Viral Video: ప్రజా దీవెన, చైనా: మయ న్మార్ ను అతలాకుతలం చేసిన పెను భూకంపం ప్రభావం చుట్టు ప క్కల దేశాలపైనా పడింది. థాయ్ లాండ్ లోనూ భారీ నష్టం వాటిల్ల గా పొరు గునే ఉన్న చైనాలోనూ భూమి కం పించిన విషయం తెలిసిందే. భూ కంపం ధాటికి చైనాలోని ఓ ఆసు పత్రి తీవ్రంగా కంపించగా ఆసుపత్రి భవనం ఊయల మాదిరిగా ఊగి పోయింది. దీంతో అప్పుడే జన్మిం చిన పసికందులను ఉంచిన వార్డు లో భయానక పరిస్థితులు నెలకొ న్నాయి. పసికందులను ఉంచిన స్ట్రోలర్లు గదిలో చెల్లాచెదురయ్యా యి. దీంతో అక్కడే ఉన్న నర్సులు వెంటనే అప్రమత్తమయ్యారు. భవ నం కూలిపోయే ప్రమాదం ఉన్నా వెరవకుండా పిల్లలను కాపాడటా నికి ప్రయత్నించారు.
సరిగ్గా నిలబడలేని పరిస్థితిలో కూడా నర్సులు పిల్లల స్ట్రోలర్లు కదలకుండా పట్టుకున్నారు. ఓ నర్సు శిశువును ఎత్తుకుని, స్ట్రోలర్ లో ఉన్న మరో శిశువును కాపాడ టానికి ప్రయత్నించడం, మరొక నర్సు నాలుగు స్ట్రోలర్లను పట్టు కుని నిలబడడం ఆసుపత్రిలోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిం ది. ఈ వీడియోను సోషల్ మీడి యాలో అప్ లోడ్ చేయగా వైరల్ అయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ నర్సుల అంకిత భావానికి ప్రశంసలు కురిపిస్తున్నా రు. ఈ వీడియో తమను కదిలిం చిందని, మనుషుల్లో రాక్షసత్వం పెరిగిపోతున్న ఈ రోజుల్లో మాన వత్వం ఇంకా మిగిలే ఉందని ఈ వీడియో చూస్తే తెలుస్తోందని కా మెంట్లు పెడుతున్నారు.
earthquake in chaina hospital pic.twitter.com/aBoGnoAXws
— praja deveena web site and digital edition e paper (@PDeveena40655) March 30, 2025