Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Young Telangana Mla nandhitha : రోడ్డు ప్రమాదంలో యువ ఎమ్మెల్యే దుర్మరణం

కంటోన్మెంట్ఎమ్మెల్యే నందితను వెంటాడిన మృత్యువు --అతివేగంతో అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టిన కారు  --60 రోజుల్లో మూడు ప్రమాదాల భారిన పడిన వైనం --లాస్య నందిత కుటుంబానికి కలిసిరాని ఫిబ్రవరి నెల --పటాన్ చెరు ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం

రోడ్డు ప్రమాదంలో యువ ఎమ్మెల్యే దుర్మరణం

కంటోన్మెంట్ఎమ్మెల్యే నందితను వెంటాడిన మృత్యువు

–అతివేగంతో అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టిన కారు 
–60 రోజుల్లో మూడు ప్రమాదాల భారిన పడిన వైనం
–లాస్య నందిత కుటుంబానికి కలిసిరాని ఫిబ్రవరి నెల
–పటాన్ చెరు ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం

ప్రజాదీవెన/ హైదరాబాద్: కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృ తి చెందారు. పటాన్ చెరువు ఓఆర్ఆర్ పై ఆమె వెళ్తున్నకారు శుక్ర వారం వేకువజామున ప్రమాదానికి గురైంది. కారు అదుపు తప్పి డివై డర్ ను ఢీకొట్టగా జరిగిన ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత అక్కడిక్క కడే ( MLA Lasya Nandita was there) మర ణించారు. స్థానికులు హుటాహుటీన లాస్య నందితను, కారు డ్రైవర్ ను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

వైద్యులు పరీక్షించి ప్రమాదం జరిగిన ప్రాంతంలోనే లాస్య నందిత మరణించినట్లు (Lasya Nandita died )  వెల్లడించారు. కారు డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యా యి. వైద్యులు అతనికి చికిత్స అందిస్తున్నారు. అయితే, డ్రైవర్ పరిస్థితికూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కారు ప్రమాదం సమయంలో డ్రైవర్, లాస్య నందిత మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా స్థానికులు భావిస్తున్నారు.

ప్రమాదం సమయంలో లాస్య నందిత సీటు బెల్టు పెట్టుకోలేదని ( Lasya Nandita did not wear seat belt) సమాచారం. సీటుబెల్టు పెట్టుకొని ఉంటే ఆమె గాయాలతో బయట పడేదని స్థానికులు పేర్కొంటున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. గతేడాది ఫిబ్రవరిలో లాస్య నందిత తండ్రి, ఎమ్మెల్యే సాయన్న అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే.

అయితే, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లాస్య నందిత సికింద్రా బాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి బీఆర్ ఎస్ ఎమ్మెల్యేగా పోటీచేసి విజయం (Lasya Nandita Sikandra contested as BRS MLA from Bad Cantonment Constituency in the assembly elections and won) సాధించారు. లాస్య నందిత మృతితో బీఆర్ఎస్ శ్రేణులు దిగ్భ్రాంతికి గురయ్యారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో విషాదం నెలకొంది. ఇటీవల నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ బహిరంగ సభకు వెళ్లి వస్తుండగా నార్కెట్ పల్లి వద్ద లాస్య నందిత కారు ప్రమాదానికి గురైంది.

ఆ ప్రమాదంలో ఆమెకు ఎలాంటి గాయాలు కాకపోవటంతో బీఆర్ఎస్ శ్రేణులు ఊపిరిపీల్చుకున్నాయి. ఈ ఘటన జరిగిన కొద్దిరోజులకే ఆమె కారు ప్రమాదంలో మృతి చెందారు.

లాస్యను వెంటాడిన వరుస ప్రమాదాలు…సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా లాస్య నందిత విజయం సాధించిన నాటి నుంచి ఆమెను ప్రమాదాలు వెంటాడుతూనే వచ్చాయి. గతేడాది డిసెంబర్ నెలలో ఆమె లిఫ్ట్ లో ఇరుక్కుపోయారు. ఓవర్ లోడ్ కారణంగా లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోయింది. లిఫ్ట్ డోర్లు పగలగొట్టి లాస్య నందితను సిబ్బంది బయటకు తీసుకొచ్చారు.

ఈనెల 14న నల్గొండలో బీఆర్ఎస్ బహిరంగ సభ జరిగింది. ఈ సభకు హాజరై వస్తుండగా లాస్య నందిత కారు ప్రమాదానికి గురైంది. ఆమె స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడింది. ఈ ఘటన జరిగి పదిరోజులు గడవక ముందే శుక్రవారం తెల్లవారు జామున ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించారు.

లాస్యనందిత అకాల మరణం దిగ్భ్రంతికి గురిచేసిందని ఎక్స్ లో ట్వీట్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి
‘‘కంటోన్మెంట్ శాసన సభ్యురాలు లాస్య నందిత అకాలమరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. నందిత తండ్రి స్వర్గీయ సాయన్నతో నాకు సన్నిహిత సంబంధం ఉండేది. ఆయన గత ఏడాది ఇదే నెలలో స్వర్గస్తులవడం, ఇదే నెలలో నందిత కూడా ఆకస్మికంగా మరణం చెందడం అత్యంత విషాదకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతు, ఆమె ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’’ అని సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ లో ట్వీట్ చేశారు.

కంటోన్మెంట్ ఎమ్మెల్యే నందిత మృతి పట్ల రాజకీయ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ ఆర్, ఎంపీ బండి సంజయ్, డిప్యూటి సీఎం బట్టి విక్రమార్క, మం త్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండ సురేఖ, పిసిసినాయకులు మహేష్ కుమార్ గౌడ్, జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ లు సంతాపం వ్యక్తం చేశారు.