Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Nomination: మా ఎమ్మెల్యేలను ముట్టుకో మాడి మసై పోతావ్..!

కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ముట్టుకుంటే.. మాడి మాసైపోతారని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. మహబూబ్​నగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా వంశీచంద్‌రెడ్డి శుక్రవారం నామినేషన్‌ వేశారు.

పిట్టల దొరకు తాతయ్యగా కేసీఆర్ తీరు
పాలమూరు ప్రజలు ఇకనైనా కళ్లు తెరవాలి
గడీల దొరలను ఇకపై ఎవరూ నమ్మబోరు
మహబూబ్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీ చంద్ రెడ్డి నామినేషన్

ప్రజాదీవెన, మహబూబ్ నగర్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ముట్టుకుంటే.. మాడి మాసైపోతారని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. మహబూబ్​నగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా వంశీచంద్‌రెడ్డి శుక్రవారం నామినేషన్‌ వేశారు. ఆయనతో పాటు సీఎం రేవంత్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. అంతకు ముందు నామినేషన్‌ పత్రాలు దాఖలు చేసేందుకు తన ఇంటి నుంచి భారీ ర్యాలీగా వెళ్లారు. వేలాది మంది కార్యకర్తలు పాల్గొన్న ఈ ర్యాలీలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ పదేళ్లలో పాలమూరుకు కేసీఆర్​ ఏం చేశారని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు.

ఏం చేశారని పాలమూరు ప్రజలు బీఆర్​ఎస్​కు ఓటేయాలని అడిగారు. పాలమూరు కోసం అనేక ప్రాజెక్టులు చేపట్టామన్న ఆయన, గులాబీ పార్టీ పదేళ్లుగా ఈ జిల్లాను ఎడారిగా మార్చిందని దుయ్యబట్టారు. ఇప్పటికైనా పాలమూరు ప్రజలు కళ్లు తెరిచారన్న సీఎం, గడీ దొరలను నమ్మరని స్పష్టంచేశారు. మాదిగల వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామన్న రేవంత్‌రెడ్డి, అందుకోసం పార్లమెంట్‌, సుప్రీంకోర్టులో పోరాడతామని హామీ ఇచ్చారు. వంశీచంద్‌కు ఓటేసి దిల్లీ పంపించి మహబూబ్‌నగర్‌ అభివృద్ధికి కృషిచేయాలని ప్రజలను రేవంత్‌ కోరారు.

కారు షెడ్డు నుంచి బయటకు రాదు

బీఆర్ఎస్ కారు షెడ్డు నుంచి బయటకు రాదు.. పాడైపోయిందని సీఎం రేవంత్‌రెడ్డి(Revanth reddy) స్పష్టం చేశారు. మహబూబ్‌నగర్‌లో ఎంపీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డికి(Vamshichander reddy ) మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. ‘‘20 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని కేసీఆర్‌ అంటున్నారు. ఇక్కడ కాపలా ఉన్నది రేవంత్‌రెడ్డి. మా ఎమ్మెల్యేలను ముట్టుకో.. మాడి మసైపోతావు. పాలమూరు కోసం అనేక ప్రాజెక్టులు చేపట్టాం. పదేళ్లుగా ఈ జిల్లాను ఎడారిగా మార్చారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తెచ్చారా? పార్లమెంటులో నిద్రపోవడానికా భారాసకు ఓటు వేయాలి?’’ అని రేవంత్ ప్రశ్నించారు.

పదేళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తెచ్చారా అని ప్రశ్నించారు. పార్లమెంటులో నిద్రపోవడానికి బీఆర్ఎస్ కు ఓటు వేయాలా అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కేవలం మూడునెలలు మాత్రమే అయ్యిందని, పిట్టల దొరకు తాతయ్యగా కేసీఆర్ తయారయ్యారని విమర్శించారు. పాలమూరుకు కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు. పనిలోపనిగా బీజేపీ అభ్యర్థి డీకే అరుణపైనా విరుచుకుపడ్డారు.

పదేళ్లలో కేంద్రంలో ఉన్న బీజేపీ తెలంగాణకు ఏం చేసిందని ప్రశ్నించారు. ఢిల్లీలో మోడీ, గల్లీలో కేసీఆర్ పాలనను చూశామన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయని, తమను ఓడించేందుకు ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. లక్ష మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.

ఎంపీ ఎన్నికల్లో పాలమూరులో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్ పాలమూరు నుంచి గెలిచి చేసిందేమి లేదని విమర్శించారు. పాలమూరును కేసీఆర్ నిర్లక్ష్యం చేశాడని… పాలమూరు లిప్ట్ ను కూడా పూర్తి చేయలేదన్నారు. గతంలో పాలమూరుకు మంత్రి పదవులు కూడా దక్కలేదని.. డీకే అరుణ కూడా ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదని విమర్శించారు. పాలమూరు అభివృద్ధి కావలంటే 2 ఎంపీ సీట్లలో కాంగ్రెస్ గెలిపించాలని కోరారు సీఎం రేవంత్. వంశీచంద్ రెడ్డిని లక్ష మెజార్టీతో గెలిపించాలన్నారు. కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కుట్ర చేస్తున్నాయని.. తనకు ఎమ్మెల్యేలను కాపాడుకునే శక్తి ఉందని సీఎం అన్నారు.

Vamshichander reddy nomination in mahaboobnagar