Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

ACB: ఏసీబీ వలలో ఎస్ఐ

–ఓ కేసు నుంచి తప్పించేందుకు రూ.70 వేలు డిమాండ్‌

ACB: ప్రజా దీవెన, వరంగల్:నిందితులను ఓ కేసు నుంచి తప్పించడానికి లం చం తీసుకుంటూ వరంగల్‌ జిల్లా పర్వతగిరి ఎస్సై గుగులోత్‌ వెంకన్న (Si Gugulot Venkanna)అవినీతి నిరోధక శాఖ అధికారుల కు శుక్రవారం చిక్కాడు. వరంగల్‌ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య వివరాల ప్రకారం గత నెల 27న బెల్లం లోడు తో వెళ్తున్న ట్రాలీ వాహనాన్ని అన్నా రం షరీఫ్‌ వద్ద పర్వతగిరి పోలీసు లు అదుపులోకి తీసుకుని కేసు న మోదు చేశారు. అయితే పట్టుబడి న ముగ్గురు నిందితులను తప్పిం చేందుకు ఎస్సై వెంకన్న (siVenkanna) రూ.70 వేలు డిమాండ్‌ చేశారు. అదే రోజు రూ.20వేలు ఆన్‌లైన్‌ ట్రాన్స్‌ఫర్‌ చేయడంతో వారిని వదిలేశాడు. స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చేందుకు మరో రూ.50వేలు ఇవ్వాలని, లేకపోతే జ్యుడీషియల్‌ రిమాండ్‌కు (Judicial remand)పంపి స్తానంటూ ఒత్తిడి చేయడంతో నింది తుడు బెల్లం వ్యాపారి బాదావత్‌ భాస్కర్‌ ఏసీబీ అధికారులను ఆశ్ర యించాడు. అధికారుల పథకం ప్రకారం రూ.40వేలు ఇస్తామని శుక్రవారం భాస్కర్‌ ఎస్సైకి ఫోన్‌ చే యగా ఆయన తన డ్రైవర్‌ సదా నందంకు ఇవ్వాలన్నాడు. ఆమేరకు డ్రైవర్‌కు డబ్బులివ్వడంతో అతను ఆ మొత్తం తీసుకుని ఎస్సై ఆఫీసు కు వెళ్లగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. అనంతరం ఎస్సై, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు