KTR: ప్రజా దీవెన, హైదరాబాద్: దేశంలోనే సంచలనం సృష్టించిన ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ కు మరోమారు నోటీసులు అందాయి. ఈ నెల 16వ తేదిన హాజరుకావాల ని నోటీస్ లు అందించింది ఏసీబీ. హైదరాబాద్ ఫార్మూలా ఈ కార్ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెం ట్, మాజీ మంత్రి కేటీఆర్ కు ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 16వ తేది ఉ దయం 10 గంటలకు హాజరుకావా లని ఆ నోటీస్ లో పేర్కొన్నారు. కా గా ఇప్పటికే ఒకసారి ఏ1గా ఉన్న కే టీఆర్, ఏ2గా ఉన్న సీనియర్ ఐఏ ఎస్ అధికారి అరవింద కుమార్, ఏ 3గా ఉన్న హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిలను విడివి డిగా విచారించారు. మరోసారి వి చారణకు హాజరు కావాల్సి ఉంటుం దని అప్పుడే చెప్పారు.
అయితే ఇటీవలే ఎసిబి కెటిఆర్ కు విచారణ కు రావాల్సిందిగా నోటీస్ పంపింది. ఈ సందర్భంగా ఈ నోటీస్ కు కెటిఆ ర్ జవాబిస్తూ విదేశాలలో ముంద స్తు కార్యక్రమాలు ఉండటంతో విచా రణకు రాలేకపోతున్నానని వివరిం చారు. మరో తేదిని కేటాయించవల సిందిగా కోరారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మరోమారు నోటీస్ జారీ చేశారు.