చిన్నారులకు అండగా ఉంటాం
— నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి
ప్రజా దీవెన/ నల్లగొండ: నల్లగొండ పానగల్లు లో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాద మృతుల కుటుంబానికి అండగా ఉంటామని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. తల్లిదండ్రులు చనిపోయి అనాధలుగా మిగిలిన చిన్నారులకు చేదోడు వాదోడుగా ఉంటామని తెలిపారు. ఆ కుటుంబానికి రూ. 2 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు.
రోడ్డు ప్రమాదoలో మరణించిన ఓర్సు విష్ణు మూర్తి, స్వప్న దంపతుల పార్థివ దేహాలను ఆయన ప్రభుత్వ ఆసుపత్రి మార్చురిలో సందర్శించి నివాళులర్పించారు. NG కళాశాల లో కాంట్రాక్ట్ లెక్చరర్ గా పని చేస్తున్న విష్ణుమూర్తి అతని భార్య స్వప్నలు రోడ్డు ప్రమాదంలో మరణించడం అత్యంత దురదృష్టకరమైన విషయమని అన్నారు. పిల్లలు అనాధలయ్యారని వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని స్పష్టం చేశారు.
పిల్లల పేరు మీద రెండు లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తామని, ప్రభుత్వపరంగా అన్ని రకాలుగా ఆదుకుంటామని తెలియజేశారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, సీనియర్ నాయకులు బక్క పిచ్చయ్య, స్థానిక కౌన్సిలర్ ఆలకుంట్ల మోహన్ బాబు, పట్టణ పార్టీ కార్యదర్శి సందినేని జనార్దన్ రావు, సూర మహేష్ తదితరులు ఉన్నారు.