YRP Foundation Chairman Elishala Ravi Prasad : వైఆర్పీ ఫౌండేషన్ చైర్మన్ ఎలిశాల రవి ప్రసాద్ అప్పీల్, “ఎంత ఎదిగి నా మూలాలను మర్చిపోవద్దు”

YRP Foundation Chairman Elishala Ravi Prasad : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: డిజిటల్ విప్లవం, ఆర్టిఫిషియ ల్ ఇంటెలిజెన్స్ ఏలుతున్న నేటి ఆధునిక యుగంలో సమా జంలో ఎంతటి ఉన్నత శిఖరాలకు చేరినా, మనిషి తన “మూలాలను (Roo ts)”అస్సలు మర్చిపోకూడదని వైఆర్పీ (YRP) ఫౌండేషన్ చైర్మన్ యెలిశాల రవి ప్రసాద్ స్పష్టం చే శారు. శనివారం వైఆర్పీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన వార్షిక స్కాల ర్‌షిప్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. సాంకేతికతతో పా టు విద్యార్థుల ప్రతిభకు రెక్కలు తొడగడమే ధ్యేయంగా వైఆర్పీ ఫౌండేషన్ ఈ ఏడాది ఏకంగా రూ. 80 లక్షల భారీ స్కాల ర్‌షిప్ నిధిని ప్రకటించింది.మొత్తం లబ్ధిదారు లు100 మంది కి పైగా విద్యార్థులు కాగా నల్గొండ జిల్లా వాటా 41 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు రూ. 12 లక్షల సాయం చేస్తున్నామన్నారు.
చదువు అనేది కేవలం డిగ్రీల కోస మే కాదు, సమాజంలో మార్పు కో సo విద్యార్థులు భవిష్యత్తులో అ ద్భుతమైన కెరీర్ నిర్మించుకున్నా క.. తాము ఎదిగిన మూలాలను గుర్తుంచుకుని, సమాజానికి, తోటి విద్యార్థులకు తిరిగి సహాయం చే యాలని వైఆర్పీ ఫౌండేషన్ చైర్మన్ ఎలి శాల రవి ప్రసాద్ తెలిపారు.
రాబోయే రోజుల్లో ఏ రంగంలో స్థిర పడాలన్నా పట్టుదల, అంకితభావం చాలా ముఖ్యమని రవి ప్రసాద్ పేర్కొన్నారు. కుల, మత, వర్గ బే ధాలకు అతీతంగా సరికొత్త ఐక్యత తో నవసమాజ నిర్మాణానికి విద్యా ర్థులు నడుం బిగించాలని పిలు పు నిచ్చారు. అలాగే, వైఆర్పీ ఫౌండేషన్ కేవలం చదు వుకే పరిమితం కాకుండా.. పర్యావరణ స్పృహను పెంచేం దుకు ప్రతి ఏటా మట్టి వినా యక విగ్రహాల పంపిణీ వంటి సే వా కార్యక్రమాలను కూడా నిరంతరాయంగా కొన సాగిస్తుం దని వెల్లడించారు.
కార్పొరేటర్ యామా కవిత మాట్లాడుతూ ప్రపంచాన్ని మా ర్చగల ఏకైక శక్తి విద్యాదానానికే ఉందన్నా రు. స్కాలర్‌షిప్స్ అందుకున్న వి ద్యార్థులు భవిష్యత్తులో అద్భుత మైన ర్యాం కులు సాధించి, గ్లోబల్ లీడర్లుగా ఎదగాలని ఆకాంక్షిం చారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో వైఆర్పీ ఫౌండేషన్ డైరెక్టర్ శర త్ చంద్ర, వైఆర్పీ జిల్లా ఇంచార్జ్ యామా దయాకర్, రవి ప్ర సాద్ మి త్రులు రాఘవాచారితో పాటు పలువురు విద్యా వేత్తలు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.





