Praja Deveena
Newspaper Banner
Date of Publish : 20 August 2025, 10:35 am Posted by : praja deveena

Nalgonda District Collector Ila Tripathi : నల్లగొండ జిల్లాకు 510 మెట్రిక్ ట న్నుల యూరియా,జిల్లాలోని అన్ని సహకార సంఘాలకు కేటాయింపు

— నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడి

Nalgonda District Collector Ila Tripathi :

ప్రజా దీవెన, మిర్యాలగూడ: నల్ల గొండ జిల్లాకు వచ్చిన 510 మెట్రిక్ టన్నుల యూరియను అవసరం ఉ న్న రైతులకే పంపిణీ చేయాలని, యూరియా పంపిణీలో ప్రభుత్వాని కి ఎలాంటి చెడ్డ పేరు రాకుండా చూ సుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రి పాఠి వ్యవసాయ అధికారులను ఆ దేశించారు. బుధవారం ఆమె మి ర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యా ల యంలో యూరియా పై మిర్యాల గూడ శాసన సభ్యులు బత్తుల లక్ష్మారెడ్డిలతో కలిసి మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని వ్యవసాయ అ ధికారులతో సమీక్షించారు.

 

గత రాత్రి జిల్లాకు 510 మె. టన్ను ల యూరియా వచ్చిందని ,ఈ యూ రియాను ఆయా ప్రాథమిక వ్యవసా య సహకార సంఘాలకు అవసరం ఉన్నంత మేర కేటాయించడం జరి గిందని తెలిపారు. యూరియా సక్ర మ పంపిణీకి రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ శాఖల అధికారులు సమన్వయంతో పంపిణీ చేయాల ని, యూరియా పంపిణీలో ఎలాం టి అక్రమాలు చోటు చేసుకోకూడ దని, ప్రభుత్వానికి చెడ్డ పేరు రా కుండా చూడాల్సిన బాధ్యత అధి కారుల పై ఉందని, ముఖ్యంగా వ్య వసాయ అధికారులపై ఎక్కువగా ఉందని తెలిపారు.

అందుబాటులో ఉన్న యూరియా నిల్వలను నిజాయితీగా అవసర మున్న రైతులకే పంపిణీ చేయాలని ఆమె ఆదేశించారు. పెద్ద రైతులు అ నవసరంగా యూరియాను నిలువ ఉంచుకోవద్దని, అవసరం ఉంటేనే యూరియాను తీసుకోవాలని చె ప్పారు. కాగా మిర్యాలగూడ డివి జన్ పరిధిలో మొత్తం 19500 మె ట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ఇప్పటివరకు సుమారు 140 00 మెట్రిక్ టన్నులు యూరియాను సరఫరా చేయడం జరిగిందని జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ జిల్లా క లెక్టర్ కు వివరించారు.యూరియా ప్రాథమిక వ్యవసాయ సహకార సం ఘాలకు వచ్చిన తర్వాత సంబంధి త వ్యవసాయ సహాయ సంచాల కులు ,వ్యవసాయ అధికారులు అ వసరం ఉన్న మేరకు రైతులకు ఇ వ్వాలని కలెక్టర్ చెప్పారు.

 

యూరియా సక్రమ సరఫరాలో భా గంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిం చాలని, ముఖ్యంగా వాడపల్లి చెక్ పోస్ట్ వద్ద యూరియా ఇతర ప్రాం తాలకు తరలి వెళ్లకుండా కట్టుది ట్ట మైన చర్యలు తీసుకోవాలని మి ర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయ ణ్ అమిత్ ను ఆదేశించారు. అలాగే జిల్లా వ్యాప్తంగా ఎరువుల గోదా ములను తనిఖీచేయాలని రెవె న్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ ను కలెక్టర్ ఆదేశించారు. తహసిల్దా రులు సైతం ఎప్పటికప్పుడు ఎరు వుల దుకాణాలు, గోదాములను తనిఖీచేయాలని చెప్పారు.

 

 

మిర్యాలగూడ శాసనసభ్యులు బ త్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సం ఘాలలో ఎరువులు ఉండేలా చూ డాలని,ఎరువులు రిటైల్ షాపులకు వచ్చిన తర్వాత సక్రమ పంపిణీకి వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.జిల్లా వ్యవ సాయ అధికారి శ్రవణ్ ఇప్పటివరకు జిల్లాకు వచ్చిన యూరియా అవస రమున్న యూరియా తదితర వివ రాలను తెలియజేశారు.