Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Political Deception: అప్పుడూ ఇప్పుడూ ఎల్లప్పుడూ అబద్ధాలే 

–సీఎం రేవంత్ రెడ్డి రాజ్యాంగబద్ధ మైన పదవిలో ఉంటూ అన్ని అబ ద్దాలే మాట్లాడుతున్నడు

–గురుదక్షిణ చెల్లిస్తూ తెలంగాణ నీ టి హక్కులకు మరణశాసనం

–తెలంగాణ భవన్ వేదికగా మీడి యా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ లపై మాజీ మంత్రి హరీష్ నిప్పులు

–సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలను ఆ ధారాలతో సహా ఎండగట్టేప్రయత్నం

–ప్రజాభవన్ వేదికగా గోదావరి బన కచర్ల పై రేవంత్, చంద్రబాబు మధ్య చీకటి ఒప్పందమంటూ ఫైర్

Political Deception : ప్రజా దీవెన, హైదరాబాద్: ముఖ్య మంత్రిగా బాధ్యతగా మాట్లాడుతా డు అనుకుంటే, రాజ్యాంగబద్ధమై న పదవిలో ఉంటూ అన్ని అబద్దాలే మాట్లాడుతున్నడు రేవంత్ రెడ్డి

ప్రతిపక్షంలో అబద్దాలు, అధికారం లో అబద్దాలు మాట్లాడుతున్నడని మాజీమంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ధ్వజమెత్తా రు. అబద్దాలు, తప్పులు మాట్లాడి నప్పుడు పాఠకులకు, ప్రజలకు వా ర్తలు చేరవేయాల్సిన బాధ్యత మీడి యాపై ఉందని వినతి చేస్తున్నామ ని, రాష్ట్రాన్ని సాధించి, దిక్సూచిగా నిలిచిన పార్టీ బిఆర్ఎస్. రాష్ట్ర ప్ర యోజనాలే మాకు ముఖ్యం కానీ అధికార పక్షం, రేవంత్ రెడ్డి ప్రజల హక్కులు కేంద్రంగా కాకుండా రాజకీ యాలే కేంద్రంగా బురద జల్లుతు న్నారని తీవ్ర స్థాయిలో మండి పడ్డా రు. తెలంగాణ భవన్ వేదికగా బుధ వారం నిర్వహించిన మీడియా స మావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, మం త్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లపై మాజీ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరి గారు. మీడియా సమక్షంలో ఆయ న చేసిన వ్యాఖ్యలు ఆయన మాట ల్లోనే…

 

*క్రాస్ చెక్ చేసి వార్తలు రాయా లని కోరుతున్నా.* …అధికారిక ప్రజెంటేషన్ అయితే ఎందుకు అం దరు ఎమ్మెల్యేలను పిలువలేదు.

అది హైదరాబాద్ లో ఇచ్చినట్లు లేదు, అమరావతిలో ఇచ్చినట్లు ఉంది. పీపీటీ తెలంగాణ ప్రభుత్వం తయారు చేసిందా, లేక ఏపీ తయా రు చేసిందా. బనకచర్లను ఆపాలని చిత్తశుద్ది ఉంటే మీరు చంద్రబాబు కేంద్రానికి రాసిన లేఖలు, ఆయన మాట్లాడిన మాటలు గాని చూపాలి

కాళేశ్వరంను, పాలమూరు, డిండి, తుమ్మిళ్ల, భక్తరామ దాసు వంటి అ నేక ప్రాజెక్టును చంద్రబాబు అడ్డు కున్నడు.

 

ఎందుకు ఒక్క ముక్క కూడా పీపీ టీలో చూపించలేదు. బనకచర్ల కట్టే బాబు బంగారం లెక్క కనిపిస్తే, బిఆ ర్ఎస్ సచ్చిన పాము లెక్క కనిపిస్తు న్నది రేవంత్ రెడ్డికి.నీకు నిద్రలో కూ డా గులాబి జెండా కనిపిస్తున్నది.

