Water Dispute between AP and telangana : బిగ్ బ్రేకింగ్,నాగార్జునసాగర్ వద్ద మళ్లీ జలజగడం, ఏపీ-తెలంగాణ మధ్య తిరిగిఉద్రిక్తత

Water Dispute between AP and telangana : ప్రజా దీవెన, నాగా ర్జునసాగర్: తె లుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. నాగార్జు నసాగర్ డ్యా మ్ కేం ద్రంగా ఏపీ-తెలంగాణ అధికారుల మ ధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేఆర్‌ఎంబీ అనుమతి లేకుండా ఏపీ అధికా రులు నీటిని విడుదల చేసేందుకు ప్ర యత్నించడంతో తె లంగాణ అధికారులు అభ్యంతరం వ్య క్తం చేసి అడ్డుకున్నా రు.సాగర్ కుడి కాలువ ద్వారా ఏపీకి 2 వేల క్యూ సెక్కుల నీటిని విడుదల చేయగా, తెలంగాణ సై తం ఎడమ కాలువకు 2 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసింది. దీంతో డ్యా మ్ పరిసరాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మా రింది.
నీటి విడుదలకు సంబంధించి కే ఆర్‌ఎంబీ అనుమతి తీసు కోకుండా ఏపీ అధికారులు ప్రయత్నించడంపై తెలంగాణ అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచా రం. దీంతో ఇరు రా ష్ట్రాల అధికారుల మధ్య వాగ్వాద ప రి స్థితి ఏర్పడింది.కృష్ణా జలాల వినియోగం, నీటి వాటాలపై ఇ ప్పటికే కొనసాగుతున్న వివాదానికి ఈ ఘటన మరింత ఆ జ్యం పోసినట్లయింది. సాగర్ జలాల విడుదలపై ఇరు రా ష్ట్రాల అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఉద్రిక్తతకు దారితీసే పరిస్థితి
కృష్ణా జలాల వినియోగం మరోసారి తెలుగు రాష్ట్రాల మ ధ్య ఉద్రిక్తతకు దారితీసే పరిస్థితి కనిపిస్తోంది. నాగార్జునసా గర్ ప్రాజెక్టు కేంద్రంగా ఏపీ, తెలంగాణ నీటిపారుదల అధికా రులు పోటాపోటీగా నీటిని విడుదల చేయడంతో సాగర్ వ ద్ద పరిస్థితి ఒక్కసారిగా ఆసక్తికరంగా మారింది.కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కేఆర్‌ఎంబీ) ఆదేశాలను పక్కనపెట్టి ఇరు రాష్ట్రాల అధికారులు తాగునీటి అవసరాల కోసం నీటి ని వినియోగించుకున్నట్లు సమాచారం. బుధవారం ఉద యం ఏపీ నీటిపారుదల అధికారులు పవర్ జనరేషన్ ద్వా రా నాగార్జునసాగర్ కుడి కాలువ వైపు నీటిని విడుదల చేశారు.
ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ అధికారులు కూడా తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎడమ కాలువ లో నీటిని విడుదల చేశారు. దీంతో సాగర్ ప్రాజెక్టు వద్ద ఇరు రాష్ట్రాల అధికారులు ఒకేసారి నీటి విడుదలకు చర్యలు చే పట్టడం చర్చనీయాంశంగా మారింది.అయితే నీటిని తాగు నీటి అవసరాల కోసమే విడుదల చేస్తున్న నేపథ్యంలో ఎ లాంటి ఘర్షణలు చోటుచేసుకోకుండా పోలీసులు అప్రమత్త మయ్యారు. ప్రాజెక్టు పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేసి, ఇరు రాష్ట్రాల అధికారుల కదలికలను ఎప్పటిక ప్పుడు ప ర్యవేక్షిస్తున్నారు.తాజా పరిణామాలతో నాగార్జున సాగర్ మరోసారి కృష్ణా జలాల వివాదానికి కేంద్రబిందువుగా మా రింది. తాగునీటి అవసరాల పేరుతో ఇరు రాష్ట్రాలు నీ టిని వినియోగించు కోవడం నేపథ్యంలో కేఆర్‌ఎంబీ ఆదేశాలు, నీటి పంపకాలపై మరోసారి చర్చ మొదలైంది.





