–కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేష న్, 358కి చేరిన మృతుల సంఖ్య
–అట్టమల అడవుల్లో నలుగురిని కాపాడిన రెస్క్యూ బృందాలు —
–ఆపన్న హస్తం అందించేందుకు ముందుకొచ్చిన సినిమా రంగం
–రూ.3 కోట్లు విరాళమిచ్చిన నటుడు మోహన్ లాల్
–100 ఇళ్ళు నిర్మించి ఇస్తామన్న కర్ణాటక ప్రభుత్వం
Actor Mohanlal : ప్రజా దీవెన, వయనాడ్: కొండచరియలు (Landslides)విరిగిపడి ఐదు రోజులవుతున్నా వయనాడ్ ఇంకా తేరుకోలేదు. వందల సంఖ్యలో ఇళ్లు నేలమట్టమయ్యాయి, పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మరెందరో బురద లో కూరుకుపోయారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగు తున్నా యి. సాయుధ దళాలు, ఎన్డీఆర్ఎఫ్, ప్రభుత్వయం త్రాంగంతో (Armed Forces, NDRF, Govt) కూడిన రెస్క్యూ ఆపరేషన్ కొనసా గుతున్నది. ఈ విపత్తులో మరణిం చిన వారి సంఖ్య అధికారిక సమా చారం మేరకు 358కు చేరింది. ఇంకా 206 మంది ఆచూకీ తెలియ డం లేదని కేరళ సీఎం పినరాయి విజయన్ ప్రకటించారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని గుర్తిం చేందుకు డ్రోన్లు, థర్మల్ స్కానర్ల ద్వారా గాలింపు చేపడు తున్నారు. చురల్ మల ప్రాంతం లోని ఓ బాలిక ఇటీవల అచ్చం ఇలాంటి ఘటననే కళ్లకు కట్టినట్లు కథ రాసింది. ఈ కథ స్కూల్ మ్యాగజైన్లో ప్రచురితమైంది. ఇక్కడ 8వ తరగతి చదువుతున్న బాలిర లయ.. ‘భారీ వర్షం కురవడంతో కొండచరియలు విరిగిపడతాయి. వాటి ధాటికి ఊర్లన్నీ నాశన మవుతాయి.
వరదలు (floods) తనకు ఎదురుగా వచ్చే వాటినన్నింటినీ తనలో కలుపుకుంటూ ముం దుకెళ్తుంది..’ ఇదీ కథ సారాంశం. దురదృష్టం ఏంటంటే.. ఈ కథ రాసిన లయ తండ్రి కూడా ప్రాణాలు కోల్పోవడం. ఆమె చదువుతున్న పాఠశాల పూర్తిగా ధ్వంసం కాగా.. 32 మంది చిన్నారులు వరదలకు బలయ్యారు. మరో పాఠశాలకు చెందిన 12 మంది విద్యార్థులు కూడా ప్రాణాలొదిలారు. ఇక్కడి జలప్రళయాన్ని చూసినట్లుగానే ఎలా తన కథలో రాయగలిగిందని పలువురు అనుకుంటున్నారు. మరోవైపు జలప్రళయానికి గురైన వారిని ఆదుకునేందుకు సినిమారం గానికి చెందిన పలువురు ముందు కు వచ్చారు.
వయనాడ్లోని (wayanad) చూరల్మాల, ముండకై గ్రామాలను నటుడు మోహన్లాల్ సంద ర్శించారు. లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో మోహన్లాల్ అధికా రులతో భేటీ అయి సహాయక చర్యల గురించి అడిగి తెలుసు కున్నారు. ఈ ఘటనలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శిం చారు. ఘటనా ప్రాంతంలో సహాయక చర్యల్లో పాల్గొంటున్న వాలంటీ ర్లు, పోలీసులు, రెస్క్యూ టీమ్లు, ప్రభు త్వ అధి కారుల కృషిని మోహన్లాల్ (Actor Mohanlal) ప్రశంసించారు. బాధితుల పునరావాసం కోసం రూ.3 కోట్ల విరాళం అందజేశారు. అవసరమున్న పక్షంలో మరింత విరాళం అందిం చేందుకు తన సుముఖతను ఆయన వ్యక్తం చేశారు. వయనాడ్ బాధితుల కోసం సురక్షి తమైన ప్రదేశంలో టౌన్షిప్ ను కేరళ ప్రకటిం చింది. కేరళ రాష్ట్రానికి కర్ణాటక ప్రభుత్వం ఆపన్న హస్తం అందించింది. ఇక్కడి బాధితులకు 100 ఇళ్లు నిర్మించి ఇస్తామని ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి సిద్ధ రామయ్య (Siddha Ramaiah) ఎక్స్ వేదికగా వెల్లడించారు.