Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

A strange incident: సాక్షాత్కారమైన బ్రహ్మంగారి కాలజ్ఞానం..?

–వేప చెట్టు నుంచి పాలు కారుతు న్న వైనం
— బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కారణముం టున్న నిపుణులు
–నంద్యాల జిల్లా ఆత్మకూరు మండ లంలో వెలుగు చూసిన ఘటన

A strange incident: ప్రజాదీవెన, ఆత్మకూరు: నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం వెంకటాపురం గ్రామంలో (In Venkatapuram village) వింత ఘటన వెలుగుచూసింది. మూగి తిమ్మరెడ్డికి చెందిన పొలంలోని వేప చెట్టు నుంచి ధారగా పాలు కారుతున్నాయి. చెట్టుపై (tree)12 అడుగుల నుంచి పాలధార నిరంతరం కారుతూనే ఉంది. ఈ వార్త తెలియడంతో… జనాలు తండోపతండాలుగా వచ్చి చూసి వేప చెట్టుకు పూజలు చేస్తున్నారు. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్టు వేప చెట్టు నుంచి పాలు కారుతున్నాయని.. ఇలా తమ ఊరిలో జరగడం చాలా సంతోషకరంగా ఉందని గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

గత మూడు రోజులుగా వేప చెట్టుకు (neem tree) పాలు (milk) కారుతున్నాయి అన్న ప్రచారంతో చుట్టుపక్కల గ్రామల ప్రజలు వేప చెట్టును చూడడానికి తండోపతండాలుగా వచ్చి వేపచెట్టు ఎల్లమ్మ దేవతగా భావించి పూజలు చేస్తున్నారు. నాగులచవితి (Nagulachavithi)ముందర వేప చెట్టుకు పాలు కారడం శుభసూచకమని మహిళలు చెబుతున్నారు. అయితే నిపుణులు మాత్రం వేప చెట్టు నుంచి పాల లాంటి ద్రవం కారడానికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణమని చెబుతున్నారు. ఇది అసాధారణమేమీ కాదంటున్నారు. వేప చెట్టు బాగా చావ పెరిగిన తర్వాత ఎక్కువైన నీటిని కణాల్లో స్టోర్ చేసుకుంటుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ (Bacterial infection)కారణంగా చెట్టు కాండంపై తొర్రల్లా వస్తాయి. వెదర్‌లో తేమ శాతం పెరిగినప్పుడు, కొమ్మల్లోని ఈ తొర్రలు బలహీనపడి పగుళ్లు కనిపిస్తాయి. ఆ కారణం చేత.. చెట్టు నుంచి పాల లాంటి ద్రవం బయటకు వస్తుంది. 50 ఏళ్లు దాటిన వేప చెట్లలో ఇలా ఎక్కువగా జరుగుతుందట. అయినప్పటికీ గ్రామాల్లో ప్రజలు మహిళలు మాత్రం వేపచెట్టు అన్నది తమ ఇలవేల్పు అని… ఎల్లమ్మ తల్లిగా భావిస్తామని.. వేప చెట్టుకు (neem tree)పాలు కారడం ఆ తల్లి ప్రసాదంగా భావిస్తామని చెబుతున్నారు. ఆ చెట్టుకు పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టి… పూజలు చేసి కొబ్బరికాయలు కొడుతున్నారు.