కేంద్రంలో మీ పార్టీ 11 సంవత్సరా లుగా అధికారానికి దూరంగా ఉం ది, అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఒక్క ఎమ్మెల్యే సీటు గెలవలేదు, అంత మాత్రాన కాంగ్రెస్ సచ్చిన పాలు అ య్యిందా. సచ్చిన పాము లాంటి చ వకబారు ముచ్చట్లు రాహుల్ కు చె ప్పు.

 

*ఎమ్మెల్సీ నీ సొంత జిల్లాలో గెలి చినం..* …అధ:పాతాళానికి ప్రజ లు తొక్కుతారు, అహంకారంతో మాట్లాడితే బాసన్ల గురించి తెలిసి నంత సులువు కాదు, బేసిన్ల గురిం చి తెలుసుకోవడం, భయం లేని కో డి బజార్ల గుడ్డు పెట్టినట్లు ఉంది,

బనకచర్ల మీద బొంకుడు రాజకీ యాలు బంద్ పెట్టు, బ్యాగులు మో సి బ్యాడ్ మెన్ గా పేరు తెచ్చుకున్న డు.బనకచర్ల కోసం బొంకు మెన్ గా మారిండు. టెక్నికల్ గా కాంగ్రెస్ ము ఖ్యమంత్రివి కానీ, హృదయం ఇంకా తెలుగుదేశంలోనే ఉంది.స్కూల్ ఏ జ్ కాలేజ్ ఏజ్ లో ఉన్న చంద్రబాబు తో నీ అనుబంధం మరిచిపోవడం లేదు. జులై 6, 2024 నాడు ప్రజా భవన్ కు చంద్రబాబును పిలిచి వి భజన హామిల ముసుగులో గో దా వరి బనకచర్ల మధ్య చీకటి ఒప్పం దం జరిగింది.ప్రజాభవన్ వేదికగా తెలంగాణ నీటి హక్కులకు మరణ శాసనం రాసిండు రేవంత్ రెడ్డి. సె ప్టెంబర్ 13, 20 24 నాడు ఉత్తం కుమార్ రెడ్డి సతీ సమేతంగా విజ యవాడలో చంద్రబాబును కలిసి బెజవాడ బజ్జీలు తిని బనకచర్లకు మద్దతు చెప్పివచ్చిండు.

 

ఈక్రమంలోనే నవంబర్15, 2024 నాడు Ap – Gb లింక్ కు సహకరిం చాలని నిర్మలా సీతారామన్ కు చం ద్రబాబు లేఖ, ఆ తర్వాత వెంటనే డిసెంబర్ 31, 2024 నాడు నిర్మల కు మరో లేఖ. 80 వేల కోట్లు ప్రాజె క్టు కోసం ఆర్థిక సాయం అందిం చా లని కోరిన చంద్రబాబు. గోదావరి నీళ్ల తరలింపు కుట్రలు జరుగుతుం టే తనకేం తెలియనట్లు మౌనంగా ఉన్నడు, నటించిండు రేవంత్ రెడ్డి ఈ చీకటి అధ్యాయం బయట పడ దు అనుకున్నడు.మాకు రేవంత్, బాబు కుట్రలు తెలియగానే నిలదీ శాం. జనవరి 24, 2025 నాడు మొ ట్ట మొదట నేను తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి అడిగిన. గడ్డి పీ కుతున్నరా అని ప్రశ్నించిన. అప్పు డు నిద్ర లేచి 22 జనవరి తేదీతో రాసినట్లు లేఖ సృష్టించి మీడియా కు విడుదల చేశారు.జూన్ 14, 20 25 నాడు నేను పీపీటీ పెట్టి ప్రభు త్వాన్ని ప్రశ్నిస్తే, అదే రోజు పాత డే ట్ వేసి లెటర్ విడుదల చేసారు.

అసలు గోదావరి బనకచర్ల మీద పోరాడింది బిఆర్ఎస్, కర్రు కాల్చి వాత పెట్టింది బిఆర్ఎస్.

*రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికి పోయిండు..* అపెక్స్ కమిటీ మీ టింగ్ లో బనకచర్ల అనే పదం ఉం దా రేవంత్ రెడ్డి ఎందుకు సిగ్గు లే కుండా మాట్లాడుతున్నవు.ఒక్క పే రా చదివి ఎజెండా 5లో చెప్పిన అం శాలను ఎందుకు చదవలేదు.వరద జలాల వినియోగంలో రెండు రా ష్ట్రాలు ఉపయోగ పడే విధంగా, ఆమోదయోగ్యంగా వాడుకునేం దుకు సంప్రదింపులు చేసుకోవాలని ఉంది. అంతే గాని అందులో బనక చర్ల అని ఉందా, నీళ్ళు తరలించు కుపో అని ఉందా ఎందుకు ఇంత చి ల్లరగా మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి.చంద్రబాబు ముందుకు రాలే దు, జగన్ ముందుకు రాలేదు, అది ముందుకు పడలేదు, ఇప్పుడు ముందుకు ఎలా పోతున్నది. బాబు ను ప్రజా భవన్ పిలించిండు, ఉత్త మ్ కుమార్ రెడ్డి బెజవాడ పోయి బజ్జీలు తిని అమోదం తెలిపిండు.

ఎజెండా 5లో తెలంగాణ అనుమతి లేకుండా నీళ్ల డైవర్షన్ కు ఒప్పుకునే ది లేదని చెప్పిండు కేసీఆర్ నువ్వు రాసిన పీపీటీలోనే బనకచర్ల అనేది లేదు. నువ్వు హెడ్డింగ్ కావాలని 20 16 గోదావరి పెన్నా అనుసంధానం అని పెట్టినవు,ఇంత చిల్లరగా, ఇం త చిచోరగా ఉన్నవు.

 

దమ్ముంటే అసెంబ్లీ పెట్టు వాస్తవాలు బట్టబయలు చేస్తం. మైక్ కట్ చే యకు, కెమెరా తిప్పకు.అపెక్స్ లో గోదావరి పెన్నా గాని, బనకచర్ల అ ని గాని ఎక్కడా లేదు.కేసీఆర్ మొ త్తం నీళ్ళు వదిలేసిండు అంటడు రేవంత్ రెడ్డి.2.10.2020 నాడు కేసీ ఆర్ గజేంద్ర సింగ్ షకావత్ కు లేఖ రాసారు. అందులో ఏముంది 300 0 టిఎంసీల మిగులు జలాలు సగ టున ఉంటున్నాయి. ప్రస్తుతం ఉ న్న 968 కాక, ఈ మూడు వేలలో వాటా కావాలని, మొత్తం 2918 టిఎంసీలు తెలంగాణ హక్కు అని స్పష్టంగా కేసీఆర్ రాసారు. గోదా వరిలో వెయ్యి, కృష్ణాలో 500 టీఎం సీలు ఇచ్చి ఏమైనా చేసుకో అన్న డు మొన్న. నువ్వెవడివి తెలంగాణ హక్కులు వదిలి పెట్టడానికి. అంటే నిన్న రేవంత్ రెడ్డి మాట మార్చిండు

వరద జలాల్లోనూ వాటా కావాలని నిన్న అంటున్నడు. 3000 టీఎం సీలు అనేది ఓసారి బ్రహ్మ పదార్థం అంటడు, రాచపుండు అంటడు రేవంత్ రెడ్డి.

 

ఈ లెక్క చెప్పింది ఎవరు సిడబ్లుసీ చెప్పింది.సముద్రంలో కలిసే జలా లు 58 ఏండ్ల సగటు 3వేల టీఎం సీల దాకా ఉంది.ఇది తెల్వక రేవం త్ రెడ్డి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతు న్నడు. నదీ మార్గంలో నీళ్లు తేవాల ని ఆనాడు కేసీఆర్, జగన్ తో అన్న రు.అది కాదని భూభాగంలో నీళ్లు తరలించే ప్రయత్నం మొదలు పెట్టా రు.కేసీఆర్ ఆదేశాల మేరకు 2022 లో నేను ఢిల్లీ వెళ్లి షకావత్ కి లేఖ అందించాను.గోదావరి పెన్నా లింక్ అడ్డుకోవాలని కోరాను. గోదావరి బ నకచర్ల ప్రాజెక్టులో కృష్ణి నీళ్ల మళ్లిం పు కూడా ఉంది.

 

*డీపీఆర్ లో క్లియర్ గా పేర్కొ న్నారు.* …రెండు నదుల నీళ్లు కొల్ల గొడుతామని చెప్పారు. నాగార్జున సాగర్ కుడి కాల్వను డబుల్ చేసి, రోజుకు 2 టిఎంసీల చొప్పున వరద జలాల పేరిట బొల్లపల్లి రిజర్వాయ ర్ కు తరలిస్తామంటున్నరు. ఒక వైపు గోదావరి, మరోవైపు కృష్ణా నీ ళ్ల తరలింపు కోసమే గోదావరి బ నకచర్ల, ఏ విధంగా చూసినా గో దావరి బనకచర్ల తెలంగాణకు మ రణ శాసనం కాబోతున్నది. నువ్వు అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ తెలం గాణ ద్రోహివే. నీళ్లు ఏపీకి దారాద త్తం చేసి తెలంగాణ ద్రోహిగా మి గిలిపోకు రేవంత్ రెడ్డి.

 

*299:512 ద్రోహం కాంగ్రెస్ పార్టీ దే…* తెలంగాణకు పట్టిన అబద్దా ల వైరస్ ఈ రేవంత్ రెడ్డి అబద్దాల వైరస్ కు విరుగుడు బిఆర్ఎస్ అనే టీకా, బయట వాళ్లకు సద్దులు కడు తూ ఇంటి మనిషిపై నిందలు వేస్తు న్నడు, తెలంగాణ సాధించింది కేసీ ఆర్, సెక్షన్ 3 సాధించి కృష్ణాలో నీ టి వాటా సాధించేందుకు కృషి చేస్తు న్నడు కేసీఆర్.299:512 హక్కుల విషయంలో కేసీఆర్, హరీశ్ రావు సంతకం పెట్టిండు అని చూపిస్తవా, నేను పదవికి రాజీనామా చేస్తా

గోదావరిలో 968 ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అయితే, కృష్ణాలో 299:512 ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే కదా

18.10.2013 నాడు ఉమ్మడి ఏపీ జస్టిస్ శ్రీ కృష్ణ కమిటికి రిపోర్టు ఇ చ్చింది. ఇదే రిపోర్టును శాసనసభ లోనూ పెట్టారు.తెలంగాణకు కృష్ణా లో 299, ఏపీకి 512 ఇచ్చినమని ఉంటుంది.ఎవరు మరణ శాసనం రాసారు తెలంగాణ నీటిహక్కులకు.

మీ చేతగాని తనం, అడుగులకు మడుగులొత్తడం వల్ల 299 వాటా పరిమితం అయ్యింది.అన్ని డ్యా క్యుమెంట్లు విడుదల చేసేందుకు నేను సిద్దం. తెలంగాణ నీటి హ క్కులు కాపాడంలో మీడియా క్రియా శీలక పాత్ర పోశించాలని చేతులెత్తి మొక్కుతున్నా. అడ్ హక్ కు, ఫైన ల్ అవార్డుకు తేడా తెలియని అ జ్ఞాని రేవంత్ రెడ్డి.2015 జున్ 26 లో చేసుకున్న అగ్రిమెంట్ తాత్కాలి క ఒప్పందం అని లేఖలో ఉంటుం ది.మీ ముద్దుల అడ్వైజర్ ఆది త్యా నాథ్ సంతకం పెట్టిండు. ఆయనే ఇ ప్పుడు నీ అడ్వైజర్. తెలంగాణ హ క్కులకు ఆనాడు వ్యతిరేకంగా మా ట్లాడిండు.

 

తెలంగాణ హక్కులను కాలరాసిన వ్యక్తిని సలహాదారుడిగా పెట్టుకు న్నవు, బాబు చెప్పు చేతుల్లో ఉన్న వా, తెలంగాణకు పని చేస్తున్నవా

గురుదక్షిణ చెల్లించాలనే తపనే త ప్ప నీకు తెలంగాణ నీటి ప్రయోజ నాలు పట్టవు.కేఆర్ఎంబికి ప్రాజె క్టులు అప్పగించాలని జోషి అంటే, లేదు లేదు అప్పగించాలని చెప్పిన వ్యక్తి ఆదిత్యా నాథ్ దాస్. అలాంటి వ్యక్తిని సలహాదారుడిగా పెట్టుకున్న డు. ఈ తాత్కాలిక ఒప్పందంపై సం తకం ఎవరు పెట్టారు మీ సలహాదా రుడు.కానీ రేవంత్ రెడ్డి నేను పెట్టి న, కేసీఆర్ పెట్టిండు అంటడు.

జులై 14, 2014 నాడు కృష్ణాలో 29 9 అన్యాయం అని కేంద్రానికి లేఖ రాసినం. రాష్ట్రం వచ్చిన 42 రోజు ల్లోనే ఆనాటి కాంగ్రెస్ మాకు అన్యా యం చేసింది, కొత్త ట్రిబ్యునల్ వేసి నదీ పరివాహక ప్రాంతం ఆధారంగా కేంద్రాన్ని కోరినం. తెలంగాణ పట్ల మా చిత్తశుద్దికి, నిజాయితీకి నిదర్శ నం ఇది.299 కాక, 581 టీఎంసీలు మాకు కావాలని, ఈ లెక్కంత తేలా లంటే ట్రిబ్యునల్ వేసి పంచాలని 2 2 పేజీల లేఖ రాసినం.299ని మేం ఒప్పుకోలేదు. ఇది కాంగ్రెస్ పార్టీ రా సిన మరణ శాసనం.తాత్కాలిక ఒ ప్పందాన్ని చూపి శాశ్వత ఒప్పందం అని అబద్దాలు చెబుతున్నడు రేవం త్ రెడ్డి. 299 లెక్కుకు ద్రోహి ఆది త్యానాథ్ దాస్, అయన పెట్టిందే ఈ రాచపుండు.ట్రిబ్యునల్ వేయడం లో ఆలస్యం అవుతుందని మొదటి అపెక్స్ కౌన్సిల్ 2016లో చెప్పినం.

రెండో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో అడిగితే షకావత్ గారు సుప్రీం కో ర్టులో కేసు వాపస్ తీసుకోవాలని చెప్పిండు.అప్పుడు కేసు విత్ డ్రా చేసుకొని, సెక్షన్ 3ని సాధించింది బిఆర్ఎస్.

 

299 శాశ్వత ఒప్పందం మేము చేసుకుంటే, సెక్షన్ 3 ఎందుకు అ డిగాము, అపెక్స్ కౌన్సిల్ ఎందుకు పోయాము, ఎందుకు సుప్రీంకు పో యాము.సెక్షన్ 3పై తెలంగాణ వా దనలు ముగింపు దశలో ఉన్నాయి. 2025లో ఈ ఏడాది 763 టీఎంసీ లు మనకు వచ్చే అవకాశం ఉంది.

ఈ అమాయక చక్రవర్తి 500 టిఎం సీలు చాలు అని అన్నడు. ఇవి ప్ర భావితం చేస్తాయి. కేసీఆర్ విజ యం, బిఆర్ఎస్ విజయం. అవార్డు రాబోతున్నది ఈ ఏడాది. 17.2.2 025 నాడు రేవంత్ రెడ్డి చేసుకున్న అగ్రిమెంట్ లో ఏముంది. అవే తా త్కాలిక ఒప్పందం చేసుకొని వ చ్చిండు.నువ్వు చేసింది ఏముంది రే వంత్ రెడ్డి.అందులో ఏముంది ఫైన ల్ అవార్డు వచ్చే దాక 50:50 చేసు కుందామని మీ సెక్రెటరీ రాసిండు.

అదే డిమాండ్ ను బిఆర్ఎస్ 28 లెటర్లు రాసి అడిగింది.299 మేము ఒప్పుకోము అని ఎంత ప్రయత్నం చేసినం. పోరాడినం.ఈరోజు తర్వా త 299 కు బిఆర్ఎస్ ఒప్పుకున్నది అని ఎవరైనా అంటే నాలుక చీరే స్తం.

 

*పచ్చి అబద్ధాలు సిగ్గుచేటు….*

ప్రాజెక్టులు కట్టలేదు, నీళ్లు ఇవ్వలే దు అనడం సిగ్గుచేటు. కృష్ణా బేసిన్ లో తెలంగాణ ఏం ప్రాజెక్టులు కట్ట లేదు అని రేవంత్ రెడ్డి సిగ్గు లేకుం డా మాట్లాడిండు.వాస్తవాలు చెబు తా తలకాయ యాడ పెట్టుకుంటవు రేవంత్ రెడ్డి కల్వకుర్తి, నెట్టెంపాడు, బీ మా, కోయిల్ సాగర్, తుమ్మిళ్ల, జూరాల కెనాల్ మోడ్రనైజేషన్, మి షన్ కాకతీయ ద్వారా ఉమ్మడి మ హబూబ్ నగర్ లో 10 లక్షల ఎక రాలకు నీళ్ళు ఇచ్చింది కేసీఆర్.

పాలమూరు ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇవ్వాలని 28వేల కోట్లు ఖర్చు చే సాం. నాలుగు రిజర్వాయర్లు పూర్తి అయ్యాయి.చంద్రబాబు కాళ్లల్ల కట్టె లు పెట్టిండు, కేసులు వేసిండు.

ప్యా కేజీ 3లో బండ పగలకొడితే నీళ్లు వస్తయి.చంద్రబాబు బంగా రం, పని మాత్రం చేయవు, నీళ్ళు ఇవ్వవు.గుడ్డు వచ్చి పిల్లను వెక్కి రించినట్లు రేవంత్ నీళ్ల గురించి, కే సీఆర్ గురించి మాట్లాడటం.తండ్రి చనిపోతే కరెంటు లేక నెత్తి మీద నీ ళ్ళు పోసుకొని వచ్చినా అని రేవం త్ అసెంబ్లీలో మాట్లాడిండు. ఈరో జు పాలమూరు ఎట్ల పచ్చబడ్డది, ఎన్ని నీళ్లు పోతున్నయి. కల్వకుర్తి మోటార్లు ఎందుకు ఆన్ చేయడం లేదు, ఎందుకు రిజర్వాయర్లు నిం పడం లేదు.కేసీఆర్ కట్టిన చెక్ డ్యాం ల వల్ల, చెరువులు బాగు చేయడం వల్ల, 10లక్షల ఎకరాలకు నీళ్ళు ఇ వ్వడం వల్ల పాలమూరు పచ్చబ డ్డది.

 

బిఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్లలో 48 ల క్షల ఎకరాల 74వేల ఎకరాలకు నీ ళ్ళు ఇచ్చినం.17లక్షల కొత్త ఆయ కట్టు, 31 లక్షల స్థిరీకరణ చేసినం.

అది మా కమిట్ మెంట్. రేవంత్ రె డ్డి నువ్వు ఒక చెరువు నింపినవా, చెక్ డ్యాం కట్టినవా.ఏడాదిలో ఆరు లక్షల ఎకరాలకు నీళ్ళు అన్నవు అ సెంబ్లీలో, రెండో ఏడాది ఆరు అన్న వు.హెలికాప్టర్ నేనే పెడుతా పోదా మా.10లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తే నేను దుంకుత, లేదంటే హెలికాప్టర్ నుంచి దుంకుతవా.

 

 

*ప్రాజెక్టుల అప్పగింత ఎవరి కాలంలో జరిగింది.* అధికారం ఇలా కాంగ్రెస్ చేతికి వచ్చిందో లేదో అలా ప్రాజెక్టులను అప్పగించేందు కు ఒప్పుకున్నరు.రెండు నెలల్లోనే కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించే పని మొదలు పెట్టారు.కేసీఆర్ అడు గడుగునా అడ్డుకుంటే కాంగ్రెస్ ప్ర భుత్వం తెలంగాణ ప్రయోజనాల ను ఢిల్లీకి తాకట్టు పెట్టే ప్రయత్నం చేసింది.అక్కడ మొదలైంది తెలం గాణ నదీ జలాల హక్కుల హన నం.ప్రాజెక్టులు అప్పగిస్తే తెలంగా ణకు జరిగే నష్టం గురించి హెచ్చరిం చినం.కేసీఆర్ నల్లగండ సభ పెట్టి గ ర్జిస్తే, కేఆర్ఎంబీ కి ప్రాజెక్టులు అ ప్పచెప్పబోమని కాంగ్రెస్ ప్రకటించిం ది. 2016 అపెక్స్ లో చంద్రబాబు నాడు ప్రాజెక్టులు అప్పగించాలంటే, కేసీఆర్ కేడబ్లుడిటి అవార్డు తేలే దా కా ప్రాజెక్టులు అప్పగించేది లేదు అన్నరు. కేంద్రం కూడా ఇచ్చేది లే దు, ఇది పెండింగ్ ఉంటది అని చెప్పింది.ఇందంతా మీటింగ్ మిన ట్స్ లో ఉంది.

 

ప్రాజెక్టులు అప్పగించాలని ఆది త్యానాథ్ దాస్ అంటే, ఇచ్చేది లేద ని జోషి అన్నరు.ఎప్పుడు ఏపీ అ డిగినా ప్రాజెక్టులు ఇచ్చేది లేదు అన్నం.కాంగ్రెస్ అధికారంలోకి రా గానే 17జనవరి 2024 నాడు ప్రాజెక్టులు అప్పగించింది. నా గార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను నెల రోజుల్లో అప్పగిస్తం అని ఒప్పు కున్నరు.సీఆర్పీఎఫ్, కేఆర్ఎంబీ అనుమతితోనే ఇంజినీర్లను ప్రాజెక్టు వద్దకు అనుమతించేందుకు ఒ ప్పు కొని వచ్చారు. అసెంబ్లీలో సైతం తీ ర్మానం చేయించి, తెలంగాణ నీటి హక్కులను కాపాడింది బిఆర్ఎస్, కేసీఆర్

 

 

*కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డిది ఫెవి కాల్ బంధం…..* కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి మధ్య ఫెవికాల్ బంధం. ఇద్దరి మధ్య ల వ్. ఇద్దరు కలిసి తెలంగాణ నీటి ప్ర యోజనాలు దెబ్బ తీసారు.ఆనాడు 85 పియ్యర్స్ లో ఒక్క పియ్యర్ కుంగితే వెంటనే ఎన్డీఎస్ఏకు లేఖ రాసిండు కిషన్ రెడ్డి.ఎస్ఎల్బీసీ భవిష్యత్తు ప్రశ్నార్థకం అయితే ఎం దుకు మాట్లాడవు కిషన్ రెడ్డి, ఎం దుకు ఎన్డీఎస్ఏకు లేఖ రాయవు.

5000 కోట్ల ప్రాజెక్టు ఆగం అయితే ఎందుకు మాట్లాడవు. కిషన్ రెడ్డి, రేవంత్ మద్య ఉన్న బంధం ఏమి టి.పియ్యర్ కుంగితే ఎన్డీఎస్ఏ వ చ్చింది, ప్రాజెక్టు కుంగితే ఎందుకు రారు. కృష్ణాలో గత పదేండ్లలో ఎ ప్పుడూ వాడనంత తక్కువ నీటిని 28శాతం వాడిన ఘనత కాంగ్రెస్ ప్ర భుత్వానిది.ఉన్న తాత్కాలిక ఒప్పం దం ప్రకారం కూడా నీళ్లు వాడని దద్దమ్మ ప్రభుత్వం మీది.

 

*ఉత్తమ్ కుమార్ రెడ్డి కనీస అ వగాహన లేకుండా మాట్లా డు తున్నాడు* ఉత్తం కుమార్ రెడ్డి తాను కూడా రేవంత్ రెడ్డి లాగా అబద్దాలు మాట్లాడి ముఖ్యమంత్రి అవుదామని చూస్తున్నట్లు ఉన్నడు.

ఎంతో కష్టపడి సీతారామకు అను మతులు తెచ్చినం అని గొప్పలు చె ప్పుకుంటున్నడు. 2023లోనే బిఆ ర్ఎస్ ప్రభుత్వ హాయంలో సీతారా మ లిఫ్ట్ ఇరిగేషన్, సీతమ్మ సాగర్ కు 25 అనుమతులు వచ్చాయి. ఇందులో హైడ్రాలజీ, పర్యావరణం సహా అన్ని అనుమతులు ఉన్నా యిఅసెంబ్లీలో మాట్లాడుదామా హ రీశ్ రావు అన్నడు.రేపు ఉదయం అసెంబ్లీ పెడితే నేను చర్చించేందు కు సిద్దం, కానీ ఒక్క కండీషన్ మైక్ కట్ చేయొద్దు, 15 రోజులు కృష్ణా, 15 రోజులు గోదావరి మీద మొత్తం నెల రోజులు మాట్లాడుదాం. శాసన సభకు సభా నాయకుడివి ఎమ్మెల్యే ఉత్తరం రాస్తే సభ పెడుతవా, రేపే పెట్టు అసెంబ్లీ, ఎంత సేపైనా మా ట్లాడు. అడ్జర్న్ చేయొద్దు, పారిపో వద్దు, మీరు ప్రజెంటేషన్ చేయి, మాకు ప్రెజెంటేషన్ చేసే అవకాశం ఇవ్వుమీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరు ధ్ రెడ్డి అంటున్నడు, బనకచర్ల మీ ద ఉత్తరాలు రాయడం కాదు,

చంద్రబాబు కోవర్టులు ఉన్నరు తె లంగాణలో అంటున్నడు. ఆ కోవర్టు ఎవరో అనిరుద్ చెబితే బాగుటుంది

కేసీఆర్ వాటర్ మ్యాన్ అయితే, రే వంత్ రెడ్డి వాటా మ్యాన్.అదృష్టం బాగుండి సీఎం అయ్యావు, ఐదేళ్లు ఉండు. మంచిగ చేయి.ఇప్పటికే ను వ్వు తెలంగాణ ద్రోహిగా చరిత్రలో ఎక్కావు.తెలంగాణ ద్రోహి లిస్టులో మొదటి పేరు నీదే, కానీ రాష్ట్ర ద్రో హిగా మిగలకు అంటూ హితవు పలికారు. నీళ్లలో తెలంగాణకు అ న్యాయం చేయకు, నిజాయితీగా పని చేయకుకుక్క తోకవంకర అ న్నట్లు అబద్దాలు మాట్లాడటం బం ద్ చేయాలని సూచించారు.