Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Alla Nani: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ఆళ్ల నాని చేరికకు మార్గం సుగమం..

రేపే టీడీ పీకి గూటికి మాజీ డిప్యూటీ సీఎం

ప్రజా దీవెన,అమరావతి: ఏపీ మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత ఆళ్ల నాని తెలుగుదేశం పార్టీలోకి చేరెందుకు మార్గం సుగమమైంది. తెలుగు తమ్ముళ్లు బహిరంగంగా ఎంత వ్యతిరేకించిన చివరికి అధిష్టానం నిర్ణయానికి తలవంచక తప్పలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొంత కాలానికే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పిన ఆయన టీడీపీలో చేరేందుకు సిద్ధం అయ్యారు. అయితే, స్థానిక నేత లు తీవ్రంగా వ్యతిరేకించడంతో అప్పుడు తాత్కాలికంగా వాయిదా పడినా, ఇప్పుడు టీడీపీ గ్రీన్‌ సిగ్న ల్‌ ఇచ్చేసింది.

దీంతో రేపు ఉద యం 11 గంటలకు టీడీపీ అధి నేత, ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు సమక్షంలో పసుపు కండువా కప్పుకోనున్నారు ఆళ్ల నాని, కాగా కొంత మంది కార్య కర్తలు ఆళ్ల నాని చేరికపై తీవ్ర అ సంతృప్తితో ఉన్నారని ఏదేమైన టీడీపీ క్రమశిక్షణకు మారుపేరని ఆళ్ల నాని చేరిక విషయంలో అధి ష్టాన నిర్ణయం శిరోధార్యమని స్ప ష్టం చేశారు ఎమ్మెల్యే బడేటి.