Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Vigilance is required: అప్రమత్తత అవసరం

--కేరళ టూ తెలంగాణకు కొత్త వేరియంట్ జేఎన్-1 --ఉసేలేని కరోనా మళ్ళీ నాలుగు కేసులతో పునః ప్రారంభం --గాంధీ ఆస్పత్రి ఐసోలేషన్ వార్డులో మొత్తం 9మంది --ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలని డబ్ల్యుహెచ్ఓ సూచన

అప్రమత్తత అవసరం

–కేరళ టూ తెలంగాణకు కొత్త వేరియంట్ జేఎన్-1
–ఉసేలేని కరోనా మళ్ళీ నాలుగు కేసులతో పునః ప్రారంభం
–గాంధీ ఆస్పత్రి ఐసోలేషన్ వార్డులో మొత్తం 9మంది
–ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలని డబ్ల్యుహెచ్ఓ సూచన

ప్రజా దీవెన/ హైదరాబాద్: రాష్ట్రంలో గత కొంతకాలంగా వాతావ రణంలో పెను మార్పులు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. అకస్మాత్తుగా వాతావరణం లో చోటు చేసుకుంటున్నా మార్పుల వల్ల ఇప్పటికే ప్రజలు జలుబు దగ్గు జ్వరం వంటి రుగ్మతల బారిన పడు తున్నారు. అంటు రోగాలతో అల్లాడుతున్న ప్రజలు ఆసుపత్రుల చు ట్టూ ప్రదక్షిణలు కొడుతున్న వైనాన్ని చూస్తూ వస్తున్నాం. ఈ నేపథ్యం లో ఓవైపు రెండు సంవత్సరాల కిందటి కరోనా భయాలు వెంటాడు తున్న క్రమంలోనే మరోమారు కరోనా ఛాయలు అలుముకునే సంద ర్భం వచ్చింది.

గత రెండేళ్లుగా ఊసే లేకుండా పోయిన కరోనా మళ్లీ ఒడి ఒడిగా విజృంభిస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని వైద్యారోగ్యశాఖ అధికారికంగానే ప్రకటిం చింది. తాజాగా రాష్ట్రంలో రెండు రోజుల నుంచి కరోనా బులెటిన్ విడుదల చేయడం కరోనా మళ్లీ కదం తొక్కనుందా అన్న అనుమా నాలను నిజం చేస్తుంది.

ఉన్నపలంగా ఒక్కరోజే నాలుగు కేసులు నమోదు అయినట్లు ప్రభుత్వం వెల్లడించడం, నిన్న ఒక్కరోజే 402 పరీక్షలు చేయగా అందులో నలుగురికి పాజిటివ్ రిపోర్ట్ రావటంతో గాంధీ ఆస్పత్రిలో కరోనా ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు మొత్తం 9 మంది కరోనా ఐసోలేషన్‎లో ఉన్నట్లు ఆసుపత్రి వైద్యులు వెల్లడిస్తున్నారు.
ప్రభుత్వo కీలక నిర్ణయం… రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుం డటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలు తప్పకుండా మాస్క్ ధరించాలని ఆదేశాలు జారీచేస్తూ మాస్క్ ధరించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా కొత్తగా 142 కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలు పుతూ దేశంలోని అన్ని రాష్ట్రాలను అత్యవసరంగా అప్రమత్తం చేసింది.

కరోనా కొత్త వేరియంట్ జే ఎన్-1 తో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. కరోనా కేసులు నమోదవుతుండటంతో ప్రజలు అప్ర మత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్ఓ సూచించింది. కాగా ఇప్పటి కే మూడు వేవ్‌లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడిన నేపద్యంలో ము ఖ్యంగా కరోనా తొలి రెండు వేవ్‌లో మరణాల సంఖ్య విపరీతంగా ఉందని గుర్తు చేసింది. తాజాగా కేరళలో మరో కొత్త వేరియంట్‌ జేఎన్‌-1 బీఏ -2.86 ఉప జాతిరకం కరోనా కేసుల సంఖ్య పెరుగు తుండటంతో ప్రజల మళ్లీ ఆందోళన చెందుతున్నారు.

చలికాలంలో ఈ వేరియంట్‌ ద్వారా ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ ఆదేశాలు జారీ చేసింది. అయితే కేరళలో బయటపడిన కోవిడ్ జేఎన్.1 యొక్క కొత్త సబ్-వేరియంట్ ఇన్‌ఫ్లుఎంజా లాంటి వ్యాధులను పర్యవేక్షించి నివేదికను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను కోరింది.

ఇదిలా ఉండ గా ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్-19 యొక్క కొత్త సబ్-వేరియంట్ జేఎన్.1ని ఆసక్తి వేరియంట్ గా వర్గీకరించి, దీని వల్ల ప్రజారోగ్యానికి పెద్దగా ముప్పు వాటిల్లదని స్పష్టం చేస్తోంది. ఇప్పటికే కోవిడ్ జే ఎన్.1 యొక్క కొత్త ఉప-వేరియంట్ వల్ల కలిగే ప్రపంచ ప్రజారోగ్య ప్రమాదం ప్రస్తుతం తక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటిం చింది.

ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్‌లు జే ఎన్.1 కోవిడ్-19 వైరస్ యొ క్క ఇతర వేరియంట్ల వల్ల సంభవించే వ్యాధి వ్యాప్తి మరణాల నుం చి రక్షణ కల్పిస్తాయని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. ప్రస్తుతం శ్వాస కోశ సంబంధిత వ్యాధులు కోవిడ్-19, జెఎన్.1 ఉప-వేరియంట్ ద్వారా వ్యాప్తి చెందుతున్నాయిని డబ్ల్యూహెచ్ఓ పేర్కొoది.