Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Wrong word… heel turn: మాట తప్పం… మడమ తిప్పం

--పేదోళ్ళ కన్నీళ్లు తుడిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం --ఇరువైయేండ్లు ఒక లెక్క ఇప్పుడొక లెక్క --అభివృద్ధి అంటే ఏంటో చెప్పడం కాదు చేసి చూపిస్తాం --నల్లగొండలో గుండాయిజం, రౌడీయిజం లేకుండా చేస్తాం --నల్లగొండ పర్యటనలో రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉద్ఘాటన

మాట తప్పం… మడమ తిప్పం

–పేదోళ్ళ కన్నీళ్లు తుడిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం
–ఇరువైయేండ్లు ఒక లెక్క ఇప్పుడొక లెక్క
–అభివృద్ధి అంటే ఏంటో చెప్పడం కాదు చేసి చూపిస్తాం
–నల్లగొండలో గుండాయిజం, రౌడీయిజం లేకుండా చేస్తాం
–నల్లగొండ పర్యటనలో రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉద్ఘాటన

ప్రజా దీవెన/నల్లగొండ: నల్లగొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని నిరంతరం ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి జీవితకాలం ఋణపడి ఉంటా నని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. నల్లగొండ నియోజకర్గస్థాయిలో గడిచిన ఇరువై ఏ ళ్లు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరొక్క లెక్క అని, అభివృద్ధిలో నల్ల గొండను మొదటి స్థానం లో నిలుపుతానని స్పష్టం చేశారు. మా ట తప్పం, మడమ తిప్పమని ఆ విషయం నియోజకవర్గ ప్రజలకు సుస్పష్టమని గుర్తు చేశారు.

రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా నియోజకవర్గ కేంద్రానికి విచ్చేసిన సందర్భంగా పార్టీ శ్రేణులు అభిమా నులు భారీ ఎత్తున స్వాగతం పలికారు. బాణాసంచా, డప్పు చెప్పు ల్లు, డీజే పాటలతో ఎదురేగి కోమటిరెడ్డికి అభిమానులు ఘన స్వాగ తం పలికారు. అనంతరం భారీ స్ధాయిలో జిల్లా కేంద్రానికి చేరుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మంత్రి ప్రసంగిం చారు.

ఇకపై నల్లగొండ నియోజకవర్గం ప్రజలు, జిల్లా ప్రజలకు 24/7 అందు బాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ఎప్పుడైనా ఏ అవసరం వచ్చి నా మినిస్టర్స్ క్వార్టర్స్ లోని 4 నెంబర్ క్వార్టర్ కి కాని సెక్రెటెరి యట్ లోని 5వ ఫ్లోర్ లో గల ఆఫీస్ కైనా నేరుగా రావొచ్చని పిలుపు నిచ్చా రు. రాబోయే రోజుల్లో అర్హులైన ప్రతి నిరుపేద కి ఇందిరమ్మ ఇల్లు ని ర్మించి ఇస్తామని స్పష్టం చేశారు.

నల్లగొండలో ప్రతి రోడ్డును అద్భుతం గా తీర్చిదిద్దుతామని, జిల్లాలో ప్రతీ సాగునీటి ప్రాజెక్టు ను పూర్తి చే స్తామని పునరు ద్ఘాటించారు. గత పదేళ్లలో గజ్వేల్, సిద్దిపేట్, సిరి సిల్ల తప్ప ఎక్కడ అభివృద్ధి జరగలేదని వివరించారు. కాంగ్రెస్ పాల నలో అన్ని వర్గాలకి న్యాయం చేస్తామని వెల్లడించారు. గ్రామాల్లో విచ్చలవిడిగా రాజ్యమేలుతున్న బెల్ట్ షాపులను మూయిస్తామని, గంజాయి గ్యాంగుల ఆట కట్టిస్తామని హెచ్చరించారు.

6గ్యారంటీలను 100 రోజుల్లో ఖచ్చితంగా అమలు చేస్తామని, ఇప్పటికే 2 గ్యారెంటీలను అమలు చేసామని ఈ నెల చివర్లో మరో రెండు గ్యారెంటీలను అమలు చేస్తామని వివరించారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ క్రింద రూ. 10 లక్షల వరకు ఉచితంగా చికిత్స చేయించు కునేలా ఏర్పాట్లు చేసామని తెలిపారు. మా ఆడబిడ్డలంతా ఎంతో సంతోషంగా ఉచితంగా బస్సుల్లో ప్రయాణిస్తున్నారని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ బీదల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ అని
కాంగ్రెస్ ప్రభుత్వం లో అన్ని వర్గాలకి న్యాయం జరుగుతుందని తెలి పారు. గత 10 సంవత్సరాల నియంత పాలనపోయి నిజమైన ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని, ఇకనుండి ప్రతి పేదవాడు సంతోషంగా బ్రతికేలా కాంగ్రెస్ పాలనా ఉంటుందని చెప్పారు. నల్గగొండ జిల్లాను సుభిక్షంగా మారుస్తామని స్పష్టం చేశారు.

అంతకుముందు మంత్రి కోమటిరెడ్డి తో కరచాలనం కోసం అభిమానులు పోటెత్తారు. వేలాది గా తరలివచ్చిన అభిమానులతో కిక్కిరిసిన నల్గొండ పట్టణం మూడు రంగుల జెండాలతో నిండి పోయిన కళకళలాడింది. వేలాది అభిమానులతో భారీ ర్యాలీ కొనసాగింది. అంబేద్కర్, బాబు జగ్ జీవన్ రామ్, బుద్ధుని విగ్రహాలకు నివాళులు అర్పించి ర్యాలీలో పాల్గొన్నారు.

అంతకుముందు నల్లగొండ జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పుష్పగుచ్చమందస్సు అందజేసి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మంత్రి పలు విషయాలపై పరస్పరం చర్చించుకున్నారు.

ఈ కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ జడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, ఎంపీపీ మనిమద్దే సుమన్, తిప్పర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జూకూరి రమేష్, తిప్పర్తి జడ్పిటిసి పాశం రాంరెడ్డి, డిసిసిబి డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, కనగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం అనుఫ్ రెడ్డి ,మాజీ జెడ్పిటిసి నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నాంపల్లి భాగ్య, సూరెడ్డి సరస్వతి, పలువురు కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.