ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: దేశంలోని మధ్యతరగతి ప్రజలకు భారీ ప్ర యోజనం పెద్దపీట వేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలు స్తోంది. 2025 బడ్జెట్‌లో ఆదాయ పు పన్ను తగ్గించేందుకు కసరత్తు చేస్తోన్నట్లు భావిస్తున్నారు. ఇది లక్షలాది మంది పన్ను చెల్లింపు దారులకు ప్రయోజనం చేకూరు స్తుందన్న విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో వారికి ఎంతో ఉపశమనం కలిగించేందుకు కేంద్రం సిద్ధమవుతోందని, తద్వారా మధ్య తరగతి పన్ను చెల్లింపుదారు లకు ప్రభుత్వం నుంచి పెద్ద ఊరట లభించనున్నట్లు విస్తృత ప్రచారం జరుగుతోంది.
ఈ బడ్జెట్‌లో ప్రభు త్వం వార్షిక ఆదాయంపై రూ.15 లక్షల వరకు పన్ను బాధ్యతను తగ్గించవచ్చని నివేదికలు చెబు తున్నాయి. 1 ఫిబ్రవరి 2025న సమర్పించే రాబోయే బడ్జె ట్‌లో దీనిని ప్రకటించవచ్చని భావిస్తు న్నారు. మందగిస్తున్న ఆర్థిక వ్యవ స్థ, పెరుగుతున్న ద్రవ్యోల్బణం మధ్య వినియోగాన్ని ప్రోత్సహిం చడం ఈ ప్రతిపాదన లక్ష్యం.2020 పన్ను విధానంలో వార్షిక ఆదాయం రూ. 3 లక్షల నుండి రూ. 15 లక్షల వరకు 5-20 శాతం మధ్య పన్ను విధిస్తున్నారు. అయితే దీని కంటే ఎక్కువ సంపాదించే వ్యక్తులపై 30 శాతం పన్ను విధిస్తారు. ప్రభుత్వం కసరత్తు చేస్తోన్న కొత్త పన్ను విధా నం ప్రకారం రూ. 3 లక్షల వరకు ఆదాయంపై 0 శాతం పన్ను విధి స్తున్నారు. కాగా 3-7 లక్షల ఆదా యంపై 5 శాతం పన్ను, 7-10 లక్షల ఆదాయంపై 10 శాతం పన్ను, 10-12 లక్షల ఆదాయంపై 15 శాతం పన్ను, 12-15 లక్షల ఆదా యంపై 20 శాతం పన్ను 15 లక్ష లు, అంతకంటే ఎక్కువ ఆదాయం 30 శాతం పన్ను విధిస్తున్నారు.
నివేదిక ప్రకారం, జూలై-సెప్టెంబర్ 2024లో భారతదేశ జిడిపి వృద్ధి ఏడు త్రైమాసికాల్లో అత్యంత బలహీనంగా ఉంది. అదే సమ యంలో ఆహార ద్రవ్యోల్బణం పట్ట ణ గృహాల ఆదాయంపై ఒత్తిడిని పెంచింది. వాహనాలు, గృహోపకర ణాలు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తు ల డిమాండ్‌ను ప్రభావితం చేస్తుం ది.అయితే ఆదాయపు పన్ను రేట్ల లో ప్రభుత్వం ఎలాంటి కోత పెట్ట నుందనేది ఇంకా నిర్ణయించలేదు. ప్రస్తుతం ఈ అంశం ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో చర్చనీయాంశ మైంది. ఆదాయపు పన్ను రేట్ల కోత వల్ల ఖజానాకు ఎంత నష్టం వాటి ల్లుతుందని అంచనా వేస్తున్నారు. ఆదాయపు పన్ను తగ్గింపు కారణం గా, ప్రజలు కొత్త పన్ను విధానాన్ని ఎంచుకోవాలనుకుంటున్నారు. ఇది పాత పన్ను విధానం కంటే సులభ తరం అవుతుంది.
మధ్యతరగతి ఉత్సాహ భరిత ఉపశమనం అందుతున్న సమాచారం మేరకు నివేదిక ప్రకా రంపట్టణ ప్రాంతాల్లో నివసించే ప్రజలు అధిక జీవన వ్యయం, జీ తాలు నామమాత్రంగా పెరగడం వల్ల తరచుగా ఆర్థిక ఒత్తిడిని ఎదు ర్కొంటున్నారు. ఆదాయపు పన్ను ను తగ్గించడం ద్వారా వారి చేతికి ఎక్కువ డబ్బు వస్తుందని, దీంతో వారికి ఎంతో ఉపశమనంగా ఉం టుందని కేంద్రం భావిస్తోంది. ఇది వ్యక్తిగత ఖర్చులను మెరుగుపర చడమే కాకుండా భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. వార్షిక ఆదాయం రూ. 15 లక్షల వరకు ఉన్న వ్యక్తులకు ఈ మార్పు ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తుం దని అంచనాలు అందుతున్నాయి.