మాదిగల సుదీర్ఘ పోరాటానికి న్యాయమైన ముగింపు
— భువనగిరి ఎంపీ , మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ప్రజా దీవెన/నల్లగొండ: సుధీర్ఘ కాలంగా 29 ఏళ్ల పాటు కొనసాగుతున్న ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగలు చేస్తున్న సుదీర్ఘపోరాటానికి న్యాయమైన ముగింపు పలకాలని భువనగిరి పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేశారు.
ఈనెల 18 నుంచి 22 వరకు జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ శనివారం కలెక్టరేట్ ముందు ఎంఆర్పిఎస్ ఎంఎస్పి ఆధ్వర్యంలో నిరవధిక దీక్షలను మాదిగ ఉద్యోగుల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపాక వెంకన్న మాదిగ, మాదిగ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర అధ్యక్షులు గాదె రమేష్ మాదిగ , ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి నల్లగొండ జిల్లా కందుకూరి సోమన్న మాదిగ దీక్షలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ మాదిగ మాదిగ ఉపకులాల చిరకాల ఆకాంక్షను సహకారం చేసేలా కాంగ్రెస్ పెద్దలు రాహుల్ గాంధీ ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే లు ప్రధాన మంత్రికి లేఖ రాసి పార్లమెంటులో మాదిగల పక్షాన మాట్లాడాలని కోరారు.
కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర అఖిలపక్షాన్ని ఢిల్లీకి తెలుసుకొని కేంద్రంపై వర్గీకరణ కోసం ఒత్తిడి పెంచాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షలు 22వ తేదీ వరకు కొనసాగుతాయని గల్లీ నుంచి ఢిల్లీ ఉద్యమాలు కొనసాగుతున్నందున ఈ పోరాటాలు ఉదృతం కాకముందే స్పందించి కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో దీక్షలో కూడా తాను పాల్గొంటూ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు . బోడ సునీల్ మాదిగ అధ్యక్షతన జరిగిన ఈ దీక్షలకు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ ఎంఎస్పి రాష్ట్ర నాయకులు మేడి శంకర్ మాదిగ ఎంజేఎఫ్ జిల్లా అధ్యక్షులు జీడిమెట్ల రవీందర్ మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా కో-కన్యూర్ ఎరిగి శ్రీశైలం మాదిగ ఎంఎస్పి నల్గొండ నియోజకవర్గ ఇన్చార్జి బొజ్జ చిన్న మాదిగ , నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జి కొమిరే స్వామి మాదిగ మిర్యాలగూడ నియోజకవర్గ ఇన్చార్జి గడుసు సైదిస్ , మునుగోడు నియోజకవర్గపోలేని యాదయ్య మాదిగ, ఎం ఈ ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు జీడిమెట్ల రమేష్ ఎంఎస్పి మండల అధ్యక్షులు మహిళా సంఘం అధ్యక్షురాలు కూరపాటి కమలమ్మ ఎంఎస్పీ సీనియర్ నాయకులు వంగూరి ప్రసాద్ ఎంఆర్పిఎస్ పట్టణ నాయకులు మాసార వెంకన్న కత్తుల సన్నీ, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు