చంపాపేటలో యువతిని చంపిన యువకులు
ప్రజా దీవెన/ హైదరాబాద్: హైదరాబాద్ చంపాపేటలో అతి కర్కశంగా కొందరు యువకులు ఓ యువతిని చంపారు. కొందరు యువకులు కలిసి యువతి గొంతు కోసి హత్య చేసి తదననంతరం హత్యలో పాల్గొన్న ఓ యువకుడు రెండో అంతస్తు నుంచి కింది దూకి తీవ్ర గాయాలపాలయ్యాడు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉందని పోలిసులు తెలిపారు.
ఈ ఘటనతో సంబంధమున్న మరో ఇద్దరు యువకులు పరారయ్యారని సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని గాయపడిన యువకున్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. యువతి శవపరీక్ష నిమిత్తo మృతదేహాన్ని కూడా హాస్పిటల్‌కు పంపించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ లో భాగంగా స్థానికుల సమాచారంతో పరారీలో ఉన్న ఇద్దరు యువకుల గురించి గాలిస్తున్నారు. ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమా, లేదoటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.