Vote for all collector : ప్రతి ఒక్కరూ ఓటు వేయండి
--మీ భవిష్యత్తు కోసం మంచి నాయకున్ని ఎన్నుకోండి --5కే రన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన
ప్రతి ఒక్కరూ ఓటు వేయండి
–మీ భవిష్యత్తు కోసం మంచి నాయకున్ని ఎన్నుకోండి
–5కే రన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన
ప్రజా దీవెన/ నల్లగొండ: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం మ నదే అని, కుల, మత, లింగభేదం తేడా లేకుండా రాజ్యాంగం అంద రికీ సమానంగా ఓటు హక్కును కల్పించిందని జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన అన్నారు.
ఓటు అనే ఆయుధం ద్వారా మంచి నాయ కున్ని ఎన్నుకుంటే భవి ష్యత్తు బాగుoటుందన్నారు. ఎవరికి ఓటు వేయాలని ఎవరో చెప్తే మీరు ఓటు వేయొద్దని, మీ ఆత్మ సాక్షి గా నైతిక ఓటు వేయాలని ఆమె పిలుపు నిచ్చారు.
మంగళవారం ఆమె ఓటరు అవగాహన కార్య క్రమంలో భాగంగా నల్లగొండ పట్టణం లో నైతిక ఓటింగ్ పై నాగార్జున కళాశాల మైదానం నుండి స్థానిక గడియారం సెంటర్ వరకు నిర్వహించిన 5 కే రన్ ను జండా ఊపి ప్రారంభించా రు. అనంతరం ఆమె స్థానిక గడి యారం సెంటర్ లో మాట్లాడారు.
ఎన్నికల సంఘం ఈ ఎన్నికలలో 85 సంవ త్సరాలు నిండిన ఓటర్ల కు, ది వ్యాంగ ఓటర్లకు హోమ్ ఓటింగ్ సదు పాయం కల్పించిందని, హోమ్ ఓటింగ్ వేయాలనుకునే ఓటర్లు ఫామ్ 12 డి ద్వారా దరఖా స్తు చేసుకోవాలని, లేదా సాక్ష్యం యాప్ ద్వారా ఆన్ లైన్ లో దరఖా స్తు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు.
ఈ 5 కే రన్ కు అడిష నల్ ఎస్పీ రాములు నాయక్,జడ్పీ సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి, డిఆర్డిఏ పిడి నాగిరెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు డాక్టర్ పుల్లారావు, డి ఎస్ డి ఓ, వివిధ శాఖల అధికారులు, విద్యా ర్థులు, అంగన్వాడీ టీచర్లు, ఆర్పీలు, పంచాయతీ సెక్రటరీలు, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు, పోలీసు లు, వివిధ స్వచ్ఛంద సంస్థల సభ్యు లు పాల్గొన్నారు.