Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

A.M.O. Dunkudu Srinivas: విద్యార్థుల్లో కనీస అభ్యాసన సామర్థ్యాలను సాధించాలి

— దేవరకద్ర ఎ యం ఓ దుంకుడు శ్రీనివాస్

A.M.O. Dunkudu Srinivas: ప్రజా దీవెన, దేవరకద్ర: విద్యార్థు ల్లో కనీస అభ్యాసన సామర్థ్యాల ను సాధించాలని ఎ యం ఓ దుం కుడు శ్రీనివాస్ అన్నారు. మహబూ బ్ నగర్ లోని గత రోజులుగా ప్రభు త్వ బాలికల ఉన్నత పాఠశాలలో దేవరకద్ర మండల స్థాయి ప్రాథమి క ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న వృత్యంతర శిక్షణ శనివారం విజ య వంతంగా ముగిసింది. ఈ సం దర్భంగా ఉపాధ్యాయ శిక్షణ కేంద్రా న్ని ఏ యం ఓ దుంకుడు శ్రీనివాస్ సందర్శించి ఉపాధ్యాయుల నుద్దే శించి ప్రసంగించారు.

ప్రభుత్వ పాఠ శాలలో చదువుతున్న విద్యార్థుల కు నాణ్యమైన విద్యను అందించి వారి లో విద్యా ప్రమాణాలు పెంచా ల్సిన బాధ్యత ప్రతి ఉపాధ్యాయు డిపై ఉందని అన్నారు. విద్యార్థుల కోసం మెరుగైన బోధన పద్ధతులు, విద్యార్థుల వ్యక్తి గత అవసరాలకు అనుగుణంగా బోధన, విద్యార్థుల సామర్థ్యాలను ఎలా పెంచాలనే అంశాలపై ఇచ్చిన శిక్షణను ఉపా ధ్యాయులు సద్వినియోగం చేసు కోని క్షేత్ర స్థాయిలో అమలు చేయా లని కోరారు.

మండల విద్యాధికారి, కోర్స్ డైరెక్ట ర్ బలరాం మాట్లాడుతూ విద్యా ర్థుల ఎదుగుదలకు ఉపాధ్యాయు లే కీలకమని అన్నారు. ప్రాథమిక దశలోనే విద్యార్థుల పట్ల శ్రద్ధ కనబ రచి వారికి చదవడం రాయడం నేర్పించాలని కోరారు.దీనికి ఆను గుణంగా పాఠ్యాంశాలను ప్రభు త్వం ఏర్పాటు చేస్తున్నదని తద్వా రా విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదుగుతారన్నారు. కనీస అభ్యాస న సామార్థ్యల సాధనయే లక్ష్యంగా ఉపాధ్యాయులు పనిచేయాలని సూచించారు. డిఆర్పీ జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల స్థాయికనుగుణంగా విద్యా బోధన చేయాలని కోరారు. ఈ కార్యక్ర మంలో ఆర్ పి లు సూర్మి రాఘ వేందర్, రమేష్,శంకర్, పవన్, శ్రీ నివాస్ రెడ్డి, యం.రాఘవేందర్, నాగరాజు, తిరుపతమ్మ తదిత రులు పాల్గొన్నారు.