Praja Deveena
Newspaper Banner
Date of Publish : 12 January 2026, 1:32 pm Posted by : praja deveena

vivekananda jayanti : వివేకానందుని బోధనలు స్ఫూర్తిదా యకం

 

vivekananda jayanti : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: వివే కానందుని బోధనలను స్ఫూర్తి గా తీసుకొని ముందుకు సాగాలని స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు క లెక్టర్, నల్గొండ ఆర్డిఓ వై .అశోక్ రెడ్డి పిలుపునిచ్చారు. జాతీయ యువ జన దినోత్సవం స్వామి వివే కానంద 164 వ జయంతిని పురస్కరించుకొని సోమవారం ఆయ న అదనపు ఎస్ పి రమేష్ తో కలిసి నల్గొండ జిల్లా కేంద్రంలోని స్వా మి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మీడియా ప్రతినిధు లతో మాట్లాడుతూ స్వామి వి వేకానంద భారతీయ సంస్కృతిని ప్రపం చవ్యాప్తంగా చాటి చెప్పా డని, అ మెరికా, ఇంగ్లాండ్ లాంటి దేశాలలో తన బోధనల ద్వారా భారతదేశ ఔ న్నత్యాన్ని చాటి చెప్పాడని అన్నా రు. ఆయన ఇచ్చిన సందేశానికి ఆ కర్షితులైన యువత ఇప్పటికీ ఆయ న బోధనలను పాటిస్తున్నారని , జా తి నిర్మాణంలో ఆయన స్ఫూర్తిని ఆ దర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంద న్నారు.

అదనపు ఎస్ పి రమేష్ మాట్లాడుతూ నేటి యువతకు స్వామి వి వేకానంద స్ఫూర్తిదాయక మని అన్నా రు. జిల్లా క్రీడలు, యువజన సర్వీ సుల శాఖ అధికారి మీర్ అక్బర్ అలీ, సమాచార శాఖ సహా య సంచాలకులు యు. వెంకటేశ్వర్లు, తహసీల్దార్ పరుశురాం, మా జీ జెడ్పిటిసి గుమ్మల మోహన్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.