Praja Deveena
Newspaper Banner
Date of Publish : 11 May 2026, 5:34 pm Posted by : praja deveena

Women Commission newbody : బిగ్ బ్రేకింగ్, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, మహిళా కమిషన్ చైర్పర్సన్ గద్వాల విజయలక్ష్మి ని యామకం 

Women Commission newbody : ప్ర జా దీవెన, హైద రాబాద్: తెలంగా ణ సర్కార్ మహిళా శక్తికి పట్టం క డుతూ రాష్ట్ర మహిళా కమిషన్‌ ను సరికొత్తగా పు నర్వ్యవస్థీకరిం చింది. కేవలం పదవుల భర్తీగానే కాకుండా ఉ ద్యమ చరిత్ర ను, సామాజిక పోరాటాలను గౌరవిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకు న్న ఈ నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తం గా హాట్ టాపిక్ అయింది. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ ప ర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి బాధ్యతలు చేపట్ట నున్నారు.

క్షేత్రస్థాయిలో రాజకీయ అనుభవం, మహిళా స మస్యలపై అవగాహన ఉన్న ఆమె నాయకత్వంలో కమిషన్ మరింత దూకుడుగా పనిచేస్తుందని ప్రభు త్వం భావిస్తోంది. కాగా ఈ నియా మకాల్లో ప్రభుత్వం ఒక ప్రత్యేకమై న మార్కును చూ పించిందని చెప్ప వచ్చు. తెలంగాణ ఆత్మగౌరవానికి, త్యాగా నికి ప్రతీకలైన కుటుంబాల కు కమిషన్‌లో చోటు కల్పించిం దని కూడా పరిశీలకులు భావిస్తున్నా రు.

అమరవీరుని తల్లి శంకరమ్మకు గౌరవం

తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతచారి తల్లి కాసో జు శంకరమ్మను కమిషన్ సభ్యు రాలిగా నియ మించారు. ఉద్యమ కుటుంబాలను గౌరవించుకోవాలనే సం కల్పంతోనే రేవంత్ రెడ్డి సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపి స్తోంది. అదే సమయంలో వీరనారి చాకలి ఐలమ్మ మనవరాలు చిట్యాల శ్వేతకు సభ్యురాలిగా అవ కాశం ద క్కింది. నిజాం నిరంకుశ త్వానికి వ్యతిరేకంగా పోరాడిన ఐ లమ్మ వారసురాలికి ఈ బాధ్యత లు అప్పగించడం విశేషం.

సామాజిక సమతుల్యత, కొత్త సభ్యులకు అవకాశం

వివిధ రంగాల్లో, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా ఉం డే మరో నలుగురు మహిళా నేతలకు సభ్యులుగా అవ కాశం కల్పించారు. సామాజిక సేవ, రాజకీయాలకు సంబం ధించి శశికళ యాదవ్ రెడ్డి, మహిళా హక్కుల ఉద్యమంలో భాగంగా సదాలక్ష్మి, అణగారిన వర్గాల గొంతుకగా నిలుస్తు న్న రాధాభాయి, మైనారిటీ మహిళా సంక్షేమం పరంగా ఉ జ్మా షకీరా రాష్ట్రంలో మహిళా హక్కుల పరిరక్షణకు, వేధిం పుల అడ్డుకట్టకు ఈ కొత్త క మిషన్ ఒక పటిష్టమైన కవచం లా పనిచేయబోతోంది. చారిత్రక నేపథ్యం ఉన్న కుటుంబాల కు, సామాజిక స్పృహ ఉన్న మహిళలకు పెద్దపీట వేయడం ద్వారా ప్రభుత్వం ఒక స్పష్టమైన సందేశాన్ని పంపడం గమ నార్హం.