Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Ambedkar Jayanti : అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి

–మాదిగల ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

Ambedkar Jayanti : ప్రజా దీవేన, కోదాడ: కోదాడ మున్సిపల్ పరిధిలోని తమ్మర బండ పాలెం స్థానిక రెండో వార్డ్, నాలుగో వార్డు లలొ అంబేద్కర్ యూత్, మాదిగల ఆధ్వర్యంలో భారతరత్న, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాతకాలనీ కొత్త కాలనీలలో అంబేద్కర్ చిత్రపటానికి అంబేద్కర్ యూత్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,దేశ ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంతోపాటు సాంఘిక,ఆర్థిక,రాజకీయ సమ న్యాయం ఉండాలని తన జీవితాన్ని అంకితం చేసిన రాజ్యాంగ రూపకర్త, భారతరత్న.

డా.బీఆర్.అంబేద్కర్ అని కొనియాడారు, యువత అంబేద్కర్ ఆశయాలను సాధించిన నాడే మనం ఆయనకు ఇచ్చే ఘన నివ్వాలని తెలిపారు, అలాగే త్వరలో కొత్త కాలనీ పాత కాలనీలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి తీసుకువచ్చిన విగ్రహాలను తమ్మర గ్రామములో పెద్ద ఎత్తున బైకు ర్యాలీలతో డప్పు వాయిద్యాలతో ఊరేగింపు నిర్వహించారు ఊరేగింపులో పెద్ద ఎత్తున యువత మహిళలు జై భీమ్ నినాదాలతో నీలిమి జెండాలను చేత భూని కదం తొక్కారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ కమిటీ యూత్ సభ్యులు మహిళలు యువతి, యువకులు పిల్లలు తదితరులు పాల్గొన్నారు అనంతరం పాత కాలనీలో కొత్త కాలనీలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు