Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Almatii Gates: ఆల్మట్టి గేట్లు ఎత్తివేత

–ప్రాజెక్టుకు లక్ష క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో
–65 వేల క్యూసెక్కుల నీరు విడు దల

Almatii Gates:ప్రజా దీవెన, హైదరాబాద్‌: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కర్ణాటకలోని ఆల్మట్టి (Almatii Gates) జలాశయానికి వరద పోటెత్తుతోంది. మంగళవారం సాయంత్రానికి ప్రాజెక్టుకు 1,04,000 క్యూసెక్కల వరద (A flood of 1,04,000 cusecs)వచ్చి చేరుతోంది. ఆల్మట్టి సామర్థ్యం 129.72 టీఎం సీలు కాగా, ప్రస్తుతం జలాశయంలో 99.24 టీఎంసీల నీరు ఉంది. పై నుంచి వరద భారీగా వస్తుండటం తో జల విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా 40 వేల క్యూసెక్కులు, 14 గేట్లను ఎత్తి మరో 25 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. నారాయ ణపూర్‌ జలాశయం సామర్థ్యం 37.64 టీఎంసీలు కాగా ప్రాజెక్టులో 28.76 టీఎంసీల నీరు ఉంది. ఇన్‌ఫ్లో 65 వేల క్యూసెక్కులు ఉండటంతో ఒక్క రోజులోనే ఈ ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది.

ఇప్పటికే జూరాల జలాశయం (Jurala Reservoir)నిండి ఉండటంతో శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరుగులు పెట్టే అవకాశం ఉంది. మరోవైపు, శ్రీశైలం జలాశయానికి 2,496 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొన సాగుతోంది. ప్రాజెక్టులో జలవి ద్యుత్‌ ఉత్పాదన ద్వారా 32,262 క్యూసెక్కులను నాగార్జున సాగర్‌కు వదులుతున్నారు. తుంగభద్ర (Tungabhadra)పూర్తిస్థాయి నీటిమట్టం 105.79 టీఎంసీలు కాగా ప్రస్తుతం 35.47 టీఎంసీలకు చేరుకున్నది. మంగ ళవారం ప్రాజెక్టుకు 28,153 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. ఈ నెల 15న జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో నిర్ణయాలకు అనుగు ణంగా సాగర్‌ నుంచి తాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేయ డానికి వీలుగా కృష్ణా బోర్డు మంగళవారం ఆదేశాలు ఇచ్చింది. 4.5 టీఎంసీలను సాగర్‌ కుడి కాలువ నుంచి ఏపీకి, 5.4 టీఎం సీలను తెలంగాణకు విడుదల చేయాలని బోర్డు ఆదేశించింది. బుధవారం నుంచి 5,500 క్యూ సెక్కులను సాగర్‌ కుడి కాలువ నుంచి ఏపీకి విడుదల చేయాలని బోర్డు నిర్దేశించింది.