తెల్ల రేషన్ కార్డుదారులకు తీపి కబురు
ఆధార్ లింక్‌కు సెప్టెంబర్ 30 చివరి తేదీ
ప్రజా దీవెన/న్యూ ఢిల్లీ: తెల్ల రేషన్ కార్డు అక్రమాలను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డుకు ఆధార్ కార్డును లింక్ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ లింక్‌కు సంబంధించి చివరి తేదీని జూన్ 30 గా పేర్కొన్న ప్రభుత్వం తాజాగా ఇప్పుడు ఆ
తేదీని పొడిగించింది.
ఇటీవల కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం సెప్టెంబర్ 30 చివరి తేదీగా పేర్కొంది. చాలా మంది తమ రేషన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయలేదని గుర్తించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీని పట్ల రేషన్ కార్డు దారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం నుంచి వివిధ సంక్షేమ పథకాలు పొందాలంటే తప్పనిసరిగా రేషన్ కార్డు ఉండాల్సిందే. రేషన్ కార్డు ఉన్నవారికి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా బియ్యంతో పాటు వివిధ సరుకుల్ని అందిస్తున్నాయి. అయితే చాలా మంది ఒకటి కంటే ఎక్కువ రేషన్ కార్డులను కలిగి ఉండి ప్రభుత్వాలను మోసం చేస్తున్నారు. దీంతో అనర్హులకు రేషన్ కార్డుల్ని తొలగించాలని నిర్ణయించిన ప్రభుత్వం రేషన్ కార్డుకు ఆధార్ కార్డును లింక్ చేయాలని ప్రతిపాదించింది.
కాబట్టి ప్రతి ఒక్కరు తమ రేషన్ కార్డుతో ఆధార్ కార్డును లింక్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒకవేళ లింక్ చేయకపోతే మాత్రం వారి పేర్లను రేషన్ కార్డు జాబితా నుంచి తొలగిస్తారు. ఆఫ్‌లైన్ ద్వారా లింక్ చేయాలనుకునే వారు సంబంధిత కార్యాలయాల్లో సంప్రదించాలి. ఆన్‌లైన్ ద్వారా కూడా రేషన్ కార్డుతో ఆధార్‌ను లింక్ చేయవచ్చు.
ఆన్‌లైన్‌లో రేషన్ కార్డుకు ఆధార్ కార్డును లింక్ చేసే విధానం. మొదటగా సంబంధిత రాష్ట్రానికి చెందిన పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పోర్టల్‌కు వెళ్లాలి. అక్కడ ఆధార్ కార్డు- రేషన్ కార్డు లింక్ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత రేషన్ కార్డు నెంబర్, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.
రిజిష్టర్ మొబైల్ నెంబర్‌కు OTP వస్తుంది. దాన్ని నమోదు చేయాలి
దీంతో రేషన్ కార్డుకు ఆధార్ కార్డు లింక్ అవుతుంది.