Ysrcp vamshi : వల్లభనేని వంశీకి అరెస్ట్ వారెంట్
--ప్రతినిధుల కోర్టులో వంశీ పై నాలుగు కేసుల్లో విచారణ --విచారణకు గైర్హాజరుతో విజయవాడ కోర్టు వారెంట్
వల్లభనేని వంశీకి అరెస్ట్ వారెంట్
–ప్రతినిధుల కోర్టులో వంశీ పై నాలుగు కేసుల్లో విచారణ
–విచారణకు గైర్హాజరుతో విజయవాడ కోర్టు వారెంట్
ప్రజా దీవెన/విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా ప్రతినిధులు న్యాయస్థానాలను (courts) ఏమాత్రం ఖాతరు చేయడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కోర్టు విచారణలకు ప్రజాప్రతి నిధు లు హాజరుకాపోగా కనీసం అందుకు కారణాలు చెప్పేందుకు కూడా సమయాన్ని వెచ్చించడం లేదన్న విమర్శలు కోకొల్లలు. గన్నవరం ఎ మ్మెల్యే వల్లభనేని వంశీ ( vallabaneni vamshi) ఇదే ధోరణి తో వ్యవహరిస్తున్నారని అపవాదు మూటగట్టుకున్నారు.
ప్రజాప్రతినిధుల కోర్టు వంశీ పై మొత్తంగా నాలుగు కేసుల్లో విచారణ జరుపుతుండగా ఈ విచారణకు ఆయన గైర్హాజరు కావడంతో విజ యవాడ ప్రతినిధుల కోర్టు అతనికి ఏకంగా అరెస్టు వారెంట్‌లు జారీ చేయడం గమనార్హం. 2019లో జనరల్ ఎలక్షన్స్ జరుగుతున్న సమ యంలో ప్రసాదంపాడులోని ఓ పోలింగ్ బూత్ వద్ద జరిగిన సంఘ టనలో 38 మందిపై పోలీసులు కేసును నమోదు చేయగా అందులో వల్లభనేని వంశీ కూడా ఉన్నారు.
ఆయితే విచారణ సమయంలో మాత్రం ఆయన కోర్టుకు హాజరు కా వడం లేదు. ఆ కారణంతోనే అరెస్టు వారెంట్ జారీ చేసినట్లు తాజా గా పోలీసులు వెల్లడించారు. అయితే వల్లభనేని వంశీ కోర్టు విచార ణలకు హాజరు కాలేక పోవడానికి గల కారణాన్ని వివరిస్తూ అరెస్టు వారెంట్లకు కౌంటర్‌ను దాఖలు చేయవచ్చని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ( andhrapradesh) రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ నెలలో జరిగే అవ కాశం ఉంది. ఎన్నికలకు మరి కొద్ది వారాల సమయం మాత్రమే మి గిలి ఉండగా ఇప్పటికే పార్టీలు అభ్యర్థుల ఎంపిక విషయమై హడా వుడి మొదలుపెట్టాయి. చాలామంది రాజకీయ నేతలు కూడా యాక్టి వ్ అయ్యారు. కానీ వల్లభనేని వంశీ మాత్రం మౌనవ్రతం ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అనే క్లారిటీ కూడా ఇవ్వడం లేదు.
ఇంతకుముందు రాజకీయాల్లో చాలా యాక్టివ్ గా ఉన్న ఆయన ఇ ప్పుడు చాలా సైలెంట్ అయిపోవడం చర్చినీయాంశంగా మారింది. వల్లభనేని వంశీ 50 రోజులకు పైగా నియోజకవర్గం వైపు కన్నెత్తి చూ సిన పాపన పోలేదని విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. హైదరాబాద్ లోనే ఉంటున్నారని కూడా ప్రచారం సాగుతోంది. నిజానికి వల్లభనేని వంశీ పోటీ చేసిన రెండు సార్లు గెలుపొందారు.
గన్నవరం నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ పై వంశీ రెండుసార్లు పోటీ చేసి విజయాన్ని సొంతం చేసుకున్నారు. 2019 ఎన్నికలలో వైసీపీ గెలిచిన తర్వాత ఆయన టీడీపీ పార్టీని వ్యతిరేకించి బహిరం గంగానే వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇస్తూ వస్తున్నారు.
ఒకవేళ వంశీకి వైఎస్ఆర్సీపీ నుంచి ఎన్నికల బరిలోకి దిగే అవకాశం వస్తే టీడీపీ రాజకీయ నాయకుడు యార్లగడ్డతో పోటీ పడాల్సి వచ్చే అవకాశం ఉంది. మరి రానున్న రోజుల్లో వంశీ విషయంలో ఏమి జరుగుతుందో వేచిచూడాలి.