–పది రోజుల్లో అర్హులైన చెంచుల కు ఇందిరమ్మ ఇండ్లు
–ఇందిర సౌరగిరి జలవికాసం పథ కo ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి
Solar Pump Sets : ప్రజా దీవెన , అచ్చంపేట : సోలార్ పంపు సెట్ల ఏర్పాటులో అచ్చం పే ట నియోజకవర్గాన్ని భారత దేశా నికి రోల్ మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని తెలంగాణ ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నా రు. ఈ నియోజకవర్గంలో ఉన్న అ న్ని కరెంట్ పంపు సెట్ల స్థానంలో సోలార్ పంపు సెట్లను వంద రోజు ల్లో ఏర్పాటు చేస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలోని పోడు భూ ములను వ్యవసాయ యోగ్యంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం తల పెట్టిన ఇందిర సౌర గిరి జల వికా సం పథకాన్ని సోమవారo నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండ లం మాచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులతో కలిసి సీఎం ప్రారంభించారు. ఈ సంద ర్భంగా సోలార్ పంపు సెట్ల లబ్ది దారులతో రేవంత్ రెడ్డి ముఖా ము ఖి కార్యక్రమం నిర్వహించారు.
అచ్చంపేట నియోజకవర్గంలో సో లార్ పంపు సెట్లకు ఒక్క రూపాయి కూడా రైతులుచెల్లించాల్సిన పని లేదని సీఎం చెప్పారు. నూటికి నూ రు శాతం ప్రభుత్వమే ఈ ఖర్చును ప్రభుత్వమే భరించి రైతులకు ఉచి తంగా సోలార్ పంపు సెట్లు అంద జేస్తుందన్నారు. సోలార్ పంపు సె ట్ల ఏర్పాటులో భాగంగా రైతులకు 5.7.5 హెచ్ పీ పంపు సెట్లు ఇస్తా మన్నారు. రైతులు తమ వ్యవసా య అవసరాలకు వినియోగించుకు న్న తర్వాత కూడా మిగిలే విధంగా సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేయా లని, ఉత్పత్తి అయ్యే అదనపు వి ద్యుత్ను ప్రభుత్వమే కొనుగోలు చే స్తుందని చెప్పారు. సోలార్ నుంచి ప్రతి రైతుకు నెలకు రూ.3 వేల నుంచి 5 వేల ఆదాయం వచ్చేలా ప్యానల్స్ ఏర్పాటు చేయాలని అ ధికారులను ఆదేశించారు. ప్రభు త్వం కొనుగోలు చేసిన విద్యుత్కు సంబంధించిన డబ్బులను మహి ళా రైతుల ఖాతాల్లో ప్రతి నెల జమ చేస్తామని చెప్పారు.
నియోజకవర్గంలో చెంచులకు పది రోజులలో ఇందిరమ్మ ఇల్లు కేటా యించేందుకు చర్యలు చేపడతా మని సీఎం తెలిపారు.ఇందిర సౌర గిరి జల వికాసం పథ కం ద్వారా సోలార్ పంపు సెట్లు పొందిన లబ్దిదారులు వాటిని జా గ్రత్తగా కాపాడుకో వాలని సీఎం రేవంత్ సూచించారు. అలాగే ల బ్దిదారు లతో ఇతర రైతులకు అవ గాహన, శిక్షణ కార్యక్రమాలు ఏర్పా టు చేయాలని అధికారులను ఆదే శిం చారు. నల్లమల్ల అడవుల్లో వి ద్యు త్ లైన్ల ఏర్పాటుకు అనేక ఇ బ్బం దులు ఉన్నాయి. కానీ ఇప్పు డు సోలార్ విద్యుత్ తో కరెంటేమీ వద్ద కు వచ్చిందన్నారు. ఈ సంద ర్భం గా అలివేలు అనే మహిళా రై తు సీఎంతో మాట్లాడుతూ 29 మంది రైతులం కలిసి సోలార్ పంపు సెట్ ఏర్పాటు చేసుకున్నా మని, మే మంతా ఈ పంపు సెట్ల ద్వారా పం డ్ల మొక్కలు సాగు చే స్తున్నట్లు చెప్పారు. మాకు ఈ అవ కాశం ఇచ్చినందుకు ఈ సంతోషం మా టల్లో చెప్పలేకపోతున్నామని మి మ్మల్ని చూస్తుంటే దేవుడిని చూ సినట్లుగా ఉందని సీఎంతో చెప్పా రు.
అచ్చంపేట నియోజకవర్గము లో ఇందిరా సౌర గిరిజల వికాసం పథ కం ప్రారంభ బహిరంగ సభలో డి ప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మా ట్లాడుతూ తెలంగాణ గడ్డపై దశా బ్దాలుగా ఉన్న దున్నేవానికి భూమి
నినాదాన్ని ఇందిరా సౌరగిరి జిల్లా వికాసం వంటి పథకాల ద్వారా చట్టాలుగా అమలు చేస్తున్నామ న్నారు. తెలంగాణ గడ్డపై ఉన్న ని నాదాలు చట్టాలుగా మారాలంటే మరో 20 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండాలని అన్నారు.
నల్లమల డిక్లరేషన్ను తూచా తప్ప క పాటించి నాలుగు సంవత్సరాల్లో ఈ రాష్ట్ర గిరిజనులకు ఫలితాలు అందిస్తామని తెలిపారు. ఇందిరా సౌర గిరిజన వికాసం పథకం ప్రా రంభం భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజని దే శంలోనే గర్వించదగిన గొప్ప కార్య క్రమం అని పేర్కొన్నారు.
త ప్రభుత్వంలో గిరిజనులు పంట పండించుకోవడానికి వెళితే మహి ళలని చూడకుండా చెట్టుకు కట్టేసి కొట్టారు, పురుషులపై పోలీసు కేసు లు నమోదు చేశారని, గుర్తు చేశా రు. రాష్ట్రం అభివృద్ధి చెంద వద్దని, ఫలితాలు ప్రజలకు అందవద్దని ని త్యం ప్రజల కోసం పనిచేసే ప్రభు త్వంపై ఒక మాట అన్న, కుట్ర చేసి న అది రాష్ట్ర ప్రజలపై కుట్రగానే భావిస్తామని, జూన్ 2న గిరిజన యువతకు రాజీవ్ యువ వికాసం స్వయం ఉపాధి పథకం ద్వారా 10 00 కోట్లు మంజూరు చేయబోతు న్నామన్నారు. ఇది పేదల ప్రభు త్వం మన ప్రభుత్వం గుండెల్లో పెట్టుకొని కాపాడుకోండి, ఇందిరా జలవికాసం ఆరంభం మాత్రమే కా బోయే రోజుల్లో అనేక సంక్షేమ పథ కాలు అమలు చేయబోతున్నాయ ని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి నా యకత్వంలో యావత్ క్యాబినెట్ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పని చేస్తుందని నల్లమల్ల సాక్షిగా మాట ఇస్తున్నామని, యంగ్ ఇండియా రె సిడెన్షియల్ పాఠశాలల ద్వారా ఓ ఉమ్మడి కుటుంబాన్ని, అద్భుత మై న సమాజాన్ని నిర్మించబోతున్నా మని స్పష్టం చేసారు.