Praja Deveena
Newspaper Banner
Date of Publish : 23 December 2025, 2:34 pm Posted by : praja deveena

Secretary Askani Maruti Sagar : అక్రెడిటేషన్స్ కొత్త ఉత్తర్వులు సవ రించాలి 

–రెండు కార్డుల విధానానికి స్వస్తి ప లకాలి

— ఈ నెల 27న అన్ని జిల్లా కలెక్ట రేట్ ల ముందు ఆందోళనలు

— టీ యూ డబ్ల్యూ జే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్

Secretary Askani Maruti Sagar : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణలో రెండు సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టు లకు కొత్త అక్రెడిటేషన్స్ జారీ చే య డం కోసం ప్రభుత్వం తీసుకువ చ్చి న జీ.ఓ నెంబర్ 252 పూర్తిగా లో ప భూయిష్టంగా ఉందని టీయూ డ బ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆ స్కాని మారుతి సాగర్ అన్నారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్ల బ్ లో నిర్వహించిన మీడియా స మావేశంలో యూనియన్ కోశాధి కారి పి.యోగనంద్, టెంజు ప్రధాన కార్యదర్శి ఎ.రమణ కుమార్, ఐ జేయు జాతీయ కార్యవర్గ సభ్యులు అవ్వారి భాస్కర్ లతో కలిసి ఆ యన మాట్లాడారు.

జర్నలిస్టుల కనీస హక్కు, ఆత్మగౌర వాన్ని దెబ్బతీసే విధంగా, జర్నలిస్టు ల మధ్య విభేదాలు తెచ్చే విధంగా కొత్త జీ.ఓ ఉందని ఆయన అభిప్రా య పడ్డారు. తెలంగాణ కోసమే తె లంగాణ జర్నలిస్టులు అన్న నినా దంతో పనిచేసిన జర్నలిస్టులకు తె లంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో 201 4 మార్చి నెలలో జరిగిన జర్నలిస్టు జాతరకు వచ్చిన అప్పటి కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ అందరి జర్న లిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇ చ్చుకుందామని ప్రకటించిన విష యాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఆయన సూచన మే రకు పూర్వ మీడియా అకాడమీ చై ర్మన్ అల్లం నారాయణ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 23 వేల మంది జర్నలిస్టులకు అక్రెడిటే షన్స్ కార్డ్స్ జారీ చేయడం జరిగిందన్నా రు.

ప్రధానంగా డెస్క్ జర్నలిస్టులను కూడా గుర్తించి ఒకే గొడుగు కిందికి తెచ్చి అందరికీ కార్డులివ్వగా 40 ఏ ళ్ల నుంచి జర్నలిస్టుల సంక్షేమం కో సం పనిచేస్తున్నామని ప్రగల్భాలు పలుకుతూ రెండు రాష్ట్రాల్లో ఉండే ఒక సంఘం అప్పట్లో దీనిని వ్యతిరే కించిందని, నేడు వాళ్ళ యూని య న్ కు చెందిన జాతీయ నాయకుడే మీడియా అకాడమీ చైర్మన్ ఉండ టంతో ఇప్పుడు డెస్క్ జర్నలిస్టు ల ను వేరు చేసి వాళ్ళ పంతాన్ని నెగ్గిం చుకున్నారని ఆరోపించారు. ఈ వి షయాన్ని డెస్క్ జర్నలిస్టులు నిశి తంగా గమనించాలని కోరారు. మీ డియా అక్రిడిటేషన్ కార్డు, మీడియా కార్డు పేరిట రెండు కార్డులు తెచ్చి గందరగోళం సృష్టించారని, ఏ కార్డు వల్ల ఏ ప్రయోజనం జరుగుతుందో జీవోలో విశదీకరించలేదని, జర్నలి స్టులనే వాళ్లకు అందరికీ ఒకే రకమై న ప్రయోజనాలు ఉండాలని డి మాండ్ చేశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చి రెండు ఏళ్ళు పూర్తవు తున్న నేపథ్యంలో కొత్తగా ఇవ్వబో యే కార్డుల కోసం కొత్త నిబంధ న లు పెట్టి కార్డులలో 10 వేలకు పైగా కోత పెట్టె విధంగా ప్రస్తుత నిబంధ నలు తెచ్చారన్నారు. ఈ నిబంధన లతో జర్నలిస్టులు తమ హక్కుగా పొందే అక్రెడిటేషన్స్ కార్డులను కో ల్పోవడం అనివార్యం అన్నారు. రి పోర్టర్స్, డెస్క్ జర్నలిస్టులకు మధ్య విబేధాలు సృష్టించే విధంగా “మీ డియా కార్డును” తేవాలని యో చించడం శోచనీయమన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన త ర్వా త కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న స మయంలో తీసుకు వచ్చిన జి.ఓ 2 39 ప్రకారం అప్పటి చైర్మన్ అల్లం నారాయణ కేబుల్ ఛానెల్ లకు రాష్ట్ర స్థాయిలో 12, జిల్లా స్థాయి లో నాలుగు అక్రెడిటేషన్స్ ఇవ్వగా ప్రస్తుత చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి కేబుల్ ఛానల్ పై కక్ష కట్టినట్లు రాష్ట్ర స్థా యిలో ఒక్క కార్డు కూడా ఇవ్వకుం డా జీవో తేవడం వెనుక మర్మం ఏ మిటో అర్థం కావటం లేదన్నారు. రా ష్ట్ర ముఖ్యమంత్రి, సమాచార శాఖ మంత్రికి ప్రస్తుతం మీడియా అకాడ మీ తో పాటు, ఆయన కొనసాగుతు న్న సంఘం వారు తప్పుడు సమా చారం ఇవ్వడం వల్లే ఇలాంటి జీవో వచ్చి ఉంటుందని తాము భావిస్తు న్నామని, రాష్ట్రంలోని మెజార్టీ జర్న లిస్టులు వ్యతిరేకించే ఈ జీవో ను వెంటనే పునః పరిశీలించి అర్హులైన అందరి జర్నలిస్టులకు అక్రిడిటేషన్ లు అందేలా నూతన జీఓను సవరించాలని డిమాండ్ చేశారు.

తెంజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమ ణ కుమార్, కోశాధికారి యోగా నం ద్ లు మాట్లాడుతూ ఇండిపెండెంట్ జర్నలిస్టుల కనీస అనుభవం 10 సంవత్సరాలనుండి 15 సంవత్స రాల పెంచడం అన్యాయం అన్నా రు. 23 వేల అక్రిడేషన్ కార్డులు ఇస్తే ఇక్కడ అర్హులకు కార్డులు ఇవ్వడం లేదని ఢిల్లీకి పోయి ధర్నా చేసిన ఆ ఆంధ్రా సంఘం నాయకులు ఇప్పు డు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నిం చారు. పెద్ద పేపర్లకు, శాటిలైట్ ఛానల్ లకు సైతం భారీ స్థాయిలో కోత విధించారని, అనుభవంలోకి వస్తే కానీ అందరికీ అర్థం కాని విధం గా ఈ జీవో ను తీసుకువచ్చారని అన్నారు. ఐజేయు నాయకులు భాస్కర్ మాట్లాడుతూ మీడియా అక్రిడిటేషన్ కమిటీలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులను ఎందు కు చేర్చారని ప్రశ్నించారు. ఢిల్లీలో ఒకపక్క పిసిఐ కమిటీయే కేంద్ర ప్ర భుత్వం ఏర్పాటు చేయలేదని, అ సలు ప్రస్తుతం సభ్యులే లేరని అ లాంటప్పుడు ఎవరిని ఈ కమిటీలో సభ్యులుగా చేరుస్తారో అర్థం కావ డం లేదన్నారు.

*27 న కలెక్టర్ కార్యాలయాల ముందు ఆందోళనలు…* ప్రభు త్వం కొత్తగా తెచ్చిన జీ.ఓ 252 ను సవరించాలని డిమాండ్ చేస్తూ తె లంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 27 అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ కా ర్యాలయాల ముందు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలి స్టు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిం చాలని ఈ సందర్భంగా వారు పి లుపునిచ్చారు. అప్పటిలోపు ప్ర భుత్వం జీఓ ను సవరించాలని తా ము కోరుకుంటున్నామని, ఒకవేళ తాత్సారం చేస్తే రాజ్యాంగం కల్పిం చిన హక్కుగా ఆందోళన కార్యక్రమా లకు శ్రీకారం చుడతామని ఆ సం ఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆ స్కాని మారుతి సాగర్ ప్రకటించా రు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా ఇంచార్జ్ నవీన్ కుమార్ యా రా, జిల్లా అధ్యక్షులు రాకేష్ రెడ్డి, జిల్లా కోశాధికారి బాపూ రావు తది తరులు పాల్గొన్నారు.