–పరిశ్రమలు, ఫ్యాక్టరీల తనిఖీ కి జిల్లాస్థాయి ప్రత్యేక కమిటీ
–జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
ప్రజాదీవెన నల్గొండ : నల్లగొండ జిల్లాలోని పరిశ్రమలు, ఫ్యాక్టరీలలో తక్షణ తనిఖీలు చేసేందుకై జిల్లాస్థాయి కమిటీని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నియమించారు. డిప్యూటి చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, నల్లగొండ, జిల్లా ఫైర్ ఆఫీసర్, జిఎం పరిశ్రమల శాఖ, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ నల్గొండ లతో కలిసి కలెక్టర్ గురువారం తన ఛాంబర్‌లో సమావేశం నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా, పాశమైలారం ప్రాంతంలో 30 జూన్ 2025న జరిగిన భారీ విస్ఫోటన ఘటనకు గురైన తర్వాత భద్రతా సమస్యలపై చర్చించారు.
ఈ సమావేశం తెలంగాణ ప్రభుత్వం లేబర్, ఎంప్లాయ్‌మెంట్, ట్రైనింగ్, ఫ్యాక్టరీను డిపార్ట్‌మెంట్ జారీ చేసిన G.O. Rt. No. 331, ఆధారంగా, జిల్లా కలెక్టర్ అధిక రిస్క్ ఫ్యాక్టరీలు, పరిశ్రమలను తక్షణమే తనిఖీ చేయడానికి జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రసాయన, ఔషధ యూనిట్‌ల నుండి తనిఖీ ప్రారంభం కానుంది. పురోగతిని సమీక్షించేందుకు ఈనెల 23న మధ్యాహ్నం 3 గంటలకు రివ్యూ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తనిఖీలు దశలవారీగా నిర్వహించబడతాయని, మొదటి దశలో అన్ని రసాయన, ఔషధ ఫ్యాక్టరీలను ఒక నెలలోపు తనిఖీ చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.