–మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
ప్రజాదీవెన నల్లగొండ టౌన్ : టీఎస్ యుటిఎఫ్, జన విజ్ఞాన వేదిక నల్లగొండ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్లో ఉగాది పచ్చడి వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ ఉగాది షడ్రుసుల నిలయమని ఈ పండగ నుండి ప్రకృతి పానీయాలు సేవిస్తూ కృత్రిమ పానీయాలు మానుకోవాలి అన్నారు. కృత్రిమ పానీయాల వల్ల అనారోగ్యాలకు గురవుతున్నారని సోషల్ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేయటం వల్ల జంక్ ఫుడ్స్ లాంటివి ఎక్కువ వాడుతున్నారని దీనివల్ల ఆరోగ్యాలకు నష్టం జరుగుతుందని చెప్పారు. ఈ ఉగాది నుండి ప్రభుత్వ విద్యా రంగ రక్షణ కొరకు ఉపాధ్యాయులందరూ పనిచేయాలని తెలిపారు.
మారో ముఖ్య అతిథి అడిషనల్ ఎస్పీ రమేష్ మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక యుటిఎఫ్ ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ఈ ఉగాది నుండి ప్రతి ఒక్కరు ఆరోగ్యాలపై శ్రద్ధ పెట్టి కాపాడుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎం. రాజశేఖర్ రెడ్డి, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి నన్నూరి వెంకటరమణారెడ్డి, టీఎస్ యుటిఎఫ్ నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ళ వెంకటేశం, ఉపాధ్యక్షులు నర్రా శేఖర్ రెడ్డి, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి, టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఆరుణ, జిల్లా కార్యదర్శి నరసింహ, నలపరాజు వెంకన్న, పి. సైదులు, మురళయ్య, రవీందర్, ఎర్ర నాగుల సైదులు, కె. మధుసూదన్, ఇప్టికార్ అలీ, రవీందర్, రమణ, విమల, సంధ్య తదితరులు పాల్గొన్నారు.