Tuwj Allam narayana journalist rally : ప్రజా దీవెన, నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర ఉద్యమ చరిత్రలో ఎన్నో సం స్థ లు, ఎన్నో వేదికలు ఏర్పడ్డప్ప టి కీ ఉద్యమ ఆవశ్యకత నుం చి పు ట్టి, రాష్ట్ర సాధన తర్వాత కూడా సమాజానికి, ము ఖ్యంగా జర్నలి స్టుల సంక్షేమానికి నిరంతరం అండగా నిలిచి న అరుదైన వేదికల్లో తెలంగాణ జర్నలిస్టు ఫోరం (టీజేఎ ఫ్) ఒకటని, “తెలంగాణ కోసమే తె లంగాణ జర్నలిస్టు” అనే నినాదం తో గుప్పెడు మంది జర్నలిస్టులతో ప్రారంభమైన ఈ వేదిక, తర్వాత తెలంగాణ ఉద్యమానికి మేధో శక్తి గా, ఆత్మగౌరవ స్వరంగా, కలం యోధుల సంఘటిత శక్తిగా ఎది గిందని టియుడబ్ల్యూజే నల్లగొండ జిల్లా అధ్యక్షుడు గుండ గోని జయ శంకర్ గౌడ్ పేర్కొన్నారు. తెలంగా ణ అనే పదమే అనేక వేదికల్లో ని రాకరణకు గురైన రోజుల్లో ప్రధాన మీడి యా సంస్థల్లో తెలంగాణ స మస్యలకు సరైన ప్రాధాన్యం లేక పోవడం, ఉద్యమ వార్తలను వక్రీక రించడం, ప్రాంతీయ అ న్యాయాలపై చర్చలు లేకపోవడం వంటి పరిస్థితుల్లో తెలం గాణ భావజాలం కలిగిన జర్నలిస్టులు ఒక ప్రత్యా మ్నాయ వేదిక అవసరాన్ని గు ర్తించగా అలా పుట్టిందే టీజేఎఫ్ అని గుర్తు చేశారు. తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం 25 వసంతాల సందర్భంగా టి యు డబ్ల్యూ జే జిల్లా శాఖ ఆధ్వర్యంలో న ల్లగొండ పెద్ద గడియారం సెంటర్ లో కొవ్వొ త్తుల ప్రదర్శన నిర్వహించ డంతో పాటు అమరవీరుల స్తూపం వద్ద నివా ళులర్పించడం జరిగింది.
జిల్లాల నుంచి రాజధాని వరకు తె లంగాణ స్వరాన్ని బలం గా వినిపిం చిందని, రైతుల ఆత్మహత్యలు, వి ద్యార్థుల ఉ ద్యమాలు, ఉద్యోగుల దీక్షలు, సింగరేణి కార్మికుల పోరా టా లు, ఫ్లోరోసిస్ బాధలు, సాగునీ టి సమస్యలు, ప్రాంతీయ వివక్ష… ఇలా తెలంగాణ సమాజంలోని ప్ర తి బాధను వార్త గా, ప్రతి ఆవేదన ను ఉద్యమ అజెండాగా మార్చిన వేదికగా టీజేఎఫ్ నిలిచిందన్నారు. ఈ ఉద్యమానికి ప్రధాన సారథిగా నిలిచిన వ్యక్తి అల్లం నారాయణ నాయకత్వంలో టీజేఎఫ్ కేవలం జ ర్నలిస్టు సంఘం కాకుండా తెలం గాణ ఉద్యమం లో కీలక మేధో వేది కగా రూపుదిద్దుకుందన్నారు.
వార్త అం టే కేవలం సమాచారమేగాదు… అది సమాజ చై తన్యానికి ఆయుధ మని ఆయన నిరూపించారన్నారు. తెలంగాణ ఉద్యమ సమయం లో టీజేఎఫ్ నిర్వహించిన సమావే శా లు, చర్చలు, ర్యాలీలు, నిరసన లు ఉద్యమానికి బలమైన భావజాల పునాది వేశాయని వివరించారు. తెలం గాణ కోసం కలంతోనే కాదని, అవసరమైనప్పుడు రోడ్లపైకి వచ్చి పోరాడిన అరుదైన జర్నలిస్టు ఉద్యమ వేదిక టీజేఎఫ్ అని, తెలంగాణ ఉద్యమ కాలంలో టీజేఎఫ్ జర్నలిస్టులు కేవలం వార్తలకే పరిమితం కాలేదు. తెలంగాణ ఆవేదనను తమ రచనల్లో ప్రతిబింబించడమే కాకుండా, ఉ ద్యమ రణరంగంలో ప్రత్యక్షంగా అడుగుపెట్టారని గుర్తు చే శారు.
ఉద్యోగ భద్రతను, యాజ మాన్య ఒత్తిడులను, రాజ కీయ బె దిరింపులను లెక్కచేయకుండా తె లంగాణ కోసం రోడ్లెక్కి నిరసనలు చేపట్టారు. ధర్నాలు, ర్యాలీలు, మాన వహారాలు, ఆందోళనలు, చ ర్చావేదికలు నిర్వహిస్తూ తెలం గాణ ఉద్యమానికి మేధోబలంతో పా టు ప్రత్యక్ష ఉద్యమ బలం కూడా అందించారన్నారు. అనేక సందర్భాల్లో పోలీ సులు అడ్డుకోవడం, కేసులు నమోదు చేయడం, మీడియా యాజ మాన్యాల ఒత్తిడులు వచ్చినా వెనక్కి తగ్గలేద విద్యా ర్థి ఉ ద్యమాలు, ఉద్యోగుల సమ్మెలు, సకల జనుల సమ్మె, మిలి యన్ మార్చ్, రైతుల ఆందోళనలు, సింగరేణి కార్మికుల పో రాటాలు… ఇలా తెలంగాణ సమాజం ఎక్కడ ఉద్యమిం చిం దో అక్కడ టీజేఎఫ్ జర్నలిస్టుల స్వరం వినిపించిందని తెలి పారు.

తెలంగాణ కోసం రాసిన ప్రతి అక్ష రం వెనుక ఒక ఆవేదన ఉందని, ప్రతి నిరసన వెనుక ఒక ఆత్మగౌర వం ఉందని, ఆ రెండింటినీ కలిపి ఉద్యమ శక్తిగా మార్చిన అరుదైన జర్నలి స్టుల వేదికే తెలంగాణ జర్న లిస్టు ఫోరం అని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వర కు టీజేఎఫ్ ఒక ఉద్యమ వేదికగా నిరంతరం పోరాడింది. రాష్ట్రం ఏ ర్పడిన తర్వాత కూడా ఆ స్పూర్తి ఆగిపోకుండా జర్నలిస్టుల హక్కులు, సంక్షే మం, భద్రత కోసం ప్రత్యే కంగా ఒక ట్రేడ్ యూనియన్ అవ సరమని భావించి టీజేఎఫ్ నుంచే తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడ బ్ల్యూజే) రూపుదిద్దు కుందని గుర్తు చేశారు.
ఉద్యమ వేదిక నుంచి హ క్కుల వేది కగా మారిన ఈ పరి ణామం తెలంగాణ జర్నలిస్టు చరి త్ర లో ఒక కీలక అధ్యా యమని చె ప్పారు. గుప్పెడు మంది కలం యో ధులు ప్రా రంభించిన ఉద్యమo, నే డు వేలాది జర్నలిస్టులకు స్ఫూర్తి అని , తెలంగాణ రాష్ట్ర సాధనలో కలంతో పోరాడిన ఆత రం జర్నలి స్టుల సేవలను గుర్తుచేసుకునే రోజ ని, తెలంగా ణ కోసం వార్త రాసిన ప్రతి కలం వెనుక ఒక ఉద్యమ గుం డె చప్పుడు ఉందని, ఆ చప్పుడికి రూపం ఇచ్చిన వేదికే తెలం గాణ జర్నలిస్టు ఫోరం అని కొనియాడారు.
టీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకు లు విజయ్ కుమార్ మా ట్లాడుతూ టీయూడబ్ల్యూజే ద్వారా జర్నలిస్టుల సమస్యల ను ప్రభుత్వ దృష్టికి తీ సుకెళ్లడం, జిల్లాల వారీగా విలేకరు లను ఐక్యం చేయడం, మీడియా కార్మికుల హక్కుల కోసం పోరాటం చేయడం వంటి కార్యక్రమాలు బలంగా కొనసా గా యని తెలిపా రు. జర్నలిస్టులపై ఎక్కడ దాడులు జరిగినా, ఎక్కడ అన్యాయం జరిగి నా స్పందించే శక్తిగా ఈ సంఘం ఎదిగిందని, గ్రామీణ విలేకరుల నుంచి పెద్ద మీడియా సంస్థ ల జర్నలిస్టుల వరకు అందరికీ ఒక అం డగా నిలబడే ప్రయ త్నం చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వా త అల్లం నారాయణ తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌గా సుదీ ర్ఘ కాలం పనిచేశారని దా దా పు పదేళ్లపాటు ఆ బాధ్యతల్లో కొ నసాగుతూ తెలంగాణ జర్నలిజం అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు.
ముఖ్యంగా జర్న లిస్టుల సంక్షేమంపై ఆయన చూపి న శ్రద్ధ ప్రత్యేకంగా చెప్పుకోవాలి.అప్పటి ముఖ్యమంత్రి కే. చంద్రశే ఖర్ రావు ను ఒప్పించి జర్నలిస్టుల సంక్షేమం కోసం కోట్లాది రూపాయ ల నిధి ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషిం చారన్నారు. ఈ ఫండ్ ద్వారా మరణించిన జర్నలిస్టుల కు టుంబాలకు తక్షణ ఆర్థిక సా యం అందించడం, వారి పిల్లల విద్యకు సహాయం చేయడం, అ నారోగ్య సమస్యల్లో అండ గా నిలవడం వంటి కార్యక్రమాలు అమ లులోకి వచ్చాయని తెలిపారు. జ ర్నలిస్టు కుటుంబం కష్టాల్లో పడితే ప్రభుత్వం, సంఘం తమ వెంటే ఉ న్నాయనే నమ్మకాన్ని కల్పించడం లో ఈ సంక్షేమ కార్యక్రమాలు కీల కంగా మారాయని, తెలం గాణ జ ర్నలిస్టు ఉద్యమం అంటే కేవలం రాజకీయ ఉద్య మం మాత్రమే కాదని,విఅది ఆత్మగౌరవం కోసం, వృ త్తి గౌ రవం కోసం, పత్రికా స్వేచ్ఛ కో సం సాగిన పోరాటం కూడా అని అన్నారు.
ఈ ప్రయాణంలో టీజే ఎఫ్ ఒక చరిత్రను సృ ష్టించిందని, ఉద్యమ కాలంలో తెలంగాణ స్వ రాన్ని వినిపిం చిన ఈ వేదికరాష్ట్రం ఏర్పడిన తర్వాత జర్నలిస్టుల సం క్షే మాన్ని కాపాడే దిశగా అడుగులు వేసిందన్నారు.నేడు కూ డా తెలం గాణలో జర్నలిస్టులపై దాడులు జరిగినప్పుడు, చిన్న పత్రిక లు ఇ బ్బందులు ఎదుర్కొన్నప్పుడు, గ్రా మీణ విలేకరులు సమస్యల్లో చి క్కుకున్నప్పుడు టీయూడబ్ల్యూజే స్పంది స్తూ నే ఉందని, ఆ స్పూర్తి, ఆ ఆవేశం, ఆ బాధ్యత అన్నీ టీ జే ఎఫ్ ఉద్యమ గర్భం నుంచే వచ్చి నవే అని గుర్తు చేస్తూ మే 31 టీజే ఎఫ్ ఆవిర్భావ దినోత్సవం కేవలం ఒక సంఘం వార్షికోత్సవం కాదని, తెలంగాణ జర్నలిజం ఆత్మగౌరవ యాత్రకు గుర్తుగా నిలిచే రోజన్నా రు.
ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూ జే జిల్లా ప్రధాన కార్యదర్శి వీరస్వా మి, జిల్లా నాయకులు ఫహిమొద్దీ న్, జనార్ధన్ రెడ్డి, దీకొండ రవిశంక ర్, పిల్లలమర్రి శ్రీనివాస్, ఎలక్ట్రాని క్ మీడి యా జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెంకటరెడ్డి, జాన య్య, నల్లగొండ డివిజన్ యూని యన్ నాయకులు నీలం వెంకట మధు, దండంపల్లి రవికుమార్ గౌ డ్, మధు, వీడి యో జర్నలిస్టుల అసోసి యేషన్ జిల్లా అధ్యక్ష కార్య దర్శు లు అల్లి మల్లికార్జున్, శ్రీనివా స్ గౌడ్, ఫోటో జర్నలిస్టు అసో సి యేషన్ అధ్యక్ష కార్యదర్శులు కం ది వేణు, ముచ్చర్ల వి జ య్, ముచ్చ ర్ల శ్రీనివాస్ గౌడ్, చిన్న పత్రికల సంఘం తరపు న మీసాల నరహరి, నవీన్, మధు, హరి, సైదులు, శివ కు మార్, తదితరులు పాల్గొన్నారు.

