Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Atal Bihari Vajpayee : అటల్ బీహార్ వాజ్ పాయ్ ఏడవ వర్ధంతి

Atal Bihari Vajpayee : ప్రజా దీవెన,కోదాడ: పట్టణంలో బిజెపి రాష్ట్ర నాయకులు డాక్టర్ మల్లెబోయిన అంజి యాదవ్ నివాసంలో అటల్ బీహార్ వాజ్ పాయ్ ఏడవ వర్ధంతి ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం పలువురు బిజెపి నాయకులు. మాట్లాడుతూ దేశంలో బిజెపి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి ఎనలేని కృషిచేసిన గొప్ప వ్యక్తి అటల్ బీహార్ వాజ్ పాయ్ అని కొనియాడారు.1980 నుండి 1986 వరకు భారతీయ జనతా పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశారని. 1996లో తొలిసారిగా ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారని గుర్తు చేశారు అలుపెరుగని ఈ రాజకీయ నాయకునికి 1994లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు లభించిందని తెలిపారు.

 

ఆయన దేశానికి చేసిన విశేష సేవలకు గాను భారత ప్రభుత్వం మార్చిి 12, 2015లో భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. ఆయన పుట్టినరోజు అయిన డిసెంబర్ 25ను సుపరిపాలనా దినంగా భారత ప్రభుత్వం ప్రకటించిందని అన్నారు.ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ కనగాల నారాయణ, రాష్ట్ర నాయకురాలు నూనె సులోచన, రాష్ట్ర నాయకులు బోలిశెట్టి కృష్ణయ్య, మల్లెబోపోయిన వెంకటేష్ బాబు, కిషన్ మోర్చా రాష్ట్ర నాయకులు చిట్టిబాబు, జిల్లా నాయకులు కట్కోజు నాగేంద్ర చారి, ఓరుగంటి పురుషోత్తం, మండల అధ్యక్షులు సతీష్, జిల్లా నాయకులు రాధాకృష్ణ, జల్లా జనార్దన్, సుధాకర్ రెడ్డి, చిలుకూరు మండలం ప్రధాన కార్యదర్శి కొండ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.