Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

AIPC Aditya Reddy: ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ నేషనల్ హెడ్ గా ఆదిత్య రెడ్డి

AIPC Aditya Reddy: ప్రజా దీవెన న్యూ ఢిల్లీ: ఆల్ ఇండి యా కాంగ్రెస్ కమిటీ అనుబంధ సం స్థ ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాం గ్రెస్ ( ఏఐపిసి ) హెల్త్ కేర్ ప్రొఫెషన ల్స్ నేషనల్ హెడ్ గా డాక్టర్ జీ. ఆ దిత్య రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆలిండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు ప్రవీణ్ చక్రవర్తి శుక్రవారం నియామక పత్రా న్ని ఆదిత్య రెడ్డికి అందజేశారు.వనపర్తి జిల్లా గోపాల్ పేట మండ లం జయన్న తిరుమలాపూర్ గ్రా మానికి చెందిన దాక్టర్ ఆదిత్య రెడ్డి ప్రస్తుతం ప్రొఫెషనల్ కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ గా బాధ్యతలు నిర్వ హిస్తున్నారు.

ఈయన రాష్ట్ర ప్రణా ళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి పెద్ద కుమారుడు కావ డం గమనార్హం. ఆదిత్య రెడ్డి ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ హెల్త్ కేర్ నేషనల్ హెడ్ గా నియమితు లు కావడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోoది.ఏఐపిసి హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ డాక్టర్ ఆదిత్య రెడ్డి దేశంలోని 28 రాష్ట్రాల్లో విస్తృతం గా ప్రొఫెషనల్ కాంగ్రెస్ కృషి చేయా లని జాతీయ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి సూచించారు.దేశంలోని అన్ని రా ష్ట్రాల్లో ఏఐపిసి కాంగ్రెస్ పార్టీ బలో పేతానికి కృషి చేస్తానని, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ను సమీకరిస్తానని డా క్టర్ ఆదిత్య రెడ్డి పేర్కొన్నారు.తన నియామకానికి కృషి చేసిన ఎఐసి సి లోక్ సభ ప్రధాన ప్రతిపక్ష నాయ కులు రాహుల్ గాంధీ, అధినాయ కురాలు సోనియా గాంధీ, ఎంపీ ప్రి యాంక గాంధీ, ఏఐపిసి చైర్మన్ ప్రవీ ణ్ చక్రవర్తి లకు డాక్టర్ ఆదిత్య రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.