గుజరాత్‌లో ఘోర విమాన ప్రమా దం
–ప్రమాద ఘటనలో 230 మంది ప్ర యాణికులు, 12మంది సిబ్బంది దుర్మరణం
–టేకాఫ్ సమయంలో కేవలం కొన్ని నిమిషాలకే కుప్పకూలిన వైనం
–వీరిలో 169 మంది భారతీయు లు, 53 మంది బ్రిటిష్ , 1 కెనడి య న్, 7 మంది పోర్చుగీస్ జాతీయు లు
–ప్రధానితో సహా ప్రముఖుల ది గ్ర్భాంతి, నివాళులు
Airplane Clash: ప్రజా దీవెన, గుజరాత్: గుజరాత్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుం ది. అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ నుం చి లండన్‌కు బయలుదేరిన విమా నం టేకాఫ్ అయిన కేవలం కొన్ని ని మిషాలకే కుప్పకూలింది. ఈ ప్ర మా ద ఘటనలో 230 మంది ప్ర యాణి కులు , 12 మంది సిబ్బంది మొత్తం గా విమానంలో ఉన్న 242 మంది మరణించారని సమాచారం. ఇం దులో గుజరాత్ మాజీ సీఎం విజ య్ రూపాని సైతం మరణించినట్లు వార్తలు విని పిస్తున్నాయి. వీరిలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ వారు, 1 కెనడియన్, 7 మంది పో ర్చుగీస్ జాతీయులు ఉన్నారని అధికారిక సమాచారం అందుతోంది. గాయపడిన వ్యక్తుల ను సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ప్రయాణీకుల సమాచారం కోసం 1800 5691 444 అనే ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు.
మేఘాని ప్రాంతంలో ఎయిర్ ఇం డియా విమానం కూలిన తరువాత ఆకాశంలో దట్టమైన పొగ వ్యాపిం చింది. టేకాఫ్ కాగానే విమానం కు ప్పకూలింది. సంఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు.. మంటలను ఆర్పేందుకు ప్రయత్ని స్తున్నారు.విమానంలో చాలామంది ప్రయాణికులు ఉన్నారని పేర్కొంటు న్నారు. ప్రమాదం తరువాత ఆకా శంలో దట్టమైన పొగ వ్యాపించింది. టేకాఫ్ కాగానే విమానం కుప్ప కూ లింది. సంఘటనా స్థలానికి చేరుకు న్న సహాయక బృందాలు మంటల ను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు సమీ పంలో ఈ ఘటన జరిగింది. జనా వాసాలపై విమానం కూలినట్లు చెబుతున్నారు. మంటలను అగ్ని మాపక సిబ్బంది ఆర్పుతున్నారు. అహ్మదాబాద్‌లో టేకాఫ్ సమయం లో ఈ ప్రమాదం జరిగింది. విమా నం వెనుక భాగం చెట్టును ఢీకొట్టిం దని సమాచారం. విమానం అహ్మ దాబాద్ నుండి లండన్‌కు వెళుతుం డగా. విమానంలో 230 మంది ప్ర యాణికులు ఉన్నారని చెబుతు న్నారు. కాగా, ఈ విమానంలో గుజ రాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నట్లు తెలుస్తోం ది. ఈ పెద్ద ప్రమాదంలో వస్త్రపూర్ వర కు పొగలు కనిపిస్తున్నాయి. ఈ విమానం నివాస ప్రాంతంలో కూలి పోయిందని సమాచారం అందుతోం ది. ప్రమాదం తర్వాత అనేక రోడ్లు మూసుకుపోయాయి.
దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధా ని నరేంద్ర మోదీ అహ్మదాబాద్ లో జరిగిన విషాదకర విమాన ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇది మాటల్లో చెప్పలేని హృదయ విదారక ఘటన. ఈ విషాద సమయంలో ఈ ఘటనతో ప్రభావితమైన ప్రతి ఒక్కరి పట్ల నా ఆలోచనలు, సానుభూతి ఉన్నాయి.బాధితులకు సహాయం అందించేందుకు కృషి చేస్తున్న మంత్రులు మరియు అధికారులు తో నిరంతరం సంప్రదింపుల్లో ఉన్నాను అని అధికారిక ప్రకటనలో తెలిపారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దిగ్ర్భాంతి… అహ్మదాబాద్ వి మాన ప్రమాదంపై కాంగ్రెస్ నేత రాbహుల్ గాంధీ స్పందించారు. ఈ ఘటనను ఆయన “హృదయ విదా రకమైన విషాదం”గా అభివర్ణిస్తూ, బాధితుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. “ప్రయాణికులు మరియు సిబ్బంది కుటుంబాలు అనుభవిస్తున్న బాధ మరియు ఆందోళన మాటల్లో వ్యక్తం చేయలే నిది. పరిపాలనవంతంగా అత్యవ సరంగా రక్షణ చర్యలు, సహాయ చర్యలు చేపట్టడం అత్యంత కీల కం. ప్రతి ప్రాణం ముఖ్యం, ప్రతి సెక ను కీలకమే” అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో సహాయ చర్యల్లో భాగస్వాములై ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
విమాన ప్రమాదంపై రాష్ట్రపతి ట్వీట్ ….అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం గురించి తెలుసు కుని నేను తీవ్రంగా కలత చెంది ఉ న్నాను. ఇది హృదయాన్ని కలిచివే సే విషాదకర ఘటన. ఈ ప్రమాదం లో ప్రభావితమైన వారందరిపట్ల నా ఆలోచనలు, ప్రార్థనలు ఉన్నాయి. ఈ మాటల్లో వివరించలేని దుఃఖ సమయంలో దేశం అంతా వారి వెంట ఉంది అని అధికారికంగా ప్రకటించారు.
విమాన ప్రమాదంపై రష్యా రా యబారి సంతాపం అహ్మదాబాద్ విమాన ప్రమాదం పై భారత్‌లోని రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ స్పందించారు. ఈ ఘటనను ఆయ న “హృదయ విదారకమైన”దిగా అ భివర్ణించారు. “ఇది ఒక విషాదకర మైన పెద్ద విపత్తు. ఈ సందర్భంలో భారత ప్రభుత్వం మరియు ప్రజల పట్ల నా పూర్తి సానుభూతిని తెలి యజేస్తున్నాను” అని ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు.
దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన విదే శాంగ మంత్రి జైశంకర్ … అహ్మ దాబాద్‌లో లండన్‌కు వెళ్తున్న ఎయి ర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైన ఘటనపై కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తీవ్ర దిగ్భ్రాం తి వ్యక్తం చేశారు. “ఈ విషాదకర సంఘటన గురించి తెలిసి నేను తీ వ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. ప్ర మాదంలో ఉన్న ప్రయాణికులు మరియు వారి కుటుంబాలందరితో మా ప్రార్థనలు ఉన్నాయి” అని ఆయన తన అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.