Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

World Blood Donation Day: రక్తదానం చేయండి –ప్రాణ దాతలు కండి

ప్రపంచ రక్త దాన దినోత్సవం సందర్భంగా శుక్రవారం కోదాడ రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో డాక్టర్ ప్రమీల శ్రీపతి రెడ్డి హస్పటల్ లో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు

ప్రజా దీవెన, కోదాడ: ప్రపంచ రక్త దాన దినోత్సవం(World Blood Donation Day) సందర్భంగా శుక్రవారం కోదాడ రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో డాక్టర్ ప్రమీల శ్రీపతి రెడ్డి హస్పటల్ లో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రెడ్ క్రాస్ సొసైటీ కోదాడ(Red Cross Society Kodad) అధ్యక్షురాలు శ్రీమతి డాక్టర్ ప్రమీల శ్రీపతి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రక్తదాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని ఆమె తెలిపారు ఈ రక్తదానం చేయటం వలన వేరొకరి ప్రాణాలను కాపాడవచ్చు అని అన్నారు కోదాడ పట్టణానికి చెందిన శ్రీ రంగా కోటేశ్వరరావు (16 సార్లు)అలాగే సోమ గాని వేణు (8 సార్లు). చెవినేని రాకేష్ (. 8సార్లు) బుడిగం నరేష్ కుమార్ ( 40 సార్లు రక్తదానం చేశారు) రక్త దాతలు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానాన్ని ఇచ్చినందున కోదాడ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కోదాడ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షురాలు డాక్టర్ ప్రమీల శ్రీపతి రెడ్డి , మరియు కోదాడ రెడ్ క్రాస్ సొసైటీ ఉపాధ్యక్షురాలు. పబ్బా గీత , కోదాడ రెడ్ క్రాస్ సొసైటీ (Red Cross Society Kodad)కోశాధికారి తుమాటి సురేష్ రెడ్డి , సూర్యాపేట జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ E C మెంబర్ కొమరగిరి రంగారావు డాక్టర్ సందీప్ ,కోదాడ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు జగిని ప్రసాద్ , వెంపటి ప్రసాద్ , పందిరి రఘు వర ప్రసాద్, బి లక్ష్మీ , ఎం సుశీల వై యాదరాణి పాల్గొన్నారు.

World Blood Donation Day