్ట్ర పీ సీసీ కార్యనిర్వహక కార్య దర్శి జగ్గారెడ్డిని అధిష్టానం నియమించడం శనివారం సీని యర్ కాంగ్రెస్ నాయకులు వారి వాంగ్మూలాలను జగ్గారెడ్డికి అందజేశారు. ఆదివారం తుంగతుర్తి శాసనసభ్యులు మం దుల సామేల్ 9 మండల పార్టీ అధ్యక్షులతో పాటు భారీ ఎ త్తున కార్యకర్తలతో గాంధీభవనకు చేరుకున్నారు. గాంధీభ వన్లో తన వాదనలను పిసిసి కార్యనిర్వహక కార్యదర్శి జ గ్గారెడ్డికి వినిపించారు. తాను నియమించిన మండల అ ధ్య క్షులలో అందరూ అర్హులేనని అనర్హులు ఎవరూ లేరని ఎ మ్మెల్యే జగ్గారెడ్డికి తెలిపారు .9 మందిలో ఏ ఒక్కరిని మా ర్చేది లేదని ఎమ్మెల్యే వివరించారు.

తుంగతుర్తి నియోజకవర్గ అభివృ ద్ధిలో తాను ఎంత మాత్రం రాజి ప డేది లేదని తెలిపారు .ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే ని యోజకవర్గంలో గత రెండున్నర సంవత్సరాలుగా తనను ఇబ్బందులు పెడుతున్న వి షయాన్ని సైతం జగ్గారెడ్డికి విన్న వించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే తో పాటు నూతనంగా ఎ న్నికైన మండల పార్టీ అధ్యక్షులను సైతం ఒకరికొరిగా వారి వాంగ్మూలాలను జగ్గారెడ్డి సేకరించినట్లు తెలిపారు.

ఈ సం దర్భంగా జగ్గారెడ్డి వారి వివరాలను సేకరించిన అ నంతరం ఇరువురి వాదనలు విన్నానని వాద నల సారాన్ని నివేదిక రూపంలో కాంగ్రెస్ అధిష్టానానికి అందజేస్తానని అ న్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక కు టుంబంలాంటిదని అన్నారు. తుంగతుర్తి పంచాయతీ అన్నదమ్ముల మధ్య వచ్చే పంచా యతీ లాంటిది అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ఎవరిపై వే టు ఉండదని ముందుగా ప్రాముఖ్యత ఎమ్మెల్యేకు ఉంటుం దని త ర్వాత ఎంపీకి అనంతరం డిసిసికి ఉంటుందని అ న్నారు.

తాను ఎంపీ చామల, ఎఐసిసి మెంబర్ రామ్ రెడ్డి సర్వోత్త మ్ రెడ్డి, డిసిసి అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య, వివరణలు కూడా శని వారం తీసుకున్నానని ఆదివారం ఎమ్మెల్యే మం దుల సామేలుతో పాటు మండల పార్టీ అధ్యక్షులు ముఖ్య నాయకుల వివరణ తీసు కున్నామని అన్నింటిని పరిశీలిం చి రిపోర్ట్ తయారుచేసి అధిష్టానానికి అందిస్తామని తెలిపా రు .ఈ సంద ర్భంగా గాంధీభవనకు ఎమ్మెల్యే వెంట తుంగ తుర్తి నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్య కర్త లు వెళ్లడం జరిగింది. గాంధీభ వన్ ముందు కూర్చుని ఎమ్మె ల్యే జిందాబాద్ నినాదాలతో గాంధీభ వన్ మార్మోగింది.

మూడు నాలుగు రోజులుగా గాంధీ భవన్ లో తుంగతుర్తి కాంగ్రెస్ నా యకుల కార్యకర్తల హల్చల్ సాగు తోంది. ఏది ఏమైనా కాంగ్రెస్ అధి ష్టానం ఇరుపక్షాల వాదనలు విని తు ది నిర్ణయం ఏంతీసుకుంటుందో అనే ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవు తుంది. ఇప్పటికైనా తుంగతుర్తిలో చెలరేగిన వివాదం సర్దుమణుగు తుందా? అధిష్టానం తమ నిర్ణయం తెలిపిన తర్వాత ఇరు వర్గాలు ఏ విధంగా స్పందిస్తాయో ?ఒకటి రెం డు రోజులు వేచి చూడాల్సిందే.

Related Articles

Back to top button