Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Additional Collector J. Srinivas: బిఎల్ ఓలకు పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వాలి

— నల్లగొండ జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్
Additional Collector J. Srinivas: ప్రజా దీవెన, నల్లగొండ: ఎన్నికలకు సంబంధించి బూత్ స్థా యి అధికారుల విధులు, బాధ్య తలు, కొత్త ఓటర్ల నమోదు, సవర ణల కు సంబంధించిన అంశాలపై బి ఎల్ ఓ లకు పూర్తిస్థాయిలో శిక్ష ణ ఇవ్వాలని రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ మాస్టర్ ట్రైన ర్లకు సూచించారు .

శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మాస్టర్ ట్రైనర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఓటరు జాబి తా కు సంబంధించి అలాగే బి ఎల్ ఓ విధులు, బాధ్యతలకు సంబంధిం చి బి ఎల్ ఓ లను శక్తివంతులుగా తీర్చిదిద్దే విధంగా శిక్షణ ఇవ్వాలని, జూలై 3 నుండి 17 వరకు ఇచ్చే ఈ శిక్షణ కార్యక్రమంలో అన్ని అంశా లను తెలియజేయాలని, ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు రోజు మొత్తం శిక్షణ ఇవ్వాలని తెలిపారు. ఈ శిక్షణ కార్య క్రమంలో ఫారం 6,7,8 లను నింపడం పై, అలాగే ఇంటింటి సర్వే ఎలా చేయాలో తెలియజేయాలని చెప్పారు.ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని అసెంబ్లీ ని యోజకవర్గాల్లో మాస్టర్ ట్రైనర్లకు ఇలాంటి శిక్షణ కార్యక్రమాన్ని ఈఆ ర్ ఓ లు నిర్వహించడం జరిగింది .

ఈ శిక్షణా కార్యక్రమానికి నాగా ర్జునసాగర్ నియోజకవర్గ పరిధి లోని తహసిల్దార్లు, ఎలక్షన్ డి ప్యూటీ తహసిల్దారు,ఎలక్షన్ డి టి లు అసెంబ్లీ స్థాయి మాస్టర్ ట్రైనర్లు హాజరయ్యారు.