— యూనియన్ నాయకులు
Gajji Saidulu Compensation : ప్రజాదీవెన నల్గొండ : పానగల్లు ఎల్లమ్మ గుడి ఎదురుగా ఒక ఇంటి నిర్మాణంలో సోమవారం ప్రమాదవశాత్తు మరణించిన గజ్జి సైదులు కుటుంబానికి సిఐటియు ఆధ్వర్యంలో ఇంటి యజమానితో మాట్లాడి ఐదు లక్షల రూపాయలు నష్టపరిహారం ఇప్పించడం జరిగిందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి. సలీం జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య తెలిపారు.
మంగళవారం శ్రీ సుందరయ్య సెంట్రింగ్ యూనియన్ (సిఐటియు) కార్యాలయంలో ఇంటి యజమాని జంజరాల యాదయ్య ద్వారా గజ్జి సైదులు కుటుంబానికి 5 లక్షల రూపాయ లు ఇప్పించారు. జరిగిన ఘటన ప్రమాదవశాత్తు జరిగినప్పటికీ మరణించిన గజ్జి సైదులు కుటుంబాన్ని ఆదుకోవడం కోసం ఇంటి యజమానితో యూనియన్ నాయకులు చర్చలు జరిపి ఐదు లక్షలు రూపాయలు నష్టపరిహారం ఇప్పించడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవన నిర్మాణ రంగంలో ప్రమాదపు టంచుల్లో పనిచేస్తూన్నా కార్మికులు యూనియన్ లో సభ్యత్వం కలిగి ఉండాలని సంక్షేమ బోర్డు ద్వారా లేబర్ కార్డు పొందాలని కోరారు. యూనియన్ గా ఐక్యమత్యంగా కలిసి ఉండటం ద్వారా యాజమాన్యాల ద్వారా, ప్రభుత్వాల ద్వారా ప్రమాదాలు జరిగినప్పుడు ఆ కుటుంబాలను రక్షించుకోవచ్చు అని తెలిపారు.
కార్మికుల పక్షాన నిరంతరం పనిచేస్తున్న సంఘం సిఐటియు అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు టౌన్ కన్వీనర్ అవుట రవీందర్, సిఐటియు పట్టణ నాయకులు పాక లింగయ్య, బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ సిఐటియు నల్గొండ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు సలివొజు సైదాచారి, అద్దంకి నరసింహ, శ్రీ సుందరయ్య సెంట్రింగ్ యూనియన్ అధ్యక్షులు నోముల యాదయ్య, కార్యదర్శి దేవరంపల్లి వెంకట్ రెడ్డి, ఉపాధ్యక్షులు చిన్న బత్తిని జయప్రకాష్, తాపీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు సాగర్ల మల్లయ్య, రాడ్ బెండింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు తవుడోజు నాగాచారి రాజు, సొసైటీ డైరెక్టర్లు నిర్మాణ రంగాల నాయకులు, గజ్జి సైదులు భార్య గజ్జి పద్మ, కూతుర్లు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.