–బెజవాడను ముంచేసిన బుడమేరు
–జలావాసాలుగా మారిన కాలనీలు
–జలదిగ్బంధంలో ఆంద్రప్రదేశ్ పలు జిల్లాలు
–కలవరపెడుతున్న మహోగ్ర కృష్ణ మ్మ
–2009 తర్వాత మరోసారి ఇదే భారీ ప్రవాహం
Ap Vijayawada Floods:ప్రజా దీవెన, ఆంద్రప్రదేశ్: ఏపీలోని విజయవాడ నగరంపై బుడమేరు దండెత్తింది. కనీవినీ ఎరుగని స్థాయిలో ముంచెత్తి బీభత్సం సృష్టించింది. పదులసంఖ్యలో కాలనీలను చుట్టుముట్టి విజయవాడను విలయవాడగా మార్చేసింది. అటు కృష్ణమ్మ ఉగ్ర రూపం… ఇటు బుడమేరు కన్నెర్రతో బెజవాడ (Bejwada)బెంబేలెత్తింది. శుక్రవారం రాత్రి నుంచి ఏకాధాటిగా కురిసిన వాన శనివారం సాయంత్రానికి ఉపశమించంతో నగరం కాస్త ఊపిరి పీల్చుకుంది. కానీ, కృష్ణా పరివాహక ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు బుడమేరు పొంగి పొర్లింది. అప్పటికే కృష్ణమ్మ భారీగా ప్రవహిస్తుండటంతో.. బుడమేరు చానల్ నుంచి నదిలోకి నీరు కలిసే అవకాశం లేకపోయింది. పైగా… కృష్ణా నది నీరు కూడా ఎగదన్నింది. దీంతో బుడమేరు కట్టలు తెంచుకు న్నట్లు గా చెలరేగిపోయింది. ఫలితంగా బుడమేరును ఆనుకుని ఉన్న జక్కంపూడి కాలనీ, అజిత్‌సింగ్ నగర్, పాత రాజరాజేశ్వరిపేట, కొత్త రాజరాజేశ్వరిపేట, అయో ధ్యనగర్, దేవీనగర్, రాజీవ్‌నగర్, ఆంధ్రప్రభ కాలనీ, వాంబే కాలనీ, చిట్టినగర్, పాల ఫ్యాక్టరీ, కబేళా, ఉర్మిళా నగర్, పాయకాపురం, భవానీపురం ప్రాంతాలు పూర్తిగా జలమ యమ య్యాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం భ్రావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురు స్తున్నాయి. కృష్ణా, గుంటూరు, ప్రకా శం, ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో మూడు రోజులుగా కుండ పోత వర్షాలు కురు స్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్థ మైం ది. దీనికితోడు ఎగువ ప్రాంతాల నుంచి పోటెత్తుతున్న వరద కార ణంగా జిల్లాలు జలదిగ్బంధమ య్యాయి. దీంతో ఆయా జిల్లాల అధికారులు రంగంలోకి దిగి సహా యక చర్యలు చేపట్టారు. మరోవై పు వరద ప్రభావిత జిల్లాల్లో సోమ వారం అన్ని విద్యాసంస్థలకు సెల వు ప్రకటించారు. గత 48 గంటల్లో కురిసిన భారీ వర్షాలతో (Heavy rains) ప్రకాశం జిల్లాలోని పలు దాదాపు అన్ని ప్రాంతాలూ నీట మునిగాయి. పలుచోట్ల వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో జన జీవనం స్తంభించింది. భారీ వర్షాలు, వరదల కారణంగా కృష్ణా మిల్క్ యూని యన్‌కు రూ.70 కోట్ల నష్టం వాటి ల్లింది.
విజయవాడ కొత్తపేటలో కృష్ణా మిల్క్ యూనియన్ పాల ఫ్యాక్టరీ ప్రధాన కార్యాలయం ఉం ది. ఇక్కడ పాల సేకరణతో పాటు పాల పదార్థాలు తయారు చేసే ప్లాంట్లు ఉన్నాయి. ఈ ఫ్యాక్ట రీకి కొంతదూరం నుంచి బుడమేరు కాల్వలో వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో కొత్తపేట, ఫ్యాక్టరీ ప్రాం తాలు నీట మునిగాయి. ఫ్యాక్టరీ లోకి 5అడుగుల మేరకు నీరు చేరింది. ఫ్రిజ్‌లు మొత్తం ఆగిపోయి పదార్థాలు పాడైపోవడంతో రూ.70 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని ఎండీ కె.ఈశ్వరరావు, చైర్మన్ చలసాని ఆంజనేయులు తెలి పారు. ఆయా ప్రాంతాల్లో ఐదు నుం చి ఎనిమిది అడుగుల మేరకు నీరు చేరడంతో ఆ ప్రాంతం జలసంద్రాన్ని తలపించింది. ఆదివారం ఉదయా నికే అపార్టుమెంట్లు సెల్లార్‌లలోకి నీరు ప్రవేశించింది. తర్వాత కాసేప టికి అపార్టుమెంట్ల మొదటి అంత స్తు వరకు చేరింది. సుమారు 2 లక్షల మంది వరదనీటిలో ( floodwaters) చిక్కు కున్నారు.
అజిత్‌సింగ్ నగర్, పాయకాపురం ప్రాంతాలను ఏకంగా 8 అడుగుల మేరకు ముంచెత్తింది. ఇతర ప్రాంతాల్లో ఐదు నుంచి ఎనిమిది అడుగుల మేర నీళ్లు నిలిచాయి. జక్కం పూడిలోని రాజీవ్ స్వగృహ ఫ్లాట్లు మొదటి అంతస్తు వరకు మునిగి పోయాయి. ఇక, విజయవాడ సమీపంలోని గ్రామాలపైనా బుడమేరు ప్రభావం పడింది. ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam) మండలం రాయనపాడు, కవులూరు, ఈలప్రోలు, పైడూరుపాడు, కొండపల్లి ఇందిరమ్మ కాలనీ, ఇబ్రహీంపట్నం ఖాజీ మాన్యంలోకి వరద నీరు వచ్చి చేరింది. వేలాది ఎకరాల భూములు నీటమునిగాయి. రాయనపాడు వద్ద రైల్వేట్రాక్‌పైకి (Railway track)వరద నీరు చేరడంతో తమిళనాడు, గోదావరి, చార్మినార్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలిచిపోయాయి. బుడమేరు ఈస్థాయిలో దండెత్తడం మాత్రం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి. మున్నేరు వాగు నందిగామ మండలం ఐతవరం వద్ద జాతీయ రహదారిని ముంచెత్తింది దీంతో హైదరాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాలను చిల్లకల్లు వద్ద, విజయవాడ వైపు నుంచి వెళ్లే వాహనాలను కీసర వద్ద నిలిపివేశారు. ఇక… 2009 తర్వాత కృష్ణమ్మ (Krishnamma)మరోసారి భీకరావతారం దాల్చింది. ఆదివారం రాత్రికే ప్రకాశం బ్యారేజీ నుంచి 9 లక్షల క్యూసెక్కుల వరద ప్రవహిస్తోంది. తెల్లవారేసరికి ఇది పది లక్షల క్యూసెక్కులు దాటే అవకాశముంది. ప్రభుత్వ యంత్రాంగం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది.