Adluri Ponnam : ప్రజా దీవెన, హైదరాబాద్: ప్రభు త్వ, పార్టీ అధినేతలు అధికార కాం గ్రెస్ పార్టీలో నెలకొన్న తాత్కాలిక సంక్షోభానికి తెరదించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ నాకు అన్నలాంటి వారు అని మంత్రి పొన్నం ప్రభాకర్ సారీ చెప్పడంతో మొత్తానికి మం త్రుల మధ్య నెలకొన్న బహిరంగ వివాదానికి ఏఐసిసి పిసిసి నాయ కత్వాలు ఫుల్ స్టాప్ పెట్టాయి. మం త్రులు పొన్నం ప్రభాకర్ అడ్లూరి ల క్ష్మణ్ ల మధ్య వివాదం ముగిసింది అంటూ బుధవారం ఓ ప్రకటన విడుదల అయింది.
కాంగ్రెస్ పార్టీలో మా ఇద్దరికి 30 ఏ ళ్లుగా ఉన్న స్నేహబంధం రాజకీ యాలకు మించినదేనన్నారు. మా మధ్య ఉన్న అనుబంధం, పరస్పర గౌరవం ఎప్పటికి అలాగే కొనసాగిం దని ఎవరు విడదీయరానిది అని పొన్నం వివరించారు. నేను అడ్లూ రిపై ఎలాంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదని మంత్రి పొన్నం క్లారిటీ ఇచ్చారు. అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన వ్యక్తిగా, బీసీ వర్గానికి చెం దిన నాయకుడిగా, నాకుఆయనపై
ఎవరిపైనా అలాంటి అభిప్రాయం ఉండబోదని స్పష్టం చేశారు. రాజ కీయ దురుద్దేశంతో కొందరూ నా వ్యాఖ్యలను వక్రీకరించి, అవాస్తవా లు ప్రచారం చేశారన్నారు.
సదరు వ్యాఖ్యలతో ఏర్పడిన అ పార్థాల వల్ల నా సోదరుడు లాంటి వారైన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మనసు నొచ్చుకుందని తెలిసి నేను తీవ్రంగా చింతస్తున్నాను అని తెలి పారు. కాంగ్రెస్ సిద్ధాంతాలను బలో పేతం కోసం మేము ఇద్దరం కలిసిక ట్టుగా కృషి చేస్తామని మంత్రి పొ న్నం పేర్కొన్నారు. ఇదిలా ఉండగా వివాదం పై చర్చలు జరుగుతున్న సందర్భంలోనే మంత్రి పొన్నం ప్రభా కర్ కు చెందిన కరీంనగర్ ఇంటి వ ద్ద పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు.
ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ను బహిరం గ వేదికపై సహచర మంత్రి పొన్నం బాడీ షేమింగ్ చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎస్సీలు పొన్నంపై మండిపడుతు న్నారు. మాదిగ సామాజికవర్గానికి చెందిన తమ నేతను అవ మానిస్తా రా అంటూ రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలు తీవ్ర స్థాయిలో మండిప డుతున్న విషయం విదితమే.
*మంత్రులు పరిధిలు దాటొ ద్దు…* తెలంగాణ మంత్రులు పొ న్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ మ ధ్య చెలరేగిన వివాదానికి తెరప డిందని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ప్రకటించారు. ఆయన తన నివాసం లో ఇరువురు మంత్రుల మధ్య స యోధ్య కుదిరింది. బుధవారం ఉద యం పీసీసీ చీఫ్ నివాసంలో బ్రేక్‌ఫా స్ట్ మీటింగ్‌లో అడ్లూరికి పొన్నం క్ష మాపణలు చెప్పారు. దీంతో ఇరు వురి మధ్య వివాదం ముగిసింది. దీ నిపై పీసీసీ చీఫ్ మాట్లాడుతూ మం త్రి పొన్నం ప్రభాకర్ చేశారన్న వ్యా ఖ్యల పట్ల మరో మంత్రి లక్ష్మణ్ నొ చ్చుకోవడంతో యావత్ సమాజం కొంత బాధపడిందన్నారు. మంత్రు ల మధ్య జరిగిన సంఘటన కుటుం బ సమస్యగా వెల్లడించారు.జరిగిన సంఘటన పట్ల చింతిస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ క్షమాపణలు చెప్పా రన్నారు.
మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూ రి లక్ష్మణ్ కష్టపడి పైకొచ్చిన నేతల ని తెలిపారు. ఈ సమస్య ఇంతటి తో సమసిపోవాలని యావత్ మాది గ సామాజిక వర్గానికి విజ్ఞప్తి చేశా రు. ఎక్కడ మాట్లాడినా కూడా బా ధ్యతాయుతంగా వ్యవహరించాల ని సహచర మంత్రివర్గానికి కూడా విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల పార్టీ అని స్పష్టం చేశారు. రా హుల్ గాంధీ ఆశయాన్ని ఆకాంక్షల ను కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకె ళ్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నే తృత్వంలో డిప్యూటీ సీఎం భట్టి వి క్రమార్క సహాయంతో కుల సర్వే పారదర్శకంగా నిర్వహించామన్నా రు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మూడు చట్టాలు తీసుకొ చ్చామని పీసీసీ చీఫ్ మహేష్ కు మార్ గౌడ్ పేర్కొన్నారు.
*సమస్య సమసిపోయింది*
పొన్నం ప్రభాకర్ క్షమాపణ కోర డం తో ఈ సమస్య ఇంతటితో సమసి పోయిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. పొన్నం ప్రభాకర్‌ను గౌర విస్తా కానీ ఆయన వాఖ్యల పట్ల మాదిగ జాతి బాధపడిందన్నారు. అట్టడుగు సామాజిక వర్గాలకు కాం గ్రెస్ అండగా ఉంటుందని తెలిపా రు. జెండా మోసిన తనకు మంత్రిగా అవకాశం ఇచ్చారని పార్టీ లైన్ దాటే వ్యక్తిని కానని మంత్రి అడ్లూరి లక్ష్మ ణ్ స్పష్టం చేశారు. మొత్తానికి సమ స్య సమసిపోయిందని లక్ష్మణ్ స్పష్టం చేశారు.