–గత పెట్టుబడుల ఆగమనానికి ప్రయత్నాలు ప్రారంభం
–ముందుకొచ్చిన జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంటు తో శుభారంభం
–ఎక్స్ఎల్ఆర్ఐకి భూములు అప్ప గించేందుకు సీఆర్డీఏ సిద్ధo
Amaravati: ప్రజా దీవెన, అమరరావతి: ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతికి (Amaravati)మళ్లీ మంచి రోజులు రాబోతున్నాయి. గడిచిన ప్రభుత్వంలో గత ఐదేళ్లుగా అమరావతి పేరే (The name is Amaravati) వినిపించినప్పటికి ఆనవాళ్ళు కనిపించలేదు. ఏపికి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక అమరావతిపై ప్రత్యేక దృష్టి సారిం చారు. రాజధాని ప్రాంతంలో (capital region) ఏపుగా పెరిగిన ముళ్ల చెట్లను తొలగించి, రోడ్లను క్లియర్ చేయడం ద్వారా ఆగిపోయిన పనులను మళ్లీ ప్రారం భించారు. అదే సమయంలో అమరావతిలో పెట్టుబడులకు ప్రయ త్నాలు ప్రారంభించారు. ఈ క్రమం లో అమరావతికి శుభారంభం పలు కుతూ జేవియర్ స్కూల్ ఆఫ్ మేనే జ్మెంట్ అనే సంస్థ పెట్టుబడుల కు ముందుకొచ్చి శుభారంభం పలి కింది. మేనేజ్మెంట్ ఇనిస్టిట్యూ ట్లో (Management Institute) దేశంలోనే ఈ సంస్థకు మంచి ప్రాచుర్యం పొందింది.
అహ్మదాబాద్ ఐఐఎం (IIM Ahmedabad) తర్వాతి స్థానం ఈ సంస్థదే కావడం గమనార్హం. మేనేజ్ మెంట్ కోర్సుల్లో తరగతుల నిర్వహణ, శిక్షణలో ఎక్స్ఎల్ఆర్ఐకి మంచి పేరుగాంచింది. గతంలో టీడీపీ ప్రభుత్వ (TDP Govt)హయాంలో ఈ సంస్థకు 50 ఎక రాలు కేటాయించిన సీఆర్డీఏ భూ మిని కూడా రిజిస్టర్ చేసింది. అయి తే తర్వాత వచ్చిన వైసీపీప్రభుత్వం అభివృద్ధి పనులకు అడ్డుపడడం తో ఎక్స్ఎల్ఆర్ఐ పనులు నిలిపివే సి వెనక్కి వెళ్లిపోయింది. మళ్లీ ప్రస్తు తం చంద్రబాబు ముఖ్యమంత్రి కా వడంతో ఇనిస్టిట్యూట్ ఏర్పాటుకు సంస్థ ముందుకు వచ్చింది. కేటా యించిన భూములు అప్పగిస్తే నిర్మా ణాలకు సిద్ధంగా ఉన్నట్టు ప్రభుత్వా నికి తెలిపింది. ఈ నేపథ్యంలో ఎక్స్ ఎల్ఆర్ఐకి భూములు అప్పగించేం దుకు సీఆర్డీఏ (CRDA)సిద్ధమైంది. దాదా పు రూ.250 కోట్ల వ్యయంతో భవ నాలను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.