Actress Renu Desai : ప్రజా దీవెన, హైదరాబాద్: వివాదా లకు వేదికగా నిలిచిన హెచ్‌సీ యూలోని 400 ఎకరాల భూమికి సంబంధించి ప్రముఖ సినీ నటి రే ణూ దేశాయ్ అప్పీల్ వీడియో వి డుదల చేసింది. సదరు వీడియో తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం కొనసాగుతోన్న హెచ్‌సీ యూలోని 400 ఎకరాల భూమికి సంబం ధించి వివాదం నేపథ్యంలో నటి రేణు దేశాయ్ ఓ వీడియో విడు దల చేశారు. ఏమాత్రం అవకాశం ఉన్నా ఆ భూమిని అలాగే వదిలే యాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆమె అభ్యర్థించారు.
తనకు ఇ ప్పుడు 44 ఏళ్లు అని, రేపో మాపో చనిపోతానని, కానీ తర్వాతి తరా లకు ఆక్సిజన్, నీరు కోసం ఇలాంటి భూమి ఎంతో అవ సరం ఉందని గుర్తు చేసింది. అభి వృద్ధి జరగాల్సిందేనని,దాని కోసం మరోచోట భూమిని ఉపయోగించా లని వీడియోలో ఆమె కోరారు. ఇక తన స్నేహితులు చాలామంది ఈ వీడియో చేయవద్దని తనను కోరా రని, కానీ ఒ క తల్లిగా తన మన స్సాక్షి తనను ఇలా చేయమని బలవంతం చేసిందని తెలిపారు.
మనం మన పిల్లలకు ఉత్తమ వి ద్య, మంచి ఆహారం, వారి భవి ష్య త్తు కోసం చాలా డబ్బు సంపాది స్తున్నాం. కానీ వాటన్నింటి కంటే ముందు మనకు ఆక్సిజన్, నీరు అవసరమని రేణు దేశాయ్ పేర్కొ న్నారు.
Heroine renudesai appel to CM revanth reddy on hcu pic.twitter.com/F9ajGgYjfg
— praja deveena web site and digital edition e paper (@PDeveena40655) April 2, 2025