–రాబోయే రోజుల్లో ఏఐకి మరిన్ని మెరుగులు
–గూగుల్ క్లౌడ్ జనరేటివ్ ఏఐ ప్రోగ్రాం ద్వారా సెకన్ల వ్యవధిలో కొత్త కంటెంట్ సృష్టి
–గూగుల్ క్లౌడ్ జెన్ ఏఐ కార్యక్రమా న్ని వీవీఐటీ, విజ్ఞాన్ యూనివర్సిటీ విద్యార్థులకు అందించనున్నాం
–గుంటూరులో జరిగిన కార్యక్రమం లో గూగుల్ క్లౌడ్ ప్రోగ్రాం మేనేజర్ శ్వేతా కొమ్మి నేని, ఎల్4జీ టెక్నికల్ హెడ్ ఆకాష్ సిన్హ లు
AI:ప్రజా దీవెన, గుంటూరు: సమాజం లో అందులోనూ ఆధునిక కాలంలో సాంకేతికత అంచలంచెలుగా ఎదు గుతూ ఆకట్టుకుంటుంది. అంచనా ల కందకుండా ఎంతగానో అభివృద్ధి చెందుతోంది. ప్రతి రంగానికి టెక్నాలజీని అను సంధానిస్తున్నా రు. ప్రధానంగా ఇటీవల వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (Artificial Intelligence) ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా పడుతోంది. అతి తక్కువ సమయంలో వేగంగా మన కు కావాలిసిన సమాచార సేకరణ తో పాటు ఓ పనిని సులభతరంగా చేయడానికి ఏఐ ఉపయోగప డుతోంది.
ఇప్పటికే సాంకేతిక రంగం లో ఏఐ (ai)సరికొత్త విప్లవానికి నాంది పలికింది. ఇప్పటివరకు ఏఐ ద్వారా టెక్స్ట్ సమాచారాన్ని మాత్రమే పొంద గలుగుతున్నాం. కానీ గూగు ల్ క్లౌడ్ జనరేటివ్ (Google Cloud Generative)ఏఐ ప్రోగ్రాం ద్వా రా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ టూల్స్‌ను ఉపయోగించి సెకన్ల వ్యవధిలో కొత్త కంటెంట్‌ను క్రియేట్ చేయవచ్చు. అంతేకాదు ఇమేజ్ ఆధారంగానూ కంటెంట్‌ను సృష్టించే వీలుంటుంది. రానున్న రోజుల్లో ఏఐకి మరిన్ని మెరుగులు దిద్దనున్నారు. దీంతో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (Artificial Intelligence) ప్రాముఖ్యత పెర గనుంది. ఈ నేపథ్యంలో ఇంజినీ రింగ్ విద్యార్థులకు గూగుల్ క్లౌడ్ జెన్ ఏఐ ప్రోగ్రాంపై అవగాహన కల్పించేందుకు గూగుల్ సంస్థ ప్రతినిధులు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు.తొలిసారిగా దేశంలో తొలిసారిగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పెదకాకాని వీవీఐటీ కళాశాలలో ఏర్పాటుచేసిన గూగుల్ క్లౌడ్ ల్యాబ్‌లో గూగుల్ సంస్థ ప్రతినిధులు ‘గూగుల్ క్లౌడ్ జెన్ ఏఐ ప్రోగ్రాం’ను ప్రారంభించారు. గూగుల్ కంపెనీకి చెందిన గూగుల్ క్లౌడ్ ప్రోగ్రాం మేనేజర్ శ్వేతా కొమ్మి నేని, ఎల్4జీ టెక్నికల్ హెడ్ ఆకాష్ సిన్హ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
జనరేటివ్ ఆర్టిఫీషియల్ ఇంటలి జెన్స్ సాంకేతికతలో విద్యార్థులను నిష్ణాతులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రతిష్టాత్మక గూగుల్ సంస్థ ఏర్పా టుచేసిన గూగుల్ క్లౌడ్ జెన్ ఏఐ (Ai)కార్యక్రమాన్ని ఎల్4జీ సంస్థ ద్వారా వీవీఐటీ, విజ్ఞాన్ యూనివర్సిటీ విద్యార్థులకు అందించనున్నారు. ఈ ప్రోగ్రాం ద్వారా లక్షమందికి పైగా విద్యార్థులను జనరేటివ్ ఏఐ సాంకే తికతలో నిష్ణాతులుగా తీర్చిదిద్దే సాంకేతికతను గూగుల్ సంస్థ విద్యార్థులకు అందించనుం ది. రానున్న రోజులలో సాఫ్ట్‌వేర్స్ డెవలప్‌మెంట్‌లో మానవ శ్రమను జెన్ ఏఐ ఏవిధంగా తగ్గించగలదో విద్యార్థులకు వివరించారు. ఈ కార్య క్రమంలో పాల్గొన్న వివిధ కళాశాలలకు చెందిన 30 మంది ఆధ్యాపకులకు జెన్ ఏఐ ప్రోగ్రాం (AI program) గురించి వివరించారు.
రానున్న రోజుల్లో ఏఐ ఎలాంటి పాత్రను సాంకేతిక రంగంలో పోషించను న్నదో తెలియజేసే ఉద్దేశంతో ఇలాం టి కార్యక్రమాలను నిర్వహిస్తున్నా రు. ఇంజినీరింగ్ విద్యార్థులు ఇప్ప టినుంచి ఏఐపై అవగాహన పెంచు కుని ఆరంగంలో నైపుణ్యాన్ని పెంచు కోవల్సిన అవసరాన్ని విద్యా ర్థులకు తెలియజేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడను న్నా యి. భవిష్యత్తులో ఏఐ లక్షల సంఖ్యలో ఉద్యోగాలను సృష్టిస్తుం దని ఎంతోమంది నిపుణులు చెబుతున్నారు. ఈక్రమంలో భవిష్యత్తు అంతా ఏఐదే నంటున్నారు.రానున్న రోజుల్లో ఏఐ ఎలాంటి పాత్రను సాంకేతిక రంగం లో పోషించనున్నదో తెలియజేసే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇంజినీరింగ్ విద్యార్థులు ఇప్పటినుంచి ఏఐపై అవగాహన పెంచుకుని.. ఆరంగం లో నైపుణ్యాన్ని పెంచుకోవల్సిన అవసరాన్ని విద్యార్థులకు తెలియ జేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడనున్నాయి. భవిష్య త్తులో ఏఐ లక్షల సంఖ్యలో ఉద్యో గాలను సృష్టిస్తుందని ఎంతోమంది నిపుణులు చెబుతున్నారు. ఈక్ర మంలో భవిష్యత్తు అంతా ఏఐదేనని నినదిస్తున్నారు